విజయనగరం పూల్‌బాగ్: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ కులాలు కానివారు)2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీతో కూడిన సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోందని కలెక్టర్ వివేక్‌యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాకు రూ.12.76 కోట్లతో 638 మందికి రుణాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయల యూనిట్ ధరలో 50 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం ఉంటుందన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన కులాల వారు పట్టణ ప్రాంతాల్లో రూ.1.03 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.61వేల లోపు వార్షిక ఆదాయం గల 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్నవారు రుణాలకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు www.apobm-m-r.c-f-f.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని మండల, మున్సిపల్ స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. వెబ్‌సైట్ ఈనెల 19వ తేదీ నుంచి ఓపెన్ చేయబడిందని అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08922–272080, 94409 66575 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment