
సాక్షి, విజయవాడ: ఉచిత విద్యుత్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, రైతులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిందే వైఎస్సార్ అని అన్నారు. పగటిపూట 9 గంటల పాటు సీఎం జగన్ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని తెలిపారు.
రైతుల ఉచిత విద్యుత్ కోసం రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతుకి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ వ్యతిరేకి అని మండిపడ్డారు. తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న విషయాన్ని రైతులు మర్చిపోలేదని చెప్పారు. విద్యుత్ బకాయిలు పెంచి రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. కేంద్రం సూచించిన నిబంధనలను రైతులకు మేలు చేసేలా మార్చామని తెలిపారు. సీఎంగా జగన్ ఉన్నంతవరకు ఉచిత విద్యుత్ అందిస్తామని బాలినేని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment