నిర్మల్ జిల్లాలో వద్దేవద్దు
-
నిర్మల్ జిల్లాలో వద్దేవద్దు
-
నిర్మల్ జిల్లా, విద్యార్థులు, రాస్తారోకో
-
అఖిలపక్ష నాయకుల రిలేదీక్షలు
-
విద్యార్థుల రాస్తారోకో
జన్నారం : తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న మంచిర్యాల (కొమురంభీమ్) జిల్లాలోనే జన్నారం మండలాన్ని కలపాలని అఖిల పక్షం ఆధ్వరంలో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. మా మండలాన్ని నిర్మల్ జిల్లాలో కలుపాలని నిర్ణయిస్తూ చేసిన ప్రతిపాదనలను రద్దు చేసి మంచిర్యాల జిల్లాలోనే కలుపాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష కమిటీ కన్వీనర్ రియాజోద్దీన్ ఆధ్వర్యంలో గురువారం మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం పక్కన రిలేదీక్షలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రియాజోద్దీన్ మాట్లాడుతూ జన్నారం మండలం అన్ని విధాలుగా మంచిర్యాల జిల్లాలో కలిపితేనే సౌకర్యంగా ఉంటుందన్నారు. మండల ప్రజలు కూడా మంచిర్యాల జిల్లానే కోరుకుంటున్నారని, ఈ విషయంపై ప్రజాభిప్రాయం సేకరించి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతి కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై అధ్యాయన కమిటీ, జిల్లాకలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అఖిల పక్ష కమిటీ కోకన్వీనర్‌లు గుర్రం మోహన్‌రెడ్డి, సురేశ్, నాగరాజు, మల్యాల బాపన్న, సుభాష్‌రెడ్డి, లక్ష్మణ్, జక్కుల సురేశ్, నర్సింహులు, దేవయ్య, ప్రభుదాస్, అల్లం లచ్చన్న, రాజరత్నం, సంజీవ్ తదితరులు పాల్గోన్నారు.
విద్యార్థుల రాస్తారోకో..
జన్నారం మండలాన్ని మంచిర్యాల జిల్లాలోనే కలుపాలని డిమాండ్ చేస్తూ గురువారం మండలకేంద్రంలో ఐటీఐ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులు అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అదే దారిలో వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ వచ్చి ఈ విషయాన్ని సీఎం దష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అదే విధంగా తహసీల్దార్ సత్యనారాయణ నిరహార దీక్ష ప్రాంతానికి వచ్చి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.