villegers
-
గ్రామసభలు గరంగరం జనగర్జన షూరూ
-
‘కుక్కకు ప్రేమతో’.. 13వ రోజున శాంతి హోమం, అన్నదానం!
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని బిజ్రోల్ గ్రామంలో ఒక వీధికుక్క మృతి చెందిన నేపధ్యంలో దానికి గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దాని ఆత్మశాంతి కోసం శాంతిహోమం నిర్వహించారు. అది మృతిచెందిన 13వ రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. గ్రామస్తులంతా ఒక చోట చేరి, ఆ కుక్కకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతూ ప్రార్థనలు కూడా చేశారు. వివరాల్లోకి వెళితే బాగపత్లోని బిజ్రోల్ గ్రామంలో ఉంటున్న వీధి కుక్క టామీ ఉరఫ్ మున్నా అక్కడి అన్ని గల్లీలోనూ తిరిగేది. ఆ కుక్కను గ్రామస్తులంతా ఎంతో ప్రేమగా చూసేవారు. అది గ్రామస్తులందరికీ ఎంతో దగ్గరయ్యింది. అయితే అది ఆగస్టు 6న తన 12 ఏళ్ల వయసులో మృతి చెందింది. దీంతో గ్రామస్తులంతా ఎంతో బాధపడ్డారు. దాని ఆత్మ శాంతించాలని పలురకాల కార్యక్రమాలు నిర్వహించారు. 13వ రోజున సామూహక అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. గ్రామానికి చెందిన శ్రవణ్ సింగ్ మాట్లాడుతూ టామీ అంటే గ్రామంలోని అందరికీ ఎంతో ఇష్టమని, దాని గుణాలు తమను ఎంతో ఆకట్టుకునేవని అన్నారు. ఆ కుక్క మృతిచెందిన 13వ రోజున 500 మందికి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. కుసుమ అనే గృహిణి మాట్లాడుతూ టామీని తాము తమ పిల్లగా చూసుకునేవారమని, అది ఎంతో తెలివైనదని అన్నారు. అది ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదన్నారు. ఇది కూడా చదవండి: భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. గుండె గుభేల్మనిపిస్తున్న వీడియో..! -
కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి!
సాక్షి, బెంగళూరు: ‘‘మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని కర్ణాటకలో ఓ గ్రామస్థులు తెగేసి చెప్పారు. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బకాయిలతో సహా కరెంటు బిల్లులన్నీ కట్టాలన్న బిల్లు కలెక్టర్ గోపిని గ్రామస్థులు ఎదురు తిరిగారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది గనక గ్రామస్తులు తమ కరెంటు బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. ఎన్నికల బిల్లులను ఆ పార్టీ నుంచే వసూలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో చేసేది లేక ఆయన వెనుదిరిగాడు. కాగా అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. Villagers in Chitradurga refuse to pay electricity bill. Exhort others also not to pay! They tell the bill collector that Congress had promised them free electricity, as soon as they came to power… Go take it from them (Congress), they say… If Congress doesn’t give a CM soon,… pic.twitter.com/FNgGtwdPHM — Amit Malviya (@amitmalviya) May 15, 2023 -
భూమి పూజ చేసిన ప్రాంతాన్ని పాలతో శుద్ధి చేసిన గ్రామస్తులు
-
అమానవీయం: మహిళకు లిఫ్ట్ ఇచ్చినందుకు.. ఎంత పనిచేశారు..
గాంధీనగర్: గుజరాత్లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వ్యక్తి.. మోటర్ బైక్ ఎక్కినందుకు ఆ మహిళను సదరు గ్రామస్థులు సూటిపోటి మాటలతో వేధించారు. అంతటితో ఆగకుండా.. ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కూడా అంటగట్టారు. ఈ సంఘటన సబర్కాంత జిల్లాలోని సాంచేరీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హిమ్మత్ నగర్ పట్టణానికి సమీపంలోని సాంచేరీ గ్రామంలో 30 ఏళ్ల మహిళ జీవిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు. కాగా, ఆమె భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తుంది. ఈ క్రమంలో ఆమె.. గత నెల జులై 30న హిమ్మత్‌నగర్ పట్టణానికి బ్యాంక్ పని మీద వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం తన గ్రామానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆమెకు తెలిసిన ఒక వ్యక్తి.. తన మోటర్ బైక్ ఎక్కాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె తెలిసిన వ్యక్తి అని ఎక్కింది. కాగా, వారిద్దరు కలిసి సాంచేరీ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో కొంత మంది వారిద్దరిని చూసి దూశించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. పాపం.. భర్త చనిపోయిన మహిళ అని కూడా జాలీలేకుండా విచక్షణ రహితంగా అవమానించారు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా కుమిలిపోయింది. ఆరోపణలు చేసిన వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంది. దీంతో ఆమె గ్రామంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అకారణంగా తనకు వివాహేతర సంబంధం అంటగట్టినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో, స్థానిక పోలీసులు.. వేదాంశి చౌహన్, రాజుజీ చౌహన్, కలుసిన్హ్ చౌహన్, రాకేంన్షి చౌహన్, సురేఖ చౌహన్, సోనాల్ చౌహన్ లను అదుపులోనికి తీసుకున్నారు. నిందితులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మంత్రాలు చేస్తున్నారనే అనుమానం.. 30 మంది గ్రామస్తులు కలిసి..
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఒక కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ అవమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌లో జరిగింది. కాగా, పోలసర గ్రామానికి చెందిన బిమల్ నాయక్(45), చిరికిపాడ సాసన్ వద్ద మంత్రాలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. అందుకే, గడిచిన నెలన్నర కాలంలో సాసన్లో.. 6 గురు చనిపోయారని తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులంతా కలిసి నిన్న(ఆదివారం) మూకుమ్మడిగా బిమల్‌నాయక్ ఇంటిపై దాడిచేశారు. అతడిని బయటకులాగి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన వినలేదు. గ్రామస్తుల దాడిలో నాయక్ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న చిరికిపాడ పోలీసులు నాయక్‌ను, అతని కుటుంబ సభ్యులను బెర్హంపూర్‌లోని ఎంకేసీఐ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు 30 మంది గ్రామస్తులపై కేసును నమోదుచేసి, 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మరికొంత మంది కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని బెర్హంపూర్ పోలీసు అధికారి సూర్యమణి ప్రధాన్ తెలిపారు. -
బాలికపై అఘాయిత్యం.. అనుమానితులకు దేహశుద్ధి
సాక్షి, బరంపురం(భువనేశ్వర్): నగర శివారులోని తీరప్రాంతం సూన్‌పూర్ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై గొంతుకోసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురై.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు అనుమాతులను విద్యుత్ స్తంభానికి బంధించి, దేహశుద్ధి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న గొళంత్ర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారిని గ్రామంలోకి రానివ్వకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉధ్రిక్తత చోటు చేసుకుంది. బాధిత గ్రామస్తులు, ఐఐసి అధికారి బాబులినాయక్ తెలిపిన వివరాల ప్రకారం... గొళంత్ర పోలీసు స్టేషన్ పరిధిలోని మత్స్యకార గ్రామం సూన్పూర్లో ఏడేళ్ల బాలికను ఇంట్లో ఎవరూలేసి సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రామ శివారులోని పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై గొంతు కోసి హత్యకి ప్రత్నించారు. విషయం తెలుసుకున్న సూన్పూరు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గుర్తించి, అంబులైన్స్‌లో ఎంకేసీజీ మెడికల్‌కి తరలించారు పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. మరోవైపు ఘటనకు కారణమై ఉంటారన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పట్టుకున్న గ్రామస్తులు.. తీవ్ర ఆగ్రహంతో మూకుమ్మడిగా దాడి చేసి, చితక బాదారు. అనంతరం విద్యుత్ స్తంభానికి కట్టి, బంధించారు. సమాచారం అందకున్న గొళంత్రా పోలీసులు సూన్‌పూర్ గ్రామానికి చేరుకోగా.. స్థానికులు వారిని గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సూన్పూర్లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఎట్టకేలకు గ్రామస్తులకు నచ్చజెప్పి, గాయాలతో ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. నిందితులను పోలీసు స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ అధికారి తెలిపారు. -
పని ‘గట్టు’కుని పండిస్తున్నారు..!
రాజ్యాలు పోయాయి. రాజులూ పోయారు. కానీ రాచరికపు ఆనవాలుగా బంతిపూలు ఇప్పటికీ ఆ ఊరి గడపన గుభాళిస్తున్నాయి. వందల ఏళ్లుగా బంతితో పెనవేసుకుపోయిన వారి అనుబంధం ఇంకా పచ్చగానే పరిఢవిల్లుతోంది. ఒకప్పుడు వ్రతాలు, పూజల కోసం పొలం గట్లపై బంతిపూలను సాగు చేసిన రెంటికోట గ్రామస్తులకు ఇప్పుడు అదే జీవనాధారమైంది. అంతరపంటగా బంతి సాగు చేస్తున్నా.. అసలు ఆదాయాన్ని ఈ పంటే తెచ్చి పెడుతోంది. అదెలాగంటే.. కాశీబుగ్గ : రాజ వంశీయులకు, కుటుంబాలకు కోటలో జరిగే పూజలకు, వ్రతాలకు వినియోగించే పూలను అందించే గ్రామంగా రెంటికోట రెండు వందల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. ఈ గ్రామంలో ఎటుచూసినా బంతిపూలే కనిపిస్తుంటాయి. పంటపొలాల్లో పండిస్తున్న పంటలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అంతర పంటగా బంతిని పండిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రారంభించి సంక్రాంతి వెళ్లిన వరకు పూల సేకరణ కొనసాగిస్తారు. ఏ రోజుకు ఆరోజు చేతికందిన పూలను వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇంటి ఆవరణతోపాటు పంటపొలాలు, ఖాళీ స్థలాలను సైతం వినియోగిస్తుంటారు. ఏటా వివిధ రకాల మొక్కలతో పా టు బంతిపూలకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతర ప్రక్రియగా పండిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రా సరిహద్దుకు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ గ్రామంలో అధిక మంది ఒరియా వేషభాషలను పాటిస్తుంటారు. వీరంతా పలాస–కాశీబుగ్గ, మందస, గొప్పిలి, హరిపురం ప్రాంతాలకు పూలను తరలించి విక్రయిస్తుంటారు. అయ్యప్పస్వామి, భవానీ, శివ, గోవింద, శ్రీరా మ మాలలు వేసుకున్నవారే వీరి ప్రధాన కస్టమర్లు. పరిసర ప్రాంతాలలో ఎవరి ఇళ్లల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు చే సినా రెంటికోట గ్రామ బంతిపూలు ఉండాల్సిందే. ఆ మట్టితో విడదీయరాని బంధం.. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ విత్తనాలు ఎక్కడ చల్లినా మొక్కలవుతాయి. ప్రత్యేక సంరక్షణ అవసరం లేదు. బంతిపూలకైతే ప్రతి ఇంటి ఆవరణాన్ని వినియోగిస్తారు. సమీపంలోని తర్లాకోట రాజవారి కోటకు ఇక్కడి పూలను వినియోగించే వారని ప్రతీతి. పొలం గట్టును నమ్ముకుంటారు.. పొలాలను నమ్ముకుని పంటలను పండిస్తున్న రైతులను చూసి ఉంటాం గానీ పొలం గట్టును సైతం విడవకుండా అంతరపంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. సొంత పొలం లేకున్నా బంధువులు, మిత్రులకు సంబంధించిన పొలం గట్లపై అనుమతులు తీసుకుని బంతి మొక్కలను పెంచుతున్నారు. రోజుకు రూ.500 వరకు అమ్ముతాం వరి పంటలను పండిస్తున్న పంటతో సంబంధం లేకుండా బంతి పంటను పండిస్తాం. ఈ క్రమంలో సుమారు 300 మీటర్ల విస్తీర్ణంలో పంటను పండిస్తున్నాం. రోజుకు ఐదు వందల రూపాయలు వస్తుంది. ఒకోసారి వెయ్యి రెండు వేలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. పలాస, కాశీబుగ్గతో పాటు ఇతర పట్టణాల నుంచి స్వయంగా ఇంటికి వచ్చి మరీ కొనుగోలు చేస్తారు. – రంభ దొర, బంతిపూల సాగుచేసే మహిళా రైతు, రెంటికోట పరస్పరం పంటలకు రక్షణ.. రెంటికోట గ్రామంలో ఉన్న పంట పొలాల్లో బంగారం పండుతాయని చెప్పవచ్చు. ఇక్కడ మట్టి సారవంతమైనది. ఇక్కడ పంటలకు మధ్యలో ఉన్న గట్లపై బంతిని పెంచుతున్నాము. దీని ద్వారా పశువులు గట్లపైకి రావడానికి అవకాశం లేకుండా రక్షణగా ఉంటుంది. ఇదే క్రమంలో బంతి మొక్కలు పాడవకుండా వరిచేను రక్షణగా ఉంటుంది. గ్రామంలో వందల మంది మహిళలు పురుషులతో సంబంధం లేకుండా వీటిని పండిస్తారు. – పుచ్చకాయల కుమారి, మహిళారైతు, రెంటికోట -
చింతపండే ఉపాధి
హవేళిఘణాపూర్(మెదక్) : చింతపండు... నిత్యవసర వస్తువుల్లో ప్రతి రోజు ఏదో ఒక వంట(కూర)లో వాడుతుంటాం. కూరల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. చింతపండుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. హవేళిఘణాపూర్ మండల పరిధిలోని గంగాపూర్, కూచన్‌పల్లి, రాజ్పేట్, కొత్తపల్లి, బూర్గుపల్లి, వాడీ, శమ్నాపూర్ గ్రామ ప్రజలు చింతపండును సేకరించి, దానిని కొట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా చింతపండును సేకరించి కొందరు సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ఈ యేడు చింతపండు బాగా కాసిందని, గింజలతో ఉన్న చింతపండు కిలో రూ.40 నుంచి 50 వరకు విక్రయించగా...గింజలు లేని చింతపండు(కొట్టింది) కిలో రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. -
‘భూములు లాక్కుంటే పురుగులమందు తాగుతాం’
నంగునూరు(సిద్దిపేట): గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని డబుల్ బెడ్రూం ఇ ళ్ల కోసం తీసుకోవద్దని బద్దిపడగ గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1984లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామం లో తమకు ఇళ్ల స్థలాలను కేటాయించిందన్నారు. వివిధ కారణాలచేత తాము ఇం టి నిర్మాణాలు చేపట్టలేదన్నారు. దీన్ని సాకుగా తీసుకొని స్థానిక నాయకుల ప్రోద్బలంతో ప్రభుత్వం బలవంతంగా స్థలాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోం దని ఆరోపించారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటే పురుగుల మం దు తాగుతామని హెచ్చరించారు. వీరికి నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు దేవులపల్లి యాదగిరి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యాద య్య, రాజు, చంద్రయ్య, లక్ష్మి, సారవ్వ, బాలవ్వ, రేణుక, మల్లవ్వ పాల్గొన్నారు. -
ఎక్సైజ్ అధికారులను స్తంభాలకు కట్టేసి...
సాక్షి, బరంపురం: గంజా జిల్లాలో అక్రమంగా నడుస్తున్న నాటు సారా దుకాణాలపై దాడికి వెళ్లిన ఎక్సైజ్ స్క్వాడ్‌పై గ్రామస్తులు ఎదురు దాడి చేసి వారిని చితకబాదారు. అంతటితో ఆగకుండా వారిని విద్యుత్ స్తంభాలకు కట్టేసి వారి యూనిఫారాలు విప్పి నిప్పుపెట్టి కాల్చివేశారు. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. గాయాలపాలైన ఎక్సైజ్ అధికారులకు తొలుత పత్రపూర్ సమితి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని పత్రపూర్ సమితి, జరడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మోసనిబడా గ్రామంలో కొద్ది రోజులుగా అక్రమ సారా దుకాణాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ స్క్వాడ్ ఆదివారం తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఎక్సైజ్ స్క్వాడ్ అధికారులపై గ్రామస్తులు ముకుమ్మడిగా దాడికి దిగారు. అధికారుల యూనిఫాం విప్పేసి వారిని విద్యుత్ స్తంభాలకు కట్టి చితకబాదారు. ఆగ్రహించిన జనం విద్యుత్ అధికారుల యూనిఫాంలకు నిప్పుపెట్టి తగులబెట్టారు. గ్రామంలో పోలీస్ బలగాలు ఈ విషాద సంఘటనలో నలుగురు అధికారులతో పాటు 10 మంది సిబ్బంది గాయపడ్డారు. మరో వైపు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నట్లు జరడ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి చెప్పారు. ప్రస్తుతం మోసనిబడా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో అదనపు పోలీసు బలగాలు మోహరించి శాంతి భద్రతలు పరివేక్షిస్తున్నారు. -
గ్రామస్తులపై సర్పంచ్ కత్తులతో దాడి
ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం టి. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ వత్సవాయి రామకృష్ణంరాజు బుధవారం విచక్షణ కోల్పోయాడు. మతిస్దిమితం కోల్పోయి గ్రామస్తులపై కత్తితో దాడికి ప్రయత్నం చేశాడు. దీంతో గ్రామస్తులు సీతమ్మచెరువుగట్టు వద్ద సర్పంచ్‌ను స్దంభానికి కట్టివేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భయం భయంగా
► నాగసానిపల్లెలో సర్వే నేపథ్యంలో గ్రామస్తుల్లో ఆందోళన ► ఖనిజ నిక్షేపాల పేరుతో గ్రామం ఖాళీ చేయాల్సి వస్తుందేమోనని భయం ► ఎవ్వరూ సరైన సమాచారం ఇవ్వడం లేదంటున్న గ్రామస్తులు ఖాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామంలో యురేనియం, అల్యూమినియం నిల్వలు ఉన్నాయని తెలియడంతో గ్రామంలోని ప్రజలు గత 20 రోజులుగా భయం భయంగా జీవిస్తున్నారు. ఏ క్షణంలో గ్రామం వదిలి వెళ్లాల్సి వస్తుందోననే భయం వారిని వెంటాడుతోంది. గ్రామంలో కొత్త వ్యక్తి కనిపిస్తే చాలు సార్ ఎందుకొచ్చారు.. అంటూ ఆరా తీస్తున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. ఖాజీపేట: నాగసానిపల్లె పంచాయతీలో సుమారు 1600 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ నాగసానిపల్లె, జయరాంపేట, సుగాలీతాండా, భాగ్యనగరం గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో భారీగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అధికారులు ఇక్కడ 20 రోజులు మకాం వేసి సర్వే చేపట్టడం ఇందుకు బలం చేకూరుస్తోంది. యురేనియం నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి ? ఎంత విస్తీర్ణంలో ఉన్నా యి ? నాణ్యమైన ఖనిజాలు ఉన్నాయా ? అసలు తవ్వకాలు జరుగుతాయా ? తవ్వకాలు జరిగితే ఎంతవరకు జరుగుతాయి ? నాగసానిపల్లె గ్రామం ఉంటుందా లేక ఖాళీ అవుతుందా ? పంటపొలాలు వది లేసి వెళ్లిపోవాల్సిందేనా? ఇలా పలు రకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లి అడుగుతుంటే తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వారు చెబుతున్నారు. దీంతో వారి లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. నాగసానిపల్లెలో మేలు రకం పంట భూములు: నాగసానిపల్లె చుట్టూ సారవంతమైన భూములు ఉన్నాయి. ఎక్కువగా వేరుశనగ, బొప్పాయి, మిరప, టమాటా, బెండకాయలు, శనగలు, వరి, పసుపు, ఇలా అనేక రకాల పంటలు సాగుచేస్తారు. ఏటా రెండు రకాల పంటలు పండిస్తూ మంచి దిగుబడి సాధించి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ఇంతటి సారవంతమైన భూములను వదిలేయాల్సి వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. డీకేటీ భూములు ఎక్కువగా ఉన్నాయి: నాగసానిపల్లె పరిసరాల్లో డీకేటీ భూములు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 8,293 ఎకరాల భూమి ఉంది. అందులో సర్వేనెంబర్ 330లో 645 ఎకరాలు, సర్వేనెంబర్ 323లో 64ఎకరాలు, సర్వేనంబర్ 333లో ఫారెస్ట్ భూమి 6149 ఎకరాలు, మాచుపల్లెలో 11 నెంబర్లు ఉన్నాయి, అందులో ఒక్క 11వ నెంబరులోనే సుమారు 2470 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమి తమదంటే తమదంటూ ఫారెస్టు, రెవెన్యూ అధికారులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే ఇప్పటికే ఆభూమి అంతా స్థానికులు పూర్తిగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతమేరకు భూమిని ప్రభుత్వం ఖనిజ తవ్వకాలకు తీసుకుంటుంది అనే దానిపై గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అధికారులు సమాచారం ఇవ్వాలి: అసలు మా గ్రామంలో ఏం జరుగుతోంది. ఖనిజనిక్షేపాలు ఉన్నాయా లేవా అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. మాకున్న భయాందోళనలు తొలగించాలి. ---- నక్కా సుబ్రమణ్యం, నాగసానిపల్లె ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ: మా గ్రామంలోకి ఎవ్వరు వచ్చినా సర్వే గురించే అడిగి తెలుసుకుంటున్నాం. కొందరు వ్యక్తులు వచ్చి మా గ్రామం ఉండదని అంటున్నారు. దీంతో ఆందోళన చెందుతున్నాం. --- పిట్టా గురవయ్య, భాగ్యనగరం సాగు భూములు ఉంటాయా పోతాయా: సర్వే జరిగినప్పటి నుంచి మా గ్రామం ఖాళీ చేయాలనే ప్రచారం నడుస్తోంది. గతంలో తెలుగుగంగ ముంపు ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్ప ుడు మా పరిస్థితి ఏమిటో.. --- పెద్దపోతు నారాయణ, భాగ్యనగరం పంటపొలాలు వదిలేయాల్సిందేనా?: బంగారం లాంటి పంటపొలాలను వదిలేయాల్సిందే అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎవ్వరిని అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదు. --- నక్కా వెంకటయ్య, నాగసానిపల్లె -
పునరావాస కాలనీ ఏర్పాటుకు స్థల పరిశీలన
కాసిపేట : సింగరేణి యాజమాన్యం నిర్మాణం చేపట్టనున్న కెకె ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసిత గ్రామం దుబ్బగూడెం గ్రామస్తులు శనివారం పునరావాస కాలనీ ఏర్పాటుకు సింగరేణి స్థలాన్ని పరిశీలించారు. సింగరేణి అధికారి సురేష్ ఆధ్వర్యంలో గ్రామం నుంచి 30మందిని బెల్లంపల్లి శివారులోని 68డీప్ ప్రాంతంలో ఉన్న సింగరేణి స్థలాన్ని చూపించారు. ప్రభుత్వం మంజూరు చేయనున్న డబుల్బెడ్రూం గహాలకు సైతం ఇక్కడే స్థలం కేటాయించడం జరుగుతుందని, దుబ్బగూడెం పునరావాసానికి సైతం అనుకూలంగా ఉంటుందని మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులు మందమర్రి శివారు, స్టేషన్‌పెద్దనపల్లి సమీపంలో, పెద్దనపల్లి శివారులలో ఉన్న భూములను సైతం పరిశీలించారు. ఎక్కడ నచ్చితే అక్కడ గ్రామస్తులు అంగీకరించినట్లయితె రెవెన్యూ అధికారులు భూములు ప్రభుత్వానివా, కొనుగోలు చేయడమా నిర్ణయం తీసుకుంటారన్నారు. 68డీప్ సింగరేణి ప్రాంతం కావడంతో ఎటువంటి సమస్య లేదని గ్రామస్తుల అభీష్టం మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. తాము చూసిన చోట్లలో ఎక్కడ ప్రభుత్వం ఇవ్వడానికి సాధ్యం అవుతుందో తెలిపినట్లయితే స్థలంపై నిర్ణయం ప్రకటిస్తామని గ్రామస్తులంతా ముక్తకంఠంతో తెలిపారు. -
నిర్మల్ జిల్లాలో వద్దేవద్దు
నిర్మల్ జిల్లాలో వద్దేవద్దు నిర్మల్ జిల్లా, విద్యార్థులు, రాస్తారోకో అఖిలపక్ష నాయకుల రిలేదీక్షలు విద్యార్థుల రాస్తారోకో జన్నారం : తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న మంచిర్యాల (కొమురంభీమ్) జిల్లాలోనే జన్నారం మండలాన్ని కలపాలని అఖిల పక్షం ఆధ్వరంలో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. మా మండలాన్ని నిర్మల్ జిల్లాలో కలుపాలని నిర్ణయిస్తూ చేసిన ప్రతిపాదనలను రద్దు చేసి మంచిర్యాల జిల్లాలోనే కలుపాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష కమిటీ కన్వీనర్ రియాజోద్దీన్ ఆధ్వర్యంలో గురువారం మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం పక్కన రిలేదీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రియాజోద్దీన్ మాట్లాడుతూ జన్నారం మండలం అన్ని విధాలుగా మంచిర్యాల జిల్లాలో కలిపితేనే సౌకర్యంగా ఉంటుందన్నారు. మండల ప్రజలు కూడా మంచిర్యాల జిల్లానే కోరుకుంటున్నారని, ఈ విషయంపై ప్రజాభిప్రాయం సేకరించి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతి కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై అధ్యాయన కమిటీ, జిల్లాకలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అఖిల పక్ష కమిటీ కోకన్వీనర్లు గుర్రం మోహన్‌రెడ్డి, సురేశ్, నాగరాజు, మల్యాల బాపన్న, సుభాష్‌రెడ్డి, లక్ష్మణ్, జక్కుల సురేశ్, నర్సింహులు, దేవయ్య, ప్రభుదాస్, అల్లం లచ్చన్న, రాజరత్నం, సంజీవ్ తదితరులు పాల్గోన్నారు. విద్యార్థుల రాస్తారోకో.. జన్నారం మండలాన్ని మంచిర్యాల జిల్లాలోనే కలుపాలని డిమాండ్ చేస్తూ గురువారం మండలకేంద్రంలో ఐటీఐ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులు అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అదే దారిలో వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ వచ్చి ఈ విషయాన్ని సీఎం దష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అదే విధంగా తహసీల్దార్ సత్యనారాయణ నిరహార దీక్ష ప్రాంతానికి వచ్చి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
వరంగల్జిల్లాలో చైన్ స్నాచర్కు దేహశుద్ది
-
ఈ ఊరోళ్లు... కుంగ్ ఫూ కింగ్‌లు!
పర్యాటక ఆసక్తికి భౌగోళిక అందాలు, విశిష్టతలు మాత్రమే కాదు...‘ప్రత్యేకతలు’ కూడా ప్రాముఖ్యత వహిస్తాయని చైనాలోని చిరు గ్రామం గంక్సీ డొంగ్ చెప్పకనే చెబుతుంది. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు... ఆడా మగా తేడా లేదు... ఆ ఊరు ఊరంతా కుంగ్ ఫూలో నిపుణులే! సెంట్రల్ చైనాలోని పచ్చటి తీయాంఝా కొండల మధ్యలో రహస్యంగా దాచినట్లుగా ఉంటుంది గంక్సీ డొంగ్. డొంగ్ తెగకు చెందిన ప్రజలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు.డొంగ్ ప్రజలు అనగానే వ్యవసాయంతో పాటు రకరకాల చేతికళా వృత్తులు గుర్తుకు వస్తాయి. చిత్రకళలో కూడా వీరికి మంచి ప్రావీణ్యం ఉంది. దైవం మీద ఎంత నమ్మకం ఉందో దెయ్యం, దుష్టశక్తుల మీద కూడా అంతే నమ్మకం ఉంది వీరికి. ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు ‘ఇది దుష్టశక్తి కుట్ర’ అనుకుంటారు వాళ్లు. ఆర్కిటెక్చర్లో అందమైన ప్రయోగాలు చేసే డొంగ్ ప్రజలకు తమవైన ప్రత్యేక పండగలు ఉన్నాయి. అయితే చైనాలోని మిగిలిన ప్రాంతాల్లో నివసించే డొంగ్ ప్రజలకు లేని ప్రత్యేకత... గంక్సీలో నివసించే డొంగ్లకు ఉంది. అదే కుంగ్ ఫూ! గంక్సీ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ కుంగ్ ఫూ నేర్చుకుంటారు. అయితే ప్రత్యేకతలో ప్రత్యేకత ఏమిటంటే, అందరూ ఒకేరకంగా కుంగ్ ఫూ చేయరు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇక్కడా అక్కడా అనే తేడా లేదు... ఏ ప్రదేశంలో అయినా సరే కుంగ్ ఫూ సాధన చేస్తారు. కొన్నిసార్లు ఆ సాధన బహిరంగ ప్రదేశాల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు జలజల పారుతున్న సెలయేటి నీటిలో ఉండొచ్చు, పచ్చటి కొండలపై కూడా ఉండొచ్చు! కుంగ్ ఫూ విద్యకు తమదైన సృజననాత్మకను అద్దుతున్నారు ఈ గ్రామస్తులు. అడవిలో నివసించే ఈ అడవి బిడ్డలు... పాము కదలికల్లో నుంచి, పులి పరుగుల నుంచి స్ఫూర్తి పొందుతూ... కుంగ్ ఫూలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేస్తున్నారు. నిజానికి గ్రామస్తుల ప్రధానవృత్తి వ్యవసాయమే అయినప్పటికీ... కుంగ్ ఫూయే తమ జీవనాధారం అన్నంతగా సాధన చేస్తారు. ‘‘ప్రకృతి శక్తిని, ప్రకృతిలోని అందాలను, కుంగ్ ఫూలోని సమస్త వైవిధ్యాలనూ కలిపి ఒక్కచోటే చూడాలంటే ఈ గ్రామాన్ని సందర్శించాల్సిందే’’ అంటున్నాడు అమెరికాకు చెందిన హ్యారిసన్ అనే పర్యాటకుడు. కుంగ్ ఫూ అంటే ఈ గ్రామస్తులకు ఎందుకంత ఇష్టం, ఈ ఇష్టం, ఆసక్తి, అంకితభావం వెనుక ఉన్న అసలు కారణమేమిటి అనేదానికి రకరకాల కారణాలు వినిపిస్తాయి. అందులో ప్రధానమైనవి రెండు. మొదటిది: ఒకప్పుడు గ్రామంలోకి క్రూర జంతువులు ప్రవేశించి తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణనష్టం కలిగించేవట. అలాంటి సమయంలో గ్రామపెద్దలు ఒక యువ దళాన్ని తయారుచేసి, కుంగ్ ఫూలో శిక్షణ ఇప్పించారు. నాటి నుంచీ గ్రామ రక్షణ బాధ్యతలను ఆ యువదళం తీసుకుంది. అడవి జంతువుల నుంచి గ్రామానికి ఎలాంటి నష్టం కలుగకుండా ఈ దళం కాపాడసాగింది. కాలక్రమంలో ఈ యువదళ సభ్యుల కుంగ్ ఫూ నైపుణ్యం... ఊళ్లోని ఆబాల గోపాలన్నీ ఆకట్టుకుంది. దాంతో అందరూ కుంగ్ ఫూ నేర్చుకోవడమే కాదు... ఆ విద్యలో తమదైన ప్రత్యేకతను ప్రదర్శించడం ప్రారంభించారు. రెండవది: డొంగ్ ప్రజలు గ్రామాన్ని నిర్మించు కుంటోన్న తొలిరోజుల్లో తరచూ దొంగల బారిన పడేవారట. ఈ దొంగల బెడదను తట్టుకోలేక వేరే ప్రాంతం నుంచి ఇద్దరు కుంగ్ ఫూ నిపుణులను రప్పించుకొని ఊళ్లో అందరూ కుంగ్ ఫూలో శిక్షణ తీసుకున్నారట. ఆ పరంపరే ఇప్పటికీ కొనసాగుతుందనేది ఒక కథనం. కుంగ్ ఫూ నేర్చుకోడానికి కారణాలు ఏవైనా... ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు పనిగట్టుకుని ఈ చిట్టి గ్రామాన్ని వెతుక్కుంటూ రావడానికి కారణం మాత్రం కుంగ్ ఫూయే! -
ఉల్లి లొల్లి
రైతుబజార్లలో క్యూ పల్లెవాసులకేదీ? ఉల్లి కోసం జనం బారులు తీరుతున్నారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మాత్రమే కిలో రూ.20 చొప్పున పంపిణీ చేస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటంటూ గ్రామీణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్(ముకరంపుర): ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు.. కానీ సీన్ రివర్సయ్యింది. ప్రస్తుతం ఉల్లి అంతటా లొల్లి చేస్తోంది. వర్షాభావం.. దిగుబడి.. దిగుమతులు లేక ఉల్లి కొరత నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై విక్రయించాలని నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 పలుకుతున్న ఉల్లిని మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.20కే అందిస్తోంది. ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని 6 రైతుబజార్లలో విక్రయిస్తోంది. కరీంనగర్‌లోని రెండు రైతుబజార్లు, సిరిసిల్ల, జగిత్యా ల, పెద్దపల్లి, మంథనిలోని ఒక్కో రైతుబజార్ కేంద్రంలో ప్రత్యేక విక్రయాలు చేస్తున్నారు. కుటుంబానికి 2 కిలోలే పంపిణీ చేస్తామని, ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరి అని నిబంధన విధించారు. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుని అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రాల్లో ప్రజల తాకిడి ఒకేలా ఉంటోంది. అక్కడక్కడా క్యూలైన్లో గొడవలు కూడా ముదురుతున్నాయి. మరోవైపు ఏదేని గుర్తింపు కార్డు తేవాలని చెప్పడంతో ప్రజలంతా ఆధార్‌కార్డుతో కొనుగోలు చేస్తుండడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు తల లు పట్టుకుంటున్నారు. ఆహారభద్రత కార్డు కుటుంబానికి ఒక్కటే ఉంటుంది. కానీ, ఆధార్‌కార్డు కుటుంబంలో ముగ్గురి నుంచి ఐదుగురు సభ్యుల వరకు ఉండే అవకాశముంది. ఒకే కుటుం బసభ్యులంతా వేర్వేరుగా ఉల్లిగడ్డలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి ఎదురైంది. జిల్లాకు ఇప్పటికే 26 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు వచ్చాయి. మరో 26 మెట్రిక్ టన్నుల కోసం ప్రతిపాదనలు పంపారు. నిరుపేదలుండే పల్లెలను వదిలి పట్టణవాసులకు మాత్రమే సబ్సిడీపై ఉల్లిని అందుబాటులో ఉంచడంపై గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ప్రజలు కిలో నాణ్యతను బట్టి కిలో రూ.50 నుంచి రూ.55కు కొనుగోలు చేస్తున్నారు. రెండు కిలోల ఉల్లిగడ్డల కిలోల కోసం తాము డివిజన్ కేంద్రాలకు వెళ్లాలా అని ప్రశ్నిస్తున్నారు. తమ కు కూడా పల్లెల్లో సబ్సిడీపై ఉల్లిగడ్డ అందించాలని కోరుతున్నారు. పాత సామగ్రికి ఉల్లిగడ్డలిచ్చే వ్యాపారులు సైతం ఇప్పుడు ఆలుగడ్డలు ఇస్తుండడం గమనార్హం.