Collect From Congress: Karnataka Villagers Refusal To Pay Electricity Bill, Video Viral - Sakshi
Sakshi News home page

కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్‌ నుంచి వసూలు చేసుకోండి!

Published Tue, May 16 2023 9:09 AM | Last Updated on Tue, May 16 2023 10:46 AM

Karnataka Villagers Refusal to Pay Electricity Bill Goes Viral - Sakshi

సాక్షి, బెంగళూరు: ‘‘మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని కర్ణాటకలో ఓ గ్రామస్థులు తెగేసి చెప్పారు. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బకాయిలతో సహా కరెంటు బిల్లులన్నీ కట్టాలన్న బిల్లు కలెక్టర్‌ గోపిని గ్రామస్థులు ఎదురు తిరిగారు.

ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల హామీ ఇచ్చింది గనక  గ్రామస్తులు తమ కరెంటు బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. ఎన్నికల బిల్లులను ఆ పార్టీ నుంచే వసూలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో చేసేది లేక ఆయన వెనుదిరిగాడు. కాగా అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది.
చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement