‘వరినాటు యంత్రాలకు ప్రాధాన్యత పెరిగింది’ | minister pocharam srinivas reddy meeting on crop plant machines | Sakshi
Sakshi News home page

‘వరినాటు యంత్రాలకు ప్రాధాన్యత పెరిగింది’

Published Thu, Jul 19 2018 5:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

minister pocharam srinivas reddy meeting on crop plant machines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరుగుతున్న నేపథ్యంలో వరి నాటు యం త్రాలకు ప్రాధాన్యత పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆసక్తి ఉన్న ఉత్సాహవంతులైన రైతులను ఈ వరి యంత్రాల వాడకం వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారం లో రాజేంద్రనగర్, పాలెం, వరంగల్, జగిత్యాల వరి పరిశోధన కేంద్రాల్లో రైతుల కోసం వరి నాటు యంత్రాల ప్రదర్శన, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి మండలానికి పది వరి నాటు యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement