
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో మరో ఉహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ శనివారం సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే, కోర్టు ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. కాగా, పిటిషన్ ప్రకారం.. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది. దీంతో, లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు అయ్యింది.
ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే, కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, కవితను ఈనెల 20వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఈడీ లేఖ రాసిన సంగతి విధితమే.
ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాం కేసు.. కవితకు షాకిచ్చిన ఈడీ
Comments
Please login to add a commentAdd a comment