Subsidy loans
-
మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానం ద్వారా రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి స్పందిస్తూ..‘రైతులకు తక్కువ ధరకు ఎరువులు లభ్యమయ్యేలా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. కొన్ని ఎరువుల తయారీకి సంబంధించి కంపెనీలకు ఇప్పటికే 100 శాతం రాయితీలు అందించాం. రిటైల్ దుకాణంలో అమర్చిన పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల ద్వారా ఆధార్‌తో రైతులు సబ్సిడీపై ఎరువులు పొందుతున్నారు’ అని చెప్పారు.2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం అందిస్తున్న ఎరువుల సబ్సిడీ వివరాలను మంత్రి తెలియజేశారు.2010-11లో రూ.65,836.68 కోట్లు2011-12లో రూ.74,569.83 కోట్లు2012-13లో రూ.70,592.1 కోట్లు2013-14లో రూ.71,280.16 కోట్లు2014-15లో రూ.75,067.31 కోట్లు2015-16లో రూ.76,537.56 కోట్లు2016-17లో రూ.70,100.01 కోట్లు2017-18లో రూ.69,197.96 కోట్లు2018-19లో రూ.73,435.21 కోట్లు2019-20లో రూ. 83,466.51 కోట్లు2020-21లో రూ. 1,31,229.5 కోట్లు2021-22లో రూ. 1,57,640.1 కోట్లు2022-23లో రూ.2,54,798.9 కోట్లు2024-25లో జులై 2024 వరకు అందించిన సబ్సిడీ రూ.36,993.39 కోట్లు‘చట్టబద్ధంగా 45 కిలోల యూరియా బ్యాగ్ రూ.242 (ఛార్జీలు, పన్నులు మినహాయింపు)గా ఉంది. యూరియా ఉత్పత్తికి అయ్యే వాస్తవ ఖర్చులు, రైతులకు అందిస్తున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. అందుకోసం ప్రభుత్వ సబ్సిడీలు ఉపయోగపడుతున్నాయి. ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల కోసం ప్రభుత్వం ఏప్రిల్ 2010 నుంచి న్యూట్రియంట్ బేస్ట్ సబ్సిడీ(ఎన్బీఎస్) విధానాన్ని అమలు చేస్తోంది. ఎరువుల ధరలు వాటి ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. క్రమంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల్లో మార్పులుంటాయి’ అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: దివాలా దిశగా అగ్రరాజ్యం!2010-11 నుంచి ఎరువుల ఉత్పత్తి వివరాలను మంత్రి వెల్లడించారు.2010-11లో 376.25 లక్షల టన్నులు2011-12లో 387.78 లక్షల టన్నులు2012-13లో 374.94 లక్షల టన్నులు2013-14లో 380.46 లక్షల టన్నులు2014-15లో 385.39 లక్షల టన్నులు2015-16లో 413.14 లక్షల టన్నులు2016-17లో 414.41 లక్షల టన్నులు2017-18లో 413.61 లక్షల టన్నులు2018-19లో 413.85 లక్షల టన్నులు2019-20లో 425.95 లక్షల టన్నులు2020-21లో 433.68 లక్షల టన్నులు2021-22లో 435.95 లక్షల టన్నులు2022-23లో 485.29 లక్షల టన్నులు2023-24లో 503.35 లక్షల టన్నులు -
చదువులు ‘ఉన్నతం’
న్యూఢిల్లీ: దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.మేనేజ్మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్‌ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి.యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు. ఐఐఎంలకు బడ్జెట్లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది. ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు. సెంట్రల్ వర్సిటీలకు మరికొంత.. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి.సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్సీఈఆరీ్ట, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. -
ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు శుభవార్త ఇది. పట్టణాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు తక్కువ (సబ్సిడీ) వడ్డీ రేట్లలో గృహ రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గానికి చెందిన 20.5 లక్షల మంది రుణ దరఖాస్తుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. రాయిటర్స్ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రాబోయే నెలల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. వడ్డీ రాయితీని ముందుగానే లబ్ధిదారుల హౌసింగ్ లోన్ ఖాతాలో జమ చేస్తారు. 2028 వరకు ప్రతిపాదించిన పథకం దాదాపు ఖరారైందని, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలను రాయిటర్స్ ఉటంకిస్తూ పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. "రాబోయే సంవత్సరాల్లో కొత్త పథకాన్ని తీసుకువస్తాం. ఇది ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో, మురికివాడల్లో, అనధికార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని మోదీ చెప్పారు. -
ఎరువుల సబ్సిడీ రూ.2.5 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 2.3–2.5 లక్షల కోట్లకు పెరుగుతుందని పరిశ్రమల సంఘం– ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఐ) అంచనావేసింది. అయితే 2023–24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ బిల్లు 25 శాతం తగ్గవచ్చని పరిశ్రమల సంఘం ఎఫ్ఏఐ తెలిపింది. గ్లోబల్ ధరల్లో తగ్గుదల దీనికి కారణం అవుతుందని పేర్కొంది. యూరియా స్థిర ధరను పెంచకపోవడంతో ఈ కర్మాగారాల మనుగడపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పరిశ్రమ చాలా తక్కువ మార్జిన్లో నడుస్తోందని, ఇది ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తోందని కూడా సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న రబీ (శీతాకాలం–సాగు) సీజన్‌కు యూరియా, డీఏపీసహా తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని కూడా పరిశ్రమల సంఘం తెలిపింది. ఎఫ్ఏఐ ప్రెసిడెంట్ కేఎస్ రాజు పరిశ్రమకు సంబంధించి విలేకరులకు తెలిపిన ముఖ్యాంశాల్లో కొన్ని.. ► ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 2.3–2.5 లక్షల కోట్ల స్థాయికి పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయంగా ఎరువులు, ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం వల్ల అన్ని ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం నుంచి దేశీయ రైతులను రక్షించేందుకు ఈ స్థాయి సబ్సిడీలు దోహదపడుతున్నాయి. 2021–22లో సబ్బిడీ భారం రూ.1.62 లక్షల కోట్లు. ► గత రెండేళ్లలో సహజవాయువు, ఎల్ఎన్జీతో సహా ఎరువులు– ఎరువుల ముడి పదార్థాలకు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయి. ► కొన్ని ధరలు ఇటీవలి నెలల్లో తగ్గుముఖం పట్టాయి. అయితే మహమ్మారికి ముందు కాలం కంటే ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి. డీఏపీ అంతర్జాతీయ ధర (సీఎఫ్ఆర్– వ్యయం భారత్‌కు సరకు రవాణా) ఏప్రిల్ 2021న టన్నుకు 555 డాలర్లు ఉంది. అయితే ఈ ధర జూలై 2022నాటికి 945 డాలర్లకు పెరిగింది. ఇది 2022 అక్టోబర్‌కు మళ్లీ 722 డాలర్లకు తగ్గింది. ► అలాగే ఫాస్పోరిక్ యాసిడ్ ధర ఏప్రిల్ 2021లో టన్నుకు 876 డాలర్లు ఉంది. 2022 జూలై నాటికి టన్నుకు 1718 డాలర్లకు పెరిగింది. అయితే ఇది 2022 అక్టోబర్‌కు 1355 డాలర్ల స్థాయికి తగ్గింది. ► యూరియా విషయానికి వస్తే, 2021 ఏప్రిల్‌లో టన్నుకు 400 డాలర్లు ఉంది. 2021 డిసెంబర్ నాటికి 1000 డాలర్లకు చేరింది. తాజాగా టన్నుకు 600 డాలర్లకు తగ్గింది. ► యూరియా స్థిర ధర, ఇంధన వినియోగ నిబంధనలు వంటి అంశాల్లో యూరియా పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతికూలతలను పరిష్కరించాలి. ► 2022 ఏప్రిల్–అక్టోబర్ 2022లో యూరియా, డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్) ఎస్ఎస్పీ వార్షికంగా వరుసగా 16.0 శాతం, 14.2 శాతం, 9.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎన్పీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువుల ఉత్పత్తి ఈ కాలంలో 5.2 శాతం క్షీణతను నమోదు చేసింది. ► 2022 ఏప్రిల్–అక్టోబర్‌లో డీఏపీ ఎన్పీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు వరుసగా 45.2 శాతం, 76.1 శాతం పెరిగాయి. అయితే, యూరియా, ఎంఓపీ దిగుమతులు వరుసగా 12.9 శాతం, 7.3 శాతం తగ్గాయి. ► భారతీయ ఎరువుల రంగం పేలవమైన లాభదాయకతతో పనిచేస్తోంది. 24 ఎరువుల కంపెనీలకు సంబంధించి అందించిన డేటా ప్రకారం... గత ఐదేళ్లలో (2017–18, 2018–19, 2019–20, 2020–21, 2021–22) పరిశ్రమ నికర లాభం వరుసగా 0.61 శాతం, 0.39 శాతం, 0.64 శాతం, 2.47 శాతం, 1.39 శాతాలుగా ఉన్నాయి. ► ఇటువంటి అతి తక్కువ మార్జిన్లు ఇప్పటికే చేసిన పెట్టుబడులకే సవాళ్లుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ రంగంలో తాజా పెట్టుబడులను, ప్రత్యేకించి, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవుతుంది. -
ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మారుతున్న పంటల సరళిని దృష్టిలో పెట్టుకుని ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ప్రగతిభవన్‌లో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా ఆహారశుద్ధి రంగంలో చిన్న యూనిట్లతోపాటు గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఆహార ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో జల విప్లవం ఫలితంగా లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతోపాటు నీలి విప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) అభివృద్ధి చెందుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో క్రాప్ మ్యాపింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తితో పాటు గొర్రెలు, చేపల పెంపకం కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. భవిష్యత్తులో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆహారశుద్ధి రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలను నూతన పాలసీలో ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ, యువత, మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని వివరించారు. బాల్కొండ నియోజకవర్గంలోని స్పైస్ పార్క్‌లో పసుపు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని, ఆర్మూర్ నియోజకవర్గంలోని లక్కంపల్లి సెజ్‌లో సోయా, మక్కల ఆహారశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలని మంత్రులు కేటీఆర్‌ను కోరగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు చేసిన సూచనలివే.. పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ఆయా రంగాల్లో యాంత్రీకరణ ప్రోత్సహించాలి. గిరిజన ప్రాంతాల్లో చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు దళిత, మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు దక్కేలా చూడాలి. తెలంగాణ బ్రాండ్ పేరిట నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూడటంతో పాటు, ఆహార కల్తీని అరికట్టాలి. పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. నూనె గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహం ఇవ్వాలి. పళ్లు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా వృ«థా తగ్గి రైతులకు లాభం జరుగుతుంది. -
పేదలకు రుణాల్లోనూ మోసమే
సాక్షి, అమరావతి: పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని భారీయెత్తున ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆయా వర్గాల వారిని నిలువునా మోసం చేసింది. సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ నెపాన్ని బ్యాంకులపైకి నెట్టి చేతులు దులుపుకుంది. దీంతో 14 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మెగా రుణ మేళాలు నిర్వహించి సబ్సిడీతో రుణాలు ఇస్తామని ప్రచారం చేయడంతో సుమారు 15 లక్షల మంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2015–16లో అరకొరగా రుణాలిచ్చిన ప్రభుత్వం అప్పటికి ఆ కార్యక్రమాన్ని ముగించేసింది. ఆ తర్వాత 2016–17, 2017–18, 2018–19 మూడు సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వకుండా ఎగనామం పెట్టింది. దరఖాస్తుదారులైన పేదలు, నిరుద్యోగులు తమకు సబ్సిడీ రుణాలు ఎప్పుడిస్తారంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, నేతలను నిలదీస్తుండటం, ఈలోగా ఎన్నికలు సమీపించడంతో గత జనవరిలో రుణ మేళాల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంది. ప్రచారార్భాటానికి రూ.4 కోట్ల వ్యయం రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికైతే మహిళలు, దళితులు, మైనార్టీలను భారీ స్థాయిలో బస్సులు, ఇతర వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఇందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. నాలుగు మెగా రుణమేళాలకు నాలుగు కోట్లు ఖర్చయ్యాయి. ఎంతో ఆశతో ఆయా సభలకు వెళ్లిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నామమాత్రంగా కొంతమందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. మొదటి రుణ మేళాలో 26,598 మందికి రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రెండో మేళాలో 3,419 మందికి, మూడో మేళాలో 2,965 మందికి, నాలుగో మేళాలో 2,896 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అంటే 15 లక్షల మంది దరఖాస్తుదారులకు గాను నాలుగు మేళాల్లో కలిపి 35,878 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేశారన్నమాట. నాలుగు రుణమేళాల్లో కలిపి నాలుగు లక్షల మందికి సుమారు రూ.2,000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం రూ.253.49 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ఇచ్చిన వారికన్నా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిందా అంటే అదీ లేదు. బ్యాంకులకు సబ్సిడీని విడుదల చేయడంలో కార్పొరేషన్లు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు సగం మందికి కూడా సబ్సిడీలు విడుదల చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. యూనిట్లు అందని వారు, సబ్సిడీ అందని వారు 30 శాతం వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. -
‘వరినాటు యంత్రాలకు ప్రాధాన్యత పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరుగుతున్న నేపథ్యంలో వరి నాటు యం త్రాలకు ప్రాధాన్యత పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆసక్తి ఉన్న ఉత్సాహవంతులైన రైతులను ఈ వరి యంత్రాల వాడకం వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారం లో రాజేంద్రనగర్, పాలెం, వరంగల్, జగిత్యాల వరి పరిశోధన కేంద్రాల్లో రైతుల కోసం వరి నాటు యంత్రాల ప్రదర్శన, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి మండలానికి పది వరి నాటు యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు -
కరుణ కరువు
తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన ఈయన పేరు మర్రాపు శంకరరావు. బైక్ మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్న ఈయన షాప్‌ను మరింత అభివృద్ధి చేసుకునేందుకు రుణం కోసం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. బీసీ కార్పొరేషన్ ఓబీఎంఎంఎస్ ద్వారా 2016–17, 17–18 ఆర్థిక సంవత్సరాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరై అందులో ఎంపికయ్యాడు. అన్ని అర్హతలూ ఉన్న ఈయన రెండేళ్లుగా మండల పరిషత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రుణం మాత్రం మంజూరు కాలేదు. కారణం ఏమిటాని ఆరా తీస్తే జన్మభూమి కమిటీ సభ్యులు ఈయన పేరును తొలగించారట. బతుకుతెరువు కోసం కనీసం ప్రైవేటు ఉద్యోగానికి కూడా నోచుకోని వెనుకబడిన తరగతుల వారిని ఆదుకునేందుకు బీసీ కార్పొరేషన్ నెలకొల్పారు. కానీ దీని ద్వారా ఉపాధి కనుచూపుమేరలో కానరావడం లేదు. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాలి... లేదా సంఘ నాయకుల రూపంలో ఉన్న దళారులను ప్రసన్నం చేసుకోవాలి... వీటికి డబ్బు ఉండాలి. పోనీ అన్నీ చేసినా బ్యాంకర్లకు ఇష్టం లేకపోతే అంతే! వెనుకబడిన తరగతుల్లో నిరుపేదల సమస్యకు పరిష్కారం కానరావట్లేదు. బొబ్బిలి : ఏటా కోట్టాలది రూపాయ ల బడ్జెట్ కేటాయించడం అందులో 25 శాతం కూడా రుణాలు ఇవ్వకపోవడంతో బీసీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కానరావట్లేదు. ఓ వైపు జన్మభూమి కమిటీల పెత్తనం... మరోవైపు బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా గడచిన మూడేళ్లలో తిరస్కరిస్తున్న వాటి సంఖ్యే ఎక్కువ. ఆర్థిక ఆసరా లేని కుటుంబాలు ఏటా బీసీ కార్పొరేషన్‌కు వేలల్లో దరఖాస్తులు చేసుకుంటున్నాయి. కానీ రాజకీయ పలుకుబడి, జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇస్తే తప్ప సబ్సిడీ రుణాలు అవ్వడం లేదు. డబ్బులు ఇవ్వలేని బీదాబిక్కీ దరఖాస్తు చేసుకునేందుకు వ్యయ ప్రయాసలే మిగులుతున్నాయి. దరఖాస్తులు వేలల్లోనే... జిల్లా వ్యాప్తంగా ఏటా 14 నుంచి 20వేల వరకూ బీసీ సబ్సిడీ రుణాలకోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2014–15లో 14020 మంది 2015–16లో 16340 మంది, 16–17లో 16100 దరఖాస్తు చేసుకోగా కేవలం 10 శాతం కూడా లబ్ధిపొందిన వారు లేరు. చేసేది లేక ఆయా కుటుంబాలు తిరిగి వడ్డీ వ్యాపారుల పైనే ఆధారపడాల్సి వస్తోంది. రుణాలు ఇవ్వాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కమిటీల ఆమోదం ఉండాలి. ఆ తరువాత బ్యాంకుల చుట్టూ తిరగాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయి కమిటీ ఆ తరువాత బీసీ కార్పొరేషన్ ఎండీ ఇలా.. ఎన్నో ఇబ్బందులు దాటిన తరువాత సబ్సిడీ మంజూరయితే దానిని ఇచ్చేందుకు బ్యాంకర్ల వద్ద తిప్పలు తప్పట్లేదు. వచ్చిన సబ్సిడీని డిపాజిట్‌గా వేసేసి బ్యాంకులు వ్యాపారం చేసుకుంటున్నాయి. రూ. లక్షరుణం, రూ. లక్ష సబ్సిడీ కాగా రూ. రెండు లక్షలు లబ్ధిదారుడికి బ్యాంకులు ఇవ్వాలి. ఈ మొత్తం వాయిదాల రూ³ంలో తీరిపోయిన వెంటనే అంతకు ముందు డిపాజిట్ చేసిన రూ. లక్ష సబ్సిడీని లబ్ధిదారుడికి ఇవ్వాలి. కానీ రూ. రెండు లక్షల యూనిట్ మంజూరవగానే బ్యాంకర్లు లక్ష డిపాజిట్ చేసేసి కేవలం రూ. 30వేల నుంచి రూ. 50వేలే రుణం ఇస్తున్నారు. అవి తీరాక మిగతా డబ్బులు ఇస్తామంటున్నారు. కొత్త దరఖాస్తులకు రెడీ జిల్లాలో రుణాల మంజూరు అవుతున్నా గ్రౌండింగ్ కావడం లేదు. అంటే లబ్ధిదారుడికి కాగితాల మీదే మంజూరు చూపిస్తున్నారు తప్ప ఒక్క పైసా అయినా సబ్సిడీ ఇవ్వట్లేదు. మూడేళ్లుగా రుణాల మంజూరు ప్రక్రియ జరుగుతున్నా చేతికి డబ్బు అందే వారు లేరు. కానీ ఈ ఏడాది మళ్లీ 2018–19 ఆర్థిక సంవత్సరానికి మళ్లీ రుణాలు వచ్చాయనీ, దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 2,313 దరఖాస్తులు రావడం గమనార్హం. గ్రౌండింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం మూడేళ్లుగా మంజూరైన రుణాలను గ్రౌండింగ్ చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. త్వరలోనే అందరికీ రుణాలు గ్రౌండయ్యేలా చేసి యూసీలు తీసుకుంటాం. దీనిపై బ్యాంకర్లకు సమాచారం ఇచ్చాం. – ఆర్.వి.నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్, విజయనగరం -
ఆర్థికంగా వెనుకబడిన వారికి సబ్సిడీ రుణాలు
విజయనగరం పూల్‌బాగ్: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ కులాలు కానివారు)2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీతో కూడిన సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోందని కలెక్టర్ వివేక్‌యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాకు రూ.12.76 కోట్లతో 638 మందికి రుణాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయల యూనిట్ ధరలో 50 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం ఉంటుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాల వారు పట్టణ ప్రాంతాల్లో రూ.1.03 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.61వేల లోపు వార్షిక ఆదాయం గల 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్నవారు రుణాలకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు www.apobm-m-r.c-f-f.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని మండల, మున్సిపల్ స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. వెబ్సైట్ ఈనెల 19వ తేదీ నుంచి ఓపెన్ చేయబడిందని అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08922–272080, 94409 66575 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
ఏఎన్ఎంలకు స్కూటీలు
మంచిర్యాలటౌన్/హాజీపూర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు త్వరితగతిన అందేలా ప్రభుత్వం ‘రెక్కలు’ పథకంలో ఏఎన్ఎంలకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగా లేక ఏఎన్ఎంలు సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఇక రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రోగుల వద్దకు చేరుకునేలా ప్రభుత్వం ఈ వాహనాలను అందించనుంది. 171 దరఖాస్తులు.. జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో 126 ఆరోగ్య ఉప కేం ద్రాలు ఉన్నాయి. మొత్తం 250 మంది ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. వీరిలో 98 మంది రెగ్యులర్ ఏఎన్ఎంలు కాగా, 108 మంది సెకండ్ ఏఎన్ఎంలు, మిగతావారు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు రోజూ పీహెచ్‌సీల నుంచి సబ్ సెంటర్లకు, అక్కడి నుంచి గ్రామాలకు వెళ్లేందుకు రవాణా పరంగా ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం స్కూటీల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జిల్లాలోని 171 మంది ఏఎన్ఎంలు స్కూటీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుకు గడువు ముగిసినప్పటికీ మిగిలిన వారు ఆసక్తి చూపిస్తుండడంతో వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని కలెక్టర్‌కు పంపించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. రూ.13వేల వరకు సబ్సిడీ.. బ్యాంక్ లోన్ స్కూటీల కొనుగోలు కోసం ప్రభుత్వం ఏఎన్ఎంలకు నేరుగా రూ.10 వేల సబ్సిడీ అందించనుంది. అయితే కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రభుత్వం అందించే రూ.10 వేల సబ్సిడీతో పాటు షోరూంల ద్వారా మరో రూ.3వేలు సబ్సిడీని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. అటు ప్రభుత్వం, ఇటు షోరూంల ద్వారా సబ్సిడీ అందితే స్కూటీ ధరలో దాదాపుగా 40 శాతం మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఏఎన్ఎంలకు స్కూటీలు ఇచ్చేందుకు సుజుకీ, యమహా, హీరో, హోండా, టీవీఎస్ కంపెనీలు ముందుకు రాగా, రుణ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఏఎన్ఎంలు వారికి నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. సబ్సిడీ పోగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి నెలవారీ కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బుకింగ్ చేసుకునేందుకు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఐడీకార్డు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. మెరుగుపడనున్న వైద్యసేవలు ప్రస్తుతం ఏఎన్ఎంలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు మారుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతూ విధుల నిర్వహణలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమయానికి వాహనాలకు అందుబాటులో లేక ఏఎన్ఎంలు పని చేయని సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు స్కూటీలు అందిస్తుండడంతో వారు సమయానికి గ్రామాలకు చేరుకుని వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం లక్షలాది రూపాయల నిధులను వెచ్చించి ఉచితంగా టీకాలను సరఫరా చేస్తోంది. అయితే ఈ టీకాలు నిర్ణీత గడువులోగా వేయకపోతే ఇటు ఆరోగ్యపరంగా అటు ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలుగుతోంది. ఇక మీదట అలాంటి ఇబ్బందులు తప్పుతాయని అధికా రులు పేర్కొంటున్నారు. సేవలు మెరుగవుతాయి.. జిల్లాలో పనిచేస్తున్న ఒక్కో ఏఎన్ఎం మూడు నుంచి నాలుగు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టే పథకాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంతకాలం ఏఎన్ఎంలు తమ పరిధిలోని గ్రామాలను తిరిగేందుకు వారి కుటుంబ సభ్యుల సహకారమో లేదా ఆటోలనో ఆశ్రయించేవారు. స్కూటీలు అందించడం ద్వారా రవాణా సమస్యలు తీరనున్నాయి. సరైన సమయంలో గ్రామాలకు చేరుకుని వైద్యసేవలు అందిస్తారు. – డాక్టర్ భీష్మ, డీఎంహెచ్‌వో -
సిరివరాలు
పీఓ ఏమన్నారంటే.. తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన అమాయకపు సిరివర గ్రామ గిరిజనులపై పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు. గెడ్డ నుంచి గ్రామానికి తాగునీటిని తెచ్చుకునేందుకు పైపులు. 1000ఏలో వ్యవసాయ గట్లకు ఉపాధి పనులు, 30 సోలార్ లైట్లు, సబ్సిడీ రుణాలు, ట్రైకార్లో రైస్ మిల్లు, ఆటోలు, ఉచిత విత్తనాలు, సుఖ ప్రసవాలు జరిపించేందుకు మహిళలకు శిక్షణ, యువతకు డ్రైవింగ్, కంప్యూటర్ తదితర వాటిలో శిక్షణ తదితర అనుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయుల సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వృక్షాలతో నిండిన కొండలు. ఎత్తై లోయలు..ఎవరి ఊపిరి వారికే భయం గొలిపే భయంకర నిశ్శబ్ద వాతావరణం..మా వోయిస్టు ప్రభావిత ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భీకర వాతావరణం. ఎక్కడ ఏ మూల నుంచి ఏ జంతువు వచ్చి దాడిచేస్తుందో...? ఏ విషపురుగులు మీద డతాయో..తెలియని ప్రమాదకర దారి..అక్కడక్కడా విసిరేసినట్లున్న గిరిజన డలు..రాయనక..రప్పనక..కొండనక..కాననక..వాగనక..వంకనక..శ్రమ అనక..చెమట అనక..ఎత్తై ఆరు కొండలను దాటి...సుమారు 7 గంటల పాటు నడిచారు ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ. పార్వతీపురం సబ్-ప్లాన్‌లో గిరిశిఖరాలలో ఉన్న సాలూరు మండలం కొదమ పంచాయతీలోని ఆంధ్రా-ఒడిశా మధ్య శతాబ్దాలుగా సర్వేకు నోచుకోకుండా మిగిలిన ‘సిరివర’ గిరిజన గ్రామంలో గిరిజనుల సమస్యలు, వారి జీవన విధానాన్ని అవలోకనం చేసుకునేందుకు ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆ గ్రామ గిరిజనుల సమస్యలు వింటూ..తక్షణమే పరిష్కరిస్తూ.. ‘సిరివర’కు వరాలజల్లు కురిపించారు. నా పేరు రజత్ కుమార్ సైనీ...ఐటీడీఏ పీఓను: సాలూరు మండలం, కొదమ పంచాయతీ, ‘సిరివర’ గ్రామ గిరిజనులందరికీ నమస్కారం...నేను ఈ రోజు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. మీ సమస్యలను ఒక్కొక్కటి..ఒక్కొక్కరుగా నాకు చెప్పండి. ‘సిరివర’ గ్రామస్తులు: నమస్కారం సారూ..మా సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మా గూడెంకు వచ్చినం దుకు...స్వాగతం...ఐటీడీఏ పీఓ వచ్చారంటే...నమ్మలేని నిజంగా ఉంది... మీరొచ్చినందుకు సంతోషంగా ఉంది. తాగు నీటికి పైపులు...! ఐటీడీఏ పీఓ: మీ పేరేంటి చెప్పండి...? సిరివర గ్రామ గిరిజనుడు: నా పేరు సీదరపు సిత్తురు... పీఓ :మీ ప్రధానమైన సమస్య చెప్పండి...? సిత్తురు: మాకు తాగు నీరు కష్టంగా ఉంది. గెడ్డ దూరంగా ఉంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడుతున్నాం. పీఓ: గెడ్డ ఎంత దూరముంది...? నీరు క్లోరినేషన్ చేస్తున్నారా...? వేడి నీరు తాగుతున్నారా...? సిత్తురు: కిలో మీటరు దూరముంది. అలా తెచ్చి తాగుతుంటాం. వర్షాకాలంలో బురద నీరు. ఆకులు, పుల్లలు కుళ్లిపోయిన కలుషిత నీరే తాగుతూ రోగాల బారిన పడుతున్నాం. పీఓ : సరే...సోషల్ కన్జర్వేషన్‌లో...గెడ్డ నుంచి గ్రామానికి నీరు తీసుకురావడానికి ఎన్ని పైపులు కావాలంటే అన్ని మంజూరు చేస్తున్నాను. ఆ నీరు గ్రామానికి తెచ్చి ట్యాంకులో వేసి, క్లోరినేషన్ మాత్రలు అందులో కలుపుకొని తాగండి. అప్పుడు జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. ఉపాధిలో పొలం గట్లకు టైంగ్ పీఓ : మీ పేరు చెప్పండి...? గ్రామస్తుడు: నా పేరు సీదరపు సింగురు... పీఓ : ఉపాధి పనులు చేస్తున్నారా..? సింగురు: ఉపాధి పనులు చేయలేదు...! ఉపాధి ఏపీఓ దిలీప్: ఇది అన్ సర్వేయ్‌డ్ ఏరియా....అందుకే ఇక్కడ భూ అభివృద్ధిలో ఉపాధి పనులు లేవు. గతంలో ట్యాంకులు చేశాం సార్...ఈ మధ్యనే 1000ఏలో సర్వే చేశాం సార్...80 మంది పనులు కావాలన్నారు. పీఓ : సరే...1000ఏలో ఇక్కడ ఉపాధి పనులివ్వండి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులివ్వండి. పీఓ : సింగురూ...ఉపాధి పనులు ఇస్తే...చేస్తారా...? ఏ పనులు చేస్తారు...? సింగురు: ఎందుకు చేయం. అందరం చేస్తాము. అయితే పొలాలకు రాళ్లతో గట్లు వేసుకుంటాము...అనుమతివ్వండి...? పీఓ : సరే..మీకు ఎన్ని రోజులు కావాలంటే.. అన్ని రోజులు ఉపాధి పనులను ఏపీఓ ఇస్తారు. చేయండి. అలాగే మీ పొలాలకు టైంగ్(రాతి కట్టడాలు) వేసుకోండి. ఇది మీకు మాత్రమే స్పెషల్ పర్మిషన్. టీచర్ల సస్పెన్షన్‌కు ఆదేశాలు.. పీఓ : మీరు చెప్పండి మీ పేరేమిటి..? సిరివర గిరిజనుడు: నా పేరు సీదరపు సొంబురు సామంతు పీఓ : మీరు చెప్పండి. మీ ఊరిలో ఇంకా ఏ సమస్య ఉంది...? టీచర్లు రోజూ బడికి వస్తారా...? చిన్న పిల్లలు వీధుల్లో తిరుగుతున్నారెందుకు...? బడికి పంపించ లేదా...? సామంతు:టీచర్లు బడికి రారు. పీఓ : బడి ఎక్కడుంది...? ఎంతమంది టీచర్లున్నారు..? సామంతు: బడి లేదు...ఒకరి ఇంటి దగ్గర అప్పుడు చెప్పేవారు. ఇద్దరు టీచర్లున్నారు. పీఓ : ఎన్ని రోజులకొకసారి వస్తారు...? సామంతు: టీచర్లొచ్చి ఎన్ని నెలలయ్యిందో...? గురుతు లేదు. ఇద్దరు రారు. సుధీష్ టీచర్ అప్పుడప్పుడు సంతకొచ్చి కలుస్తాడు. హెడ్మాస్టర్ అస్సలు రాడు. అందుకే పిల్లలు అ..ఆ..లు రాకుండా ఊరి మీద, పొలాల కాడ...కొండకాడ తిరిగి గాలిబారిపోతున్నారు. పీఓ : సరే ఆ టీచర్ల సంగతి నేను చూస్తాను. కొద్దిగా పెద్ద పిల్లల్ని మన ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు పంపించండి. పీఓ: సురేష్(సీసీతో) ఇక్కడ స్కూలు ఎంపీపీదా...? ఐటీడీఏదా...? ఆ టీచర్ల వివరాలు తీసుకోండి. డెలివరీ చేసేందుకు శిక్షణ పీఓ : మీ పేరు చెప్పండి...? ప్రసవాలకు ఆస్పత్రికి వెళ్తున్నారా...? సిరివరపు గిరిజన మహిళ: నా పేరు సీదరపు బిందిరి...ప్రసవాలు ఇంటి దగ్గరే అవుతాయి. ఆస్పత్రికి కొండ దిగి వెళ్లలేము. అందుకే... పీఓ : ఇక్కడ ఏఎన్ఎం ఎవరు...? ఆవిడ వస్తుందా...? ఏఎన్ఎం:సార్...నేనే ఇక్కడ ఏఎన్ఎంని నా పేరు సీహెచ్.బుజ్జి పీఓ : చెప్పండి...డెలివరీకి ఆస్పత్రికి ఎదుకు తీసుకెళ్లడం లేదు..? మీరు ఎన్ని పంచాయతీలు చూస్తున్నారు...? పల్లకీలు ఉపయోగపడుతున్నాయా...? ఏడాదికి ఎన్ని డెలివరీలు అవుతున్నాయి...? డెలివరీ తర్వాత మీరు చూస్తున్నారా...? ఇక్కడ ఆశ కార్యకర్త ఉన్నారా? మందులు ఉన్నాయా...? క్లోరినేషన్ మాత్రలున్నాయా..? ఏఎన్ఎం : సార్ డెలివరీకి ఆస్పత్రికి రారు. కొండలు దిగడం కష్టం. ఏడాదికి 10 నుంచి 12 డెలివరీలు అవుతున్నాయి. ఒక్క కొదమ పంచాయతీ చూస్తున్నాను. మొత్తం 16 గ్రామాలున్నాయి. డెలివరీ తర్వాత మెడికల్ కేర్ ఇస్తున్నాం. ఆశ వర్కర్ ఈ గ్రామంలోనే ఉంది. బరువు వల్ల పల్లకీ ఉపయోగించడం లేదు సార్... పీఓ: సరే...డెలివరీ చేసేందుకు గ్రామస్తులకు మనమే శిక్షణ ఇద్దాం. కొంతమందిని ఎంపిక చేయండి..! సబ్సిడీ రుణాలు... పీఓ సైనీ: మీ పేరు చెప్పండి...? ఐకేపీ సీసీ వస్తారా...? మహిళా సంఘాలు ఎలా ఉన్నాయి..? సమస్య ఏమైనా ఉందా...? సిరివర గిరిజన మహిళ: నా పేరు సీదారపు నీలస...మహిళా సంఘం ఉంది. సీసీ రాదు. బ్యాంకుకు వస్తది. మాకు ఈ ఏడాది, గత ఏడాది...లోను రాలేదు. మ్యాచింగ్ గ్రాంట్ రాలేదు. పీఓ : సరే...మీ వద్దకు సీసీ కంటే పెద్ద ఆఫీసర్ని పంపిస్తాను. బ్యాంకులోను అయితే సబ్సిడీ ఉండదు. నేను మీకు సబ్సిడీ లోను లిస్తాను. ఏమి లోను కావాలి. కోరుకోండి. సీదారపు నీలస: మాకు గొర్రెల లోను ఇవ్వండి. రైసు మిల్లు ఇవ్వండి. పీఓ : సరే ట్రైకార్లో మీకు రూ.2లక్షల రైస్ మిల్లు. ఆటోలు కావాలంటే ఇస్తాను. దుగ్గేరు నుంచి మెండ ంగి వరకు నడుపుకోండి. మంచి డబ్బులు వస్తాయి. పంచాయతీ సెక్రటరీ పాపారావు గారూ...ట్రైకార్ అప్లికేషన్లు సిద్ధం చేయండి. విత్తనాలు, ఆయిల్ ఇంజిన్లు ... పీఓ : మీ పేరు చెప్పండి...? పంటలు ఏమి పండిస్తారు...? విత్తనాలు ఎక్కడ నుంచి వస్తాయి...? పంటలు ఎక్కడ అమ్ముతారు...? గిరిజనుడు: నా పేరు సీదరపు లాహిరి సార్...మేము విత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటాం. వరి, చిక్కుడు, సామలు, సోలు(రాగులు), గోధుమలు, జొన్న, కందులు పంటలు పండిస్తాం. కందులు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకాలు చేస్తాం. వరితో పాటు మిగతా పంటలన్నీ తిండికి ఉపయోగిస్తాం. పీఓ సైనీ: వ్యవసాయానికి ఏమి కావాలి...అడగండి...? లాహిరి: ఆయిల్ ఇంజిన్లు ఇవ్వండి. పీఓ సైనీ: ఆయిల్ ఇంజిన్లతోపాటు మీకు ఐటీడీఏ నుంచి మంచి విత్తనాలిస్తాం. ఆ విత్తనాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. వాటిలో కొన్ని మీరు తిని, మిగతావి విశాఖ, విజయనగరం లాంటి పట్టణాలకు పట్టుకెళ్లి అమ్మండి. మంచి ధర వస్తుంది. ఆ పంటల అమ్మకానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. పీఓ ప్రయాణం ఎలా సాగిందంటే...! కోడి కూత కూయగానే ఉదయం 5గంటలకు తన బంగ్లా నుంచి చేత లోగో పట్టుకొని ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పార్వతీపురం ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ బయలు దేరారు. అక్కడ నుంచి పార్వతీపురం మండలం పెదబొండపల్లి, తాళ్లబురిడి మీదుగా మక్కువ మండలం దుగ్గేరుపై నున్న మెండంగి గ్రామానికి 6గంటల ప్రాంతంలో తన వాహనంలో చేరుకున్నారు. అప్పుడప్పుడే మంచు తెరలు వీడుతుండడంతో తట్ట,పార పట్టుకుని..కాయకష్టం కోసం పయనమవుతున్న గిరిజనులంతా..ఇంత తెల్లవారి తమగ్రామానికి ఐటీడీఏ పీఓ రావడం చూసి...ఒకింత ఆశ్చర్యం...మరింత సంతోషంతో..చుట్టూ చేరి...తమ గూడెం పల్లెకొచ్చిన పీఓను పిల్లా పాపలతో వారు కొండపైకి సాదరంగా సాగనంపారు. అలా ఓ గంటసేపు కొండలెక్కాక...దారిలో వచ్చిన ‘తాడిపుట్టి’ గ్రామంలో గిరిజనులతో పీఓ కాసేపు ముచ్చటించి...వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అక్కడే ఆదేశించారు. అనంతరం కాలు జారితే లోయలోకి జారిపోతామన్న రాళ్లరప్పల భయంకర దారిలో నడక ప్రయాణం కొనసాగించారు. గంటసేపు ప్రయాణం తర్వాత ‘డొయివర’ అంచున వెళ్తున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన సీదరపు పొన్న అయ్యా...నాకు రేషన్, ఆధార్, ఉపాధి...ఏ కార్డూ లేదు. నేను ఆంధ్రావావాడినే...అంటూ పీఓకు తన ఆవేదన చెప్పాడు. అక్కడే ఉపాధి ఏపీఓ దిలీప్‌ను పీఓ పిలిచి తక్షణమే ఉపాధి హామీ కార్డు ఇచ్చి, పనులిచ్చి...ఆ కార్డుతో మిగతా కార్డులు చేయించాలని ఆదేశించారు. అనంతరం వాగులు, వంకలు, గెడ్డలు...కర్రల వంతెనలు దాటి...గిరిశిఖరంలో ఉన్న ‘సిరివర’కు చేరుకున్నారు. తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన ఆ అమాయకపు గిరిజనులకు పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు. పొట్టతగ్గుతుంది కదా..! పీఓ తన ప్రయాణంలో బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయులను సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. అనంతరం తనను బతిమాలుతున్న టీచర్ని చూసి...వారానికోసారైనా బడికొస్తే...జీతంతోపాటు బరువు కూడా తగ్గుతారు కదా...? అని చలోక్తులు విసిరారు. అలాగే తన దఫేదార్ ఎస్.రమణతో వారానికి ఓ హిల్‌టాప్ గ్రామానికి వెళ్దామా...? నీ పొట్ట తగ్గుతుందని హాస్యమాడారు. కొండ దిగొచ్చే సమయంలో కొండనుంచి వెదురు బొంగుల ద్వారా వస్తున్న నీటితో ముఖం కడుక్కుని, ఆ నీరు తాగారు. పీఓ రాకతో సిరివర పున్నమై పూసింది. పది మంది మేలు కోరిన ‘సాక్షి’కి పులకించిన ‘సిరివర’ తన దీవెనలు గుమ్మరించింది.