పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం: ధర్మపురి అర్వింద్‌ | yellow board is set up according to the guarantee given Says Dharmapuri Arvind | Sakshi
Sakshi News home page

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం: ధర్మపురి అర్వింద్‌

Published Mon, Jun 10 2019 4:30 AM | Last Updated on Mon, Jun 10 2019 4:30 AM

yellow board is set up according to the guarantee given Says Dharmapuri Arvind - Sakshi

జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఆదివారం జగిత్యాలలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామ న్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. గల్ఫ్‌లో ఉన్న రాష్ట్ర కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, అక్కడివారి సమస్యలను ఫోన్‌ ద్వారా తెలుసుకునేందుకు చర్య లు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు సైతం కృషి చేస్తామన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement