
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీకి బయలుదేరారు.
వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈనెల 20వ తేదీన విచారణను రావాలని ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కవిత ఢిల్లీకి వెళ్లారు. ఇక, కవిత వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ రావు కూడా ఉన్నారు.
అయితే, ఎమ్మెల్సీ కవిత.. రేపు ఈడీ ఎదుట హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈడీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కవిత.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో కవిత.. న్యాయవాదిని పంపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టును ఈడీ ఆశ్రయించింది. కవిత పిటిషన్‌పై కేవీయట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది.
ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment