caveat petition
-
చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం.. ► సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ► చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి ► విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు ► నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారు ► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి ► ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ ► ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం: ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు లాయర్ సిద్దార్థ లూథ్రా క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీజే.. చంద్రబాబు పిటిషన్‌పై మంగళవారం ఏదో ఒక బెంచ్ విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతో, పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జరిగింది ఇదే.. "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాగానే.. న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు.. -
కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మూడువారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ ED) తనకు సమన్లు జారీ చేయడాన్ని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన సంగతి తెలిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్.. విచారణ వాయిదా వేసింది. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. కవితకు నోటీసులు ఇచ్చే క్రమంలో ఈడీ నియమాలు, నిబంధనలు పాటించలేదు. ఆమెకు ఇచ్చిన నోటీసుల్లో.. ఇన్వెస్టిగేషన్‌కు రమ్మని ఆదేశించారు. నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్‌కు ఎలా పిలుస్తారని ఈడీ తీరుపై సిబాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కార్యాలయానికి పిలిచే వ్యవహారంలో.. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఓసారి పరిశీలించాలని సిబాల్ అన్నారు. ఆపై ఈడీ తరపున న్యాయవాది వాదిస్తూ.. విజయ్ మండల్ జడ్జిమెంట్ పీఎంఎల్ఏPMLA కేసుల్లో వర్తించదని, పీఎంఎల్ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని గుర్తు చేశారు. పీఎంఎల్ఏ సెక్షన్ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది. ఆపై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితలను ఆదేశిస్తూ. పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం. ఇదీ చదవండి: సిగ్గనిపించట్లేదా? అని ముఖం మీదే.. -
లిక్కర్ స్కాం కేసులో ఊహించని ట్విస్ట్..
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో మరో ఉహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ శనివారం సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కోర్టు ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. కాగా, పిటిషన్ ప్రకారం.. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది. దీంతో, లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే, కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, కవితను ఈనెల 20వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఈడీ లేఖ రాసిన సంగతి విధితమే. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాం కేసు.. కవితకు షాకిచ్చిన ఈడీ -
అగ్నిపథ్: మేం చెప్పేది వినండి.. సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నా అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకంగా.. పలు రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఒక్కసారిగా అవి హింసాత్మకంగా మారిన పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు సుప్రీం కోర్టులోనూ ఈ పథకానికి మూడు వ్యతిరేక పిటిషన్లు సైతం దాఖలు అయ్యాయి. ఈ తరుణంలో కేంద్రం మంగళవారం ఉదయం కేవియట్ దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోయే ముందు తమ వాదనలు వినాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది కేంద్రం. అయితే కేవియట్‌లో ప్రత్యేకించి ఎలాంటి అభ్యర్థనను చేయలేదు. కేవలం తమ చెప్పింది మాత్రం పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం కోరడం విశేషం. అడ్వకేట్ హర్ష్ అజయ్ సింగ్, లాయర్లు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీలు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ర్లమెంట్‌లో చర్చించి ఆమోదం పొందకుండానే కేంద్రం దీన్ని తీసుకొచ్చిందని పిటిషన్‌దారు అడ్వొకేట్ ఎం.ఎల్.శర్మ ఆరోపించారు. పథకాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఇక కేంద్రం అగ్నిపథ్ ప్రకటన వెలువడ్డాక.. జూన్ 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. ‘అగ్నిపథ్’తో బీజేపీకి... సొంత సైన్యం కోల్‌కతా: అగ్నిపథ్ పథకంతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఆరోపించారు. ఈ పథకం సైనిక దళాలను కించపర్చేలా ఉందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, ఇప్పుడు జనాన్ని వెర్రివెంగళప్పలను చేస్తోందని ధ్వజమెత్తారు. -
క్యాట్‌లో కేంద్రం కేవియట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్యాడర్ కేటాయింపులపై వుుసారుుదా నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లపై తమ వాదన వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీచేయరాదని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. క్యాడర్ కేటాయింపులను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా క్యాడర్ కేటాయింపులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తే పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోసారి ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది సమావేశం త్వరలోనే ఉంటుందని తెలిసింది. ఢిల్లీలో మంగళవారం ఈ కమిటీ సమావేశం అయినప్పటికీ.. గతనెల 22న జరిగిన సమావేశంలో తాత్కాలిక కేటాయింపు జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవని సమావేశం అనంతరం సమాచారం ఇచ్చారు. అయితే తాజాగా ఈ తాత్కాలిక జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చిన అధికారులకు సంబంధించి మార్పులు ఉంటాయా.? లేక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు అధికారులు కావాలంటూ పట్టుపడుతున్న నేపథ్యంలో ఆ మార్పులు మాత్రమే ఉంటాయా? అనేదానిపై స్పష్టత లేదు. కాగా, కమిటీ తుది సమావేశం ఈనెల 15 తరువాత జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.