Labor shortage
-
‘వరినాటు యంత్రాలకు ప్రాధాన్యత పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరుగుతున్న నేపథ్యంలో వరి నాటు యం త్రాలకు ప్రాధాన్యత పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆసక్తి ఉన్న ఉత్సాహవంతులైన రైతులను ఈ వరి యంత్రాల వాడకం వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారం లో రాజేంద్రనగర్, పాలెం, వరంగల్, జగిత్యాల వరి పరిశోధన కేంద్రాల్లో రైతుల కోసం వరి నాటు యంత్రాల ప్రదర్శన, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి మండలానికి పది వరి నాటు యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు -
అ'మెరికలు' కావాలి!
అగ్రరాజ్యం అమెరికా.. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన పదేళ్ల నాటి పరిస్థితి నుంచి ఆ దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో నేడు నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించడానికి అవసరమైన ఖాళీలున్నాయి. మార్చి నెలలో రికార్డు స్థాయిలో 66 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని అమెరికా కార్మిక శాఖ ఇటీవల వెల్లడించింది. అధికారిక లెక్కల ప్రకారం ఆ నెలలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు 66 లక్షల మందే ఉన్నారు. దేశంలో ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉండటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారని ఎంయూఎఫ్‌జీ యూనియన్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త క్రిస్ రూప్‌కీ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి దేశంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఖాళీలపై కార్మిక శాఖ నెలనెలా లెక్కలు సేకరిస్తుండగా ప్రతి నిరుద్యోగికి మార్కెట్లో ఓ ఖాళీ ఉండటం మార్చి లోనే మొదటిసారని తేలింది. వైట్ కాలర్ ఉద్యోగాలే ఉండే వ్యాపారాలు, నిర్మాణరంగం, గోదాముల కంపెనీలు మార్చి నెలలో ఉద్యోగాల భర్తీ ప్రారంభించాయి. ఆర్థిక పరిస్థితులు ఇలా మెరుగవుతూ ఉంటే భవిష్యత్తులో ఉద్యోగార్థుల సంఖ్య కంటే ఉద్యోగ ఖాళీల సంఖ్య ఎక్కువ ఉండవచ్చు. ఏప్రిల్ నెలలో నిరుద్యోగుల సంఖ్య దాదాపు 64 లక్షలకు పడిపోయింది. ఉద్యోగాల భర్తీ వేగం పుంజుకోవడం లేదు. తమ సంస్థల్లో ఖాళీలున్నా వాటికి అవసరమైనంత నైపుణ్యమున్న కార్మికులు దొరకడం లేదని పలు కంపెనీల ఉన్నతాధికారులు బాధపడుతున్నారు. ఉద్యోగాలున్నా ఎందుకీ నిరుద్యోగం? అమెరికాలో గత 20 ఏళ్లలో నిరుద్యోగం అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఉపాధి దొరకని ఆఫ్రికన్ అమెరికన్లు(నల్లజాతి వారు), హిస్పానిక్ అమెరికన్ల సంఖ్య ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి చేరింది. పెరిగిన ఉద్యోగుల అవసరం దృష్ట్యా కంపెనీలు కూడా తమ నియామక పద్ధతుల్లో మార్పులు తెచ్చాయి. కాలేజీ డిగ్రీ లేనివారు, నేరచరిత్ర కలిగి కొంత కాలం జైళ్లలో గడిపినవారిలో సమర్థులుంటే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ఇవి వెనుకాడటం లేదు. నిరుద్యోగుల సంఖ్యలోనే ఉద్యోగ ఖాళీలుంటే కోరుకున్నవారందరికీ ఉపాధి దొరకాలి. కానీ, ఆర్థికాభివృద్ధి జరుగుతున్న కాలంలో సైతం అలా జరగడం లేదు. అమెరికా వంటి సంపన్నమైన పెద్ద దేశంలో జనం తమ ఉద్యోగాలు మానేసి, కొత్త ఉద్యోగాల్లో చేరడానికి సమయం తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత ఉద్యోగాలతో విసుగు చెంది వాటిని వదిలేసినవారి సంఖ్య మార్చిలో 30 లక్షలు దాటింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో చేరడానికి తగినన్ని నైపుణ్యాలు ఉద్యోగార్థులందరి దగ్గరా లేవు. అదీగాక, తాము నివసించే ప్రదేశాల్లోనే ఉద్యోగం కోరుకునే ధోరణి పెరగడంతో నిరుద్యోగులకు తమ సొంతూళ్లలో ఉపాధి దొరకడం లేదు. ఫలితంగా, ఉద్యోగ ఖాళీలు త్వరగా భర్తీకావడం లేదు. అందుకే ప్రతిభాపాటవాలున్న వారికి ఎక్కువ జీతం ఇవ్వడానికి, నైపుణ్యం తగినంత లేనివారికి శిక్షణ ఇవ్వడానికి అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నా నియామకాలు జోరందుకోవడం లేదు. కంపెనీల్లో ఉద్యోగాల సంఖ్య పెంచుతున్నారేమోగాని వాటిలో నియామ కాలు జరపకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అంతంత మాత్రంగానే పెరుగుతున్న వేతనాలు అగ్రరాజ్యంలో వేతనాల పెరుగుదల కూడా అంతంత మాత్రమే. కిందటేడాది జీతాలు ఎప్పుడూ లేనంత తక్కువగా 2.6 శాతమే పెరిగాయి. లారీలు, రైలు రవాణా రంగాల్లో పనిచేసే బ్లూకాలర్ కార్మికులకు బోనస్ వంటి చెల్లింపులు పెరిగాయిగాని, ఒకసారి మాత్రమే ఇచ్చే చెల్లింపులు కావడంతో నిజ వేతనాలు పెరగనట్టే లెక్క. స్థానికులైన అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగాల్లో చేరాలనుకునే కొత్తవారికి శిక్షణతో కూడిన ఉపాధి కల్పించాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. కార్మికులకు శిక్షణ అనేది ఖర్చుతో కూడిన వ్యవహారమేగాక, చాలా కాలంగా ఇలాంటి కార్యక్రమాలు దేశంలో అమల్లో లేవు. కార్మికశాఖ చెబుతున్న సంఖ్య కంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారనీ, ముఖ్యంగా పనిచేయడానికి అనువైన వయసులో ఉన్న వారు ఉపాధి లేకుండా చాలా మంది ఉన్నా వారు ప్రభుత్వ లెక్కల్లో చేరలేదని కూడా నిపుణులు చెబుతున్నారు. -
సులువుగా పసుపు విత్తే పరికరం!
♦ తొంబరావుపేట రైతుల ఆవిష్కరణ ♦ పరికరాన్ని ట్రాక్టర్ కల్టివేటర్‌కు జత చేసి పసుపు విత్తుకుంటున్నారు ♦ రెండు గంటల్లో ఎకరాలో పసుపు, అంతర పంటగా మొక్కజొన్న విత్తనం వేసుకునే వీలు ♦ కూలీల కొరత సమస్య తీరింది ♦ రూ. 4 వేల నుంచి రూ.2 వేలకు తగ్గిన ఖర్చు అరకలు, కూలీలతో సమస్యను ఎదుర్కొంటున్న పసుపు రైతులు పంటను విత్తుకునేందుకు యంత్రం తయారు చేశారు. జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామ రైతులు ఎక్కువగా పసుపును సాగు చేస్తుంటారు. కూలీలు, అరకలు దొరక్క అదను తప్పేది. దీంతో గ్రామంలోని పసుపు రైతులందరూ సమావేశమై యంత్ర పరికరాన్ని రూపొందించాలని తీర్మానించారు. యువ రైతులు వెల్డింగ్ షాపు యజమానులతో కలిసి యంత్రం తయారు చేశారు. కల్టివేటర్లా ఉండే ఈ పరికరాన్ని ట్రాక్టర్ హైడ్రాలిక్‌కు అనుసంధానిస్తారు. ఈ పరికరంలో మొత్తం మూడు వరుసలు ఉంటాయి. మొదటి వరుసలో నాలుగు నాగళ్లను ఏర్పాటు చేశారు. వీటి మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. పై భాగంలో పసుపు విత్తనం పోసుకునేందుకు, ఎరువులు వేసుకునేందుకు ప్లాస్టిక్ గొట్టాలను ఏర్పాటు చేశారు. రెండో వరుసలో మూడు నాగళ్లు ఉంటాయి. వీటిపైన మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు బాక్సును ఏర్పాటు చేశారు. మూడోవరుసలో ఐదుగురు కూలీలు కూర్చునేందుకు వీలుగా బల్లను ఏర్పాటు చేశారు. కూలీలు ఎదురుగా ఉన్న బాక్సులో నుంచి విత్తనాలు తీసుకొని పైపుల్లో వేస్తారు. ట్రాక్టరు నెమ్మదిగా ముందుకు వెళుతుంటే తొలుత పసుపు విత్తనం.. తర్వాత ఎరువు, సాళ్ల మధ్యలో మొక్కజొన్న విత్తనాలు పడతాయి. రెండు గంటల్లో ఎకరం విత్తుకోవచ్చు బోదెలు వెడల్పుగా వచ్చేందుకు వీలుగా నాగళ్లకు వెడల్పాటి రేకులను అమర్చారు. దీనివల్ల విత్తుకున్న పసుపుపై బెడ్ వస్తుంది. దానిపైన సులభంగా డ్రిప్పు పైపులు అమర్చుకోవచ్చు. దీనివల్ల పసుపును తవ్వుకోవటం సులభమవుతుంది. ట్రాక్టర్ నాగలి వెనుక కింది భాగంలో కట్టిన బరువైన కట్టె మట్టిపెడ్డలను పగులగొడుతుంది. దీనివల్ల పసుపు రైతుకు శ్రమ, ఖర్చు తగ్గి సమయం కలసి వస్తోంది. రెండు గంటల్లోనే ఎకరంలో పసుపును విత్తుకోవచ్చు. ఎద్దులతో విత్తుకుంటే ఎకరాకు రూ. 4 వేలు ఖర్చవుతుండగా ఈ పరికరంతో మాత్రం రూ. 2 వేలే ఖర్చవుతోంది. దీని తయారీకి రూ. 20 వేలు ఖర్చయిందని రైతులు తెలిపారు. అద్దెకిచ్చి గంటకు రూ. 1,200 కిరాయి వసూలు చేస్తున్నారు. రైతులందరం కలసి తయారు చేశాం..! పసుపు విత్తుకునేందుకు కూలీలు దొరక్కపోవటంతో వెల్డింగ్ షాపు యజమానితో కలిసి పసుపు విత్తే పరికరాన్ని తయారు చేయించాం. రెండేళ్లుగా ఈ దీన్ని వాడుతున్నాం. ఈ ఏడాది గ్రామంలోని రైతులందరూ దీనితోనే పసుపు వేశారు. – ఏలేటి రాజిరెడ్డి (94942 72409), పసుపు రైతు, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా కొమ్ములు తీయటమూ సులభమే.. ఎద్దుల నాగలికంటే ఈ పరికరంతో పసుపును సులభంగా విత్తుకోవచ్చు. పంట పండిన తర్వాత చిన్న ట్రాక్టరుతో దున్ని, కొమ్ములను సులభంగా వెలికి తీయవచ్చు. దీనికి భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేద్దామనుకుంటున్నాం. – యాళ్ల గోపాల్ రెడ్డి (98488 12150), పసుపు రైతు, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా కూలీల ఇబ్బంది తీరింది.. అరకతో వేసినప్పుడు కూలీలు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాను. గతంలో రెండెకరాలు వేసేందుకు రెండు రోజులు పట్టేది. కూలీల ఖర్చు ఎక్కువయ్యేది. ఇప్పుడు ముగ్గురు కూలీలతోనే రెండెకరాల్లో పసుపు వేశాను. వేసిన ట్లే అనిపించలేదు. – బద్దం శంకరమ్మ, పసుపు రైతు, సింగరావుపేట, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల -
ఎంపీలూ.. మాట్లాడండి!
‘పసుపు బోర్డు’ కోసం రైతుల ఎదురుచూపులు మండలి ఏర్పడితే పచ్చ బంగారమే.. రైతులకు మద్దతు ధర అందే అవకాశం ఉమ్మడి జిల్లాలో 30,075 ఎకరాల్లో పసుపు సాగు ఇందులో 49శాతం ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లాలోనే.. నర్సంపేట : పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంట తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగిన రీతిలోనే పండుతోంది. జిల్లాలు విడిపోయాక పసుపు ఎక్కువగా పండే ప్రాంతం వరంగల్ రూరల్ జిల్లాలోకి వచ్చింది. అరుుతే, కొన్నేళ్లుగా చెప్పుకోదగిన రీతిలో ధర దక్కకపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్ వరంగల్ రూరల్ జిల్లాలో పసుపు మండలి(బోర్డు) ఏర్పాటుకు శ్రద్ధ తీసుకుంటే ఇక్కడి రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు చర్చించాలని పసుపు పండిస్తున్న రైతులు కోరుతున్నారు. రూరల్ జిల్లాలో అధికం.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో 30,075 ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంటను రైతులు పండిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కంటే ఈ ఐదు జిల్లాల్లోనే పసుపు ఎక్కువగా సాగు అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లాలో 14,897 ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. అంటే అవిభాజ్య వరంగల్ జిల్లాతో లెక్క కడితే మొత్తంలో 49.53 శాతం ఇక్కడే పండుతోంది. అరుుతే, ధరలో నిలకడ లేమితో రైతులు ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2010-11లో ఎండు పసుపు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.16వేల వరకు ధర పలకగా మరుసటి సంవత్సరం రూ.3 వేల నుంచి రూ.3500 వరకు పడిపోరుుంది. గత వేసవిలో సరాసరి రూ.6500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. పసుపు ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా సాగు ఖర్చులు పెరగడం, మద్దతు ధర లేనందున గిట్టుబాటు ధర దక్కడం గగనంగా మారుతోంది. పసుపు పంటకాలం 180 నుంచి 200 రోజులు కావడం, కూలీల కొరత, రసాయన ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరగడంతో ఎకరాకు రూ.30 వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కనీసం క్వింటాకు రూ.10వేల ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వచ్చిన దిగుబడిని విక్రరుుంచేందుకు అందుబాటులో మార్కెట్లు లేకపోవడం కూడా రైతుల నష్టానికి కారణమవుతోంది. మండలి ఏర్పడితే.. దేశంలోని సుగంధ ద్రవ్యాల మండలి ద్వారా ఏడాదికి రూ.11 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మిరప, అల్లం, ధనియాలు, మిరియాలు తదితర చాలా పంటలతో పాటుగా పసుపును కూడా ఈ మండలి ద్వారానే పంపిస్తారు. కానీ అన్ని రకాల పంటలకు కలిపి ఒకే బోర్డు ఉండటంతో రైతులకు సాగు సలహాలు సక్రమంగా అందటం లేదు. ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనం, యంత్ర పరికరాలతో పాటు పలు రకాల యంత్రాలు రారుుతీలపై అందుతారుు. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు దరి చేరుతారుు. పసుపును నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి వస్తారుు. పసుపును ఉడికించి పాలీషింగ్ చేయడంతో పాటుగా ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఏర్పాటవుతారుు.ప్రత్యేకంగా మార్కెట్ ఎగుమతి అవకాశాలు కలుగుతారుు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్లరుుతే రైతులకు అన్ని రకాలుగా ఉపకరించి సాగుకు లాభసాటిగా మారుతుంది. దీనికి గాను జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సీతారాంనాయక్, దయాకర్ పసుపుబోర్డు ఏర్పాటు, రైతులకు మద్దతు ధర దక్కేలా జాతీయ స్థారుులో మద్దతును కూడగట్టి కృషి చేయాల్సిన అవసరం ఉంది.