yellow Board
-
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం: ధర్మపురి అర్వింద్
జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం జగిత్యాలలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామ న్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. గల్ఫ్‌లో ఉన్న రాష్ట్ర కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, అక్కడివారి సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు చర్య లు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సైతం కృషి చేస్తామన్నారు -
పసుపుబోర్డు కోసం కొట్లాడింది నేనే
రాయికల్(జగిత్యాల): పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంతో కొట్లాడింది తానే అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె జగిత్యాల జిల్లా రాయికల్‌లో నిర్వహించిన బహిరంగసభ, ఆర్యవైశ్యుల సమావేశంలో మాట్లాడారు. పసుపు పంటకు మద్దతు ధర కోసం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు పలువురు ముఖ్యమంత్రులను కలిశామని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పసుపు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నేడు పసుపు రైతులపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన రాష్ట్ర కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారని తెలిపారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను మనం గెలిపించుకుంటే ఢిల్లీలో సమస్యలపై పోరాటం చేయవచ్చని తెలిపారు. -
అంబేద్కర్ సాక్షిగా పసుపు బోర్డు సాధిస్తా..
ఆర్మూర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా పసుపు బోర్డును, ఎర్రజొన్నలకు కనీస మద్దతు ధరను, ఎన్ఆర్ఐ పాలసీని సాధిస్తానని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అబేద్కర్ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందర ఉ గాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ ప్రతిజ్ఞ చేశారు. ఈ మూడు సమస్యల పరి ష్కారం కోసం కృషి చేసి రైతులు, గల్ఫ్ బాధితుల రుణం తీర్చుకుంటానన్నారు. ఇచ్చిన మాటకు క ట్టుబడి తెలంగాణ అమరవీరుల బలిదానాలను చూడలేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్న సోనియాగాంధి రాజకీయ వారసుడైన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడబోయే ప్ర భుత్వం ద్వారా సత్వరమే పసుపు బోర్డును ఏర్పాటు చేపిస్తానన్నారు. వాణిజ్య పంట లైన పసుపు, ఎర్రజొన్నలను ఎంఎస్పీ ప రిధిలోకి తీసుకొని రైతులకు గిట్టుబాటు ధ ర ఇప్పించే విధంగా కృషి చేస్తానన్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టి అర్ధాకలితో అలమటిస్తున్న గల్ఫ్ బాధితుల కోసం గల్ఫ్ పాలసీని రూపొందింపజేస్తానన్నారు. దేశంలోని అన్ని పార్టీల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి పసుపు, ఎర్రజొ న్న రైతుల సమస్యలను పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను పార్లమెంట్‌కు పంపిం చాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షు డు పీసీ భోజన్న, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, ఆలూర్ గంగారెడ్డి, ఇట్టెం జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు పార్లమెంట్లో 'పసుపు బిల్లు'
న్యూఢిల్లీ: ఈ నెల లోక్‌సభలో టర్మెరిక్ బోర్డ్-2017 ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. పసుపు బోర్డు ఏర్పాటుకు మద్ధతు తెలపాలని కేంద్రానికి మహారాష్ట్ర సీఎం ఫడణవిస్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ లేఖలు రాశారని ఆమె తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే పసుపు రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆమె వివరించారు. ఈ విషయమై ఇప్పటి వరకు రెండు సార్లు ప్రధానమంత్రి మోదీని కలిసి, మాట్లాడానని ఆమె తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, రైతులతో ఢిల్లీకి కూడా వెళ్లామన్నారు. బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే పసుపు బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఎంపీ కవిత చెప్పారు. -
ఎంపీలూ.. మాట్లాడండి!
‘పసుపు బోర్డు’ కోసం రైతుల ఎదురుచూపులు మండలి ఏర్పడితే పచ్చ బంగారమే.. రైతులకు మద్దతు ధర అందే అవకాశం ఉమ్మడి జిల్లాలో 30,075 ఎకరాల్లో పసుపు సాగు ఇందులో 49శాతం ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లాలోనే.. నర్సంపేట : పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంట తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగిన రీతిలోనే పండుతోంది. జిల్లాలు విడిపోయాక పసుపు ఎక్కువగా పండే ప్రాంతం వరంగల్ రూరల్ జిల్లాలోకి వచ్చింది. అరుుతే, కొన్నేళ్లుగా చెప్పుకోదగిన రీతిలో ధర దక్కకపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్ వరంగల్ రూరల్ జిల్లాలో పసుపు మండలి(బోర్డు) ఏర్పాటుకు శ్రద్ధ తీసుకుంటే ఇక్కడి రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు చర్చించాలని పసుపు పండిస్తున్న రైతులు కోరుతున్నారు. రూరల్ జిల్లాలో అధికం.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో 30,075 ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంటను రైతులు పండిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కంటే ఈ ఐదు జిల్లాల్లోనే పసుపు ఎక్కువగా సాగు అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లాలో 14,897 ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. అంటే అవిభాజ్య వరంగల్ జిల్లాతో లెక్క కడితే మొత్తంలో 49.53 శాతం ఇక్కడే పండుతోంది. అరుుతే, ధరలో నిలకడ లేమితో రైతులు ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2010-11లో ఎండు పసుపు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.16వేల వరకు ధర పలకగా మరుసటి సంవత్సరం రూ.3 వేల నుంచి రూ.3500 వరకు పడిపోరుుంది. గత వేసవిలో సరాసరి రూ.6500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. పసుపు ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా సాగు ఖర్చులు పెరగడం, మద్దతు ధర లేనందున గిట్టుబాటు ధర దక్కడం గగనంగా మారుతోంది. పసుపు పంటకాలం 180 నుంచి 200 రోజులు కావడం, కూలీల కొరత, రసాయన ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరగడంతో ఎకరాకు రూ.30 వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కనీసం క్వింటాకు రూ.10వేల ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వచ్చిన దిగుబడిని విక్రరుుంచేందుకు అందుబాటులో మార్కెట్లు లేకపోవడం కూడా రైతుల నష్టానికి కారణమవుతోంది. మండలి ఏర్పడితే.. దేశంలోని సుగంధ ద్రవ్యాల మండలి ద్వారా ఏడాదికి రూ.11 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మిరప, అల్లం, ధనియాలు, మిరియాలు తదితర చాలా పంటలతో పాటుగా పసుపును కూడా ఈ మండలి ద్వారానే పంపిస్తారు. కానీ అన్ని రకాల పంటలకు కలిపి ఒకే బోర్డు ఉండటంతో రైతులకు సాగు సలహాలు సక్రమంగా అందటం లేదు. ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనం, యంత్ర పరికరాలతో పాటు పలు రకాల యంత్రాలు రారుుతీలపై అందుతారుు. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు దరి చేరుతారుు. పసుపును నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి వస్తారుు. పసుపును ఉడికించి పాలీషింగ్ చేయడంతో పాటుగా ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఏర్పాటవుతారుు.ప్రత్యేకంగా మార్కెట్ ఎగుమతి అవకాశాలు కలుగుతారుు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్లరుుతే రైతులకు అన్ని రకాలుగా ఉపకరించి సాగుకు లాభసాటిగా మారుతుంది. దీనికి గాను జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సీతారాంనాయక్, దయాకర్ పసుపుబోర్డు ఏర్పాటు, రైతులకు మద్దతు ధర దక్కేలా జాతీయ స్థారుులో మద్దతును కూడగట్టి కృషి చేయాల్సిన అవసరం ఉంది. -
పసుపు బోర్డు ఏర్పాటు చేయండి
కలెక్టరేట్: జిల్లా ప్రజలకిచ్చిన మాట మేరకు కల్వకుంట్ల కవిత ఎంపీగా తన తొలి లేఖ ద్వారా పసుపుబోర్డు కోసం విన్నవించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి ఎంపీ కవిత పసుపుబోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అనంతరం మద్దతు ధర 15వేలుగా నిర్ణయించాలని వినతిపత్రం సమర్పించారు. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో భారతదేశం నుంచే 70 శాతం పసుపు ఎగుమతి కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి 57 శాతం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి 16 శాతం ఉత్పత్తి అవుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆహార, వైద్యం, వాణిజ్య పరంగా కూడా అత్యంత ప్రాధాన్యత గల ఈ పసుపు పంటకు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పసుపుబోర్డు లేకపోవడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు లేకపోవడం వల్ల రైతులకు అవసరమైన శిక్షణ లేకపోవడం, నూతన వంగడాల పరిశోధనలు జరుగకపోవడం, మార్కెటింగ్‌కు సంబంధించిన అవకాశాలు మెరుగుపడకపోవడాన్ని కవిత మంత్రి దృష్టికి తెచ్చారు. బోర్డు లేకపోవడం వల్ల పంటకు అవసరమైన ఇతర వసతుల కోసం స్థానిక ప్రభుత్వాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆమె వివరించారు. జాతీయ స్థా యిలో ఒక విధానం అంటు ఉండకుండా పోతుందని , సరైన మద్దతు ధర ఉండడం లేదని కవిత తెలిపారు. టీ, కాఫీ, పొగాకులకు ఉన్నట్లు పసుపు పంటకు బోర్డు అవసరమని తెలిపారు. మద్దతు ధర లేకపోవడం వల్ల పసుపు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో పాటు నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు పసుపు పండించే పసుపు రైతాంగం దళారి వ్యవస్థ వల్ల ధరలో 20 నుంచి 30 శాతం నష్టపోవాల్సి వస్తుందని మంత్రికి ఆమె వివరించారు. పసుపు స్టోరేజ్ కోసం మొదట గిడ్డంగులను ఏర్పాటు చేయాలని, పంటను నిల్వ చేసే అవకాశం ఉండడం వల్ల దళారుల దోపిడీ తగ్గుతుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా పసుపు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల రైతులు తక్కువ ధరకే ముడి పసుపు అమ్మే అవసరం రాదని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు స్థానిక దిగుబడిని ఎగుమతి చేసేలా పసుపుబోర్డు ద్వారా జరగాలన్నారు. -
‘పసుపు’తో పట్టుకు యత్నం
అందరి నోట పసుపు బోర్డు ఏర్పాటు హామీ ఎన్నికల నినాదంగా మారిన వైనం జగన్ దీక్షతో ఊపందుకున్న పసుపు ఉద్యమం సార్వత్రిక ఎన్నికల్ల్లో రైతుల ఓట్లను రాబట్టుకునేందుకు పసుపు బోర్డు పేరు చెప్పి పట్టు సంపాదించడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పసుపును పండించే రైతుల కష్టాలను తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి గతంలో ఆర్మూర్‌లో దీక్ష చేపట్టడంతో పసుపు రైతుల ఉద్యమం ఊపందుకుంది. దీంతో పసుపు రైతులకు అండగా మేమున్నాం అంటే మేమున్నాం అంటూ వివిధ పార్టీల అభ్యర్థులు హామీలతో ముంచెత్తుతున్నారు. మోర్తాడ్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం నినాదంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పండించే పసుపులో 25 శాతం పసుపును బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అత్యధికంగా పసుపు పంట సాగు ఈ ప్రాంతంలోనే సాగు అవుతుండగా పసుపు పంటకు సంబంధించి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా వినిపిస్తోంది. సీమాం ధ్రలో మిర్చి, టుబాకో పంటలకు సంబంధించి ప్రత్యేక బోర్డులు ఉన్నాయి. కేరళలో సుగుంధ ద్రవ్యాల పంటలను సాగు చేసే రైతులను ప్రోత్సహించడానికి స్పైసిస్ బోర్డు ఉంది. వాణిజ్య పంటలకు సంబంధించి బోర్డులు ఏర్పాటు అయితే పంట సాగు విస్తీర్ణం నిర్ణయించడం, మద్దతు ధర ప్రకటించి అమలు చేయడం, రైతులకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది. మిర్చి, టుబాకో, స్పైసిస్ బోర్డుల తరహాలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని పలువురు రైతు నాయకులు ఉద్యమం చేపట్టారు. పసుపు పంటను పండించే రైతులకు అండగా ఉంటానని యువ నేత జగన్ గతంలోనే హామీ ఇవ్వడంతో రైతుల్లో మంచి స్పందన కనిపించింది. జగన్ బాటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పాలెపు మురళి పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చారు. దీంతో రైతులు తమకు దగ్గర కారని భావించిన ఇతర పార్టీలు రైతులను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పసుపు బోర్డు ఏర్పాటు హామీలు ఇస్తున్నారు. పసుపు బోర్డు ప్రాధాన్యతను అభ్యర్థులు తమ నేతలకు వివరించడంతో ప్రచార సభలకు హాజరవుతున్న వివిధ పార్టీల ముఖ్యనేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గురువారం మోర్తాడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన కేసీఆర్ పసుపు బోర్డు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇస్తామని చెబుతున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములకు రైతుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. పసుపు బోర్డు ఎన్నికల నినాదంగా మారడంతో ఎన్నికల తరువాతనైనా పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతాయా అని రైతులు సంశయం వ్యక్తం చేస్తున్నారు.