సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా పడింది. అయితే, లిక్కర్ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన అనంతరం.. వాయిదా వేసింది.
విచారణకు రావాల్సిందే..
ఇక, విచారణ సందర్బంగా తదుపరి విచారణ వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ వాదనలు వినిపించింది. అంతగా కావాలంటే కవితకు 10 రోజులు సమయం ఇస్తామని ఈడీ పేర్కొంది.
నేను రాను.. తేల్చుకుందాం!
ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కవిత కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో తాను ఈడీ విచారణను రాలేనని అధికారులకు తెలిపారు. కోర్టులో తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తాజాగా కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేయడంతో ఆమె.. రేపు ఈడీ విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: కవితకు ఈడీ నోటీసులు.. మంత్రి మల్లారెడ్డి రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment