ఎంపీలూ.. మాట్లాడండి!
‘పసుపు బోర్డు’ కోసం రైతుల ఎదురుచూపులు
మండలి ఏర్పడితే పచ్చ బంగారమే..
రైతులకు మద్దతు ధర అందే అవకాశం
ఉమ్మడి జిల్లాలో 30,075 ఎకరాల్లో పసుపు సాగు
ఇందులో 49శాతం ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లాలోనే..
నర్సంపేట : పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంట తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగిన రీతిలోనే పండుతోంది. జిల్లాలు విడిపోయాక పసుపు ఎక్కువగా పండే ప్రాంతం వరంగల్ రూరల్ జిల్లాలోకి వచ్చింది. అరుుతే, కొన్నేళ్లుగా చెప్పుకోదగిన రీతిలో ధర దక్కకపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్ వరంగల్ రూరల్ జిల్లాలో పసుపు మండలి(బోర్డు) ఏర్పాటుకు శ్రద్ధ తీసుకుంటే ఇక్కడి రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు చర్చించాలని పసుపు పండిస్తున్న రైతులు కోరుతున్నారు.
రూరల్ జిల్లాలో అధికం..
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో 30,075 ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంటను రైతులు పండిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కంటే ఈ ఐదు జిల్లాల్లోనే పసుపు ఎక్కువగా సాగు అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లాలో 14,897 ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. అంటే అవిభాజ్య వరంగల్ జిల్లాతో లెక్క కడితే మొత్తంలో 49.53 శాతం ఇక్కడే పండుతోంది. అరుుతే, ధరలో నిలకడ లేమితో రైతులు ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2010-11లో ఎండు పసుపు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.16వేల వరకు ధర పలకగా మరుసటి సంవత్సరం రూ.3 వేల నుంచి రూ.3500 వరకు పడిపోరుుంది. గత వేసవిలో సరాసరి రూ.6500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. పసుపు ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా సాగు ఖర్చులు పెరగడం, మద్దతు ధర లేనందున గిట్టుబాటు ధర దక్కడం గగనంగా మారుతోంది. పసుపు పంటకాలం 180 నుంచి 200 రోజులు కావడం, కూలీల కొరత, రసాయన ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరగడంతో ఎకరాకు రూ.30 వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కనీసం క్వింటాకు రూ.10వేల ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వచ్చిన దిగుబడిని విక్రరుుంచేందుకు అందుబాటులో మార్కెట్లు లేకపోవడం కూడా రైతుల నష్టానికి కారణమవుతోంది.
మండలి ఏర్పడితే..
దేశంలోని సుగంధ ద్రవ్యాల మండలి ద్వారా ఏడాదికి రూ.11 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మిరప, అల్లం, ధనియాలు, మిరియాలు తదితర చాలా పంటలతో పాటుగా పసుపును కూడా ఈ మండలి ద్వారానే పంపిస్తారు. కానీ అన్ని రకాల పంటలకు కలిపి ఒకే బోర్డు ఉండటంతో రైతులకు సాగు సలహాలు సక్రమంగా అందటం లేదు. ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనం, యంత్ర పరికరాలతో పాటు పలు రకాల యంత్రాలు రారుుతీలపై అందుతారుు. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు దరి చేరుతారుు. పసుపును నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి వస్తారుు. పసుపును ఉడికించి పాలీషింగ్ చేయడంతో పాటుగా ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఏర్పాటవుతారుు.ప్రత్యేకంగా మార్కెట్ ఎగుమతి అవకాశాలు కలుగుతారుు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్లరుుతే రైతులకు అన్ని రకాలుగా ఉపకరించి సాగుకు లాభసాటిగా మారుతుంది. దీనికి గాను జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సీతారాంనాయక్, దయాకర్ పసుపుబోర్డు ఏర్పాటు, రైతులకు మద్దతు ధర దక్కేలా జాతీయ స్థారుులో మద్దతును కూడగట్టి కృషి చేయాల్సిన అవసరం ఉంది.