
తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో గ్రామస్తుల నిరసన
నంగునూరు(సిద్దిపేట): గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని డబుల్ బెడ్‌రూం ఇ ళ్ల కోసం తీసుకోవద్దని బద్దిపడగ గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1984లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామం లో తమకు ఇళ్ల స్థలాలను కేటాయించిందన్నారు. వివిధ కారణాలచేత తాము ఇం టి నిర్మాణాలు చేపట్టలేదన్నారు. దీన్ని సాకుగా తీసుకొని స్థానిక నాయకుల ప్రోద్బలంతో ప్రభుత్వం బలవంతంగా స్థలాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోం దని ఆరోపించారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటే పురుగుల మం దు తాగుతామని హెచ్చరించారు. వీరికి నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు దేవులపల్లి యాదగిరి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యాద య్య, రాజు, చంద్రయ్య, లక్ష్మి, సారవ్వ, బాలవ్వ, రేణుక, మల్లవ్వ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment