సాక్షి, ఢిల్లీ: ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..
► సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
► చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి
► స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి
► విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు
► నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారు
► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి
► ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ
► ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం: ఏపీ ప్రభుత్వం.
ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు లాయర్ సిద్దార్థ లూథ్రా క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీజే.. చంద్రబాబు పిటిషన్‌పై మంగళవారం ఏదో ఒక బెంచ్ విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతో, పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
జరిగింది ఇదే..
"నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే..
చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాగానే.. న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.
► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి
► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి
► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి
► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి
► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా.
ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..
Comments
Please login to add a commentAdd a comment