రాయికల్(జగిత్యాల): పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంతో కొట్లాడింది తానే అని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె జగిత్యాల జిల్లా రాయికల్‌లో నిర్వహించిన బహిరంగసభ, ఆర్యవైశ్యుల సమావేశంలో మాట్లాడారు. పసుపు పంటకు మద్దతు ధర కోసం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు పలువురు ముఖ్యమంత్రులను కలిశామని గుర్తుచేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పసుపు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నేడు పసుపు రైతులపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన రాష్ట్ర కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారని తెలిపారు. 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలను మనం గెలిపించుకుంటే ఢిల్లీలో సమస్యలపై పోరాటం చేయవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment