సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. నాలుగు గంటలపాటు సోదాలు జరిపిన అనంతరం కవితను అరెస్ట్ చేసింది ఈడీ.
కావాలనే శుక్రవారం వచ్చారు
అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చి.. ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. సుప్రీం చెప్పిన మాటను పక్కన పెట్టిన తమ అధికారులు (ఈడీ).. కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈడీ అధికారులు కవిత ఇంటికి కావాలని శుక్రవారం వచ్చారని ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని కవిత, కుటుంబ సభ్యులు, పార్టీ లీడర్లు తెలిపారు. దర్యాప్తు సంస్థ అక్రమ రెస్టును న్యాయపరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీష్ రావు కోరారు.
కవిత అరెస్ట్.. కక్ష సాధింపు కాదు: ఈటల
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ సోదాలు కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్య కాదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. విచారణ సంస్థలు తన పని తాము చేసుకొని పోతాయన్నారు. దేశంలో విచారణలు జరగడం ఇదేం మొదటిసారి కాదని అన్నారు. దర్యాప్తు సంస్థలు తన దగ్గరున్న ఆధారాలను బట్టి విచారణలు జరుపుతాయని పేర్కొన్నారు. కక్ష సాధింపులకు దిగాల్సిన అవసం బీజేపీకి లేదని తెలిపారు.
డిల్లీకి కవిత!
అరెస్టు వియం కవిత కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు తెలియజేశారు. కవిత భర్త అనిల్‌కు మెమో ఇచ్చారు. కవితను నేడు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు అధికారులు. రాత్రి 8.45 విమానంలో కవితను ఢిల్లీకి తరలించనున్నారు. ఇక లిక్కర్ కేసులో మరికొందరు బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
ఈడీ అధికారులతో వాగ్వాదం
కవిత నివాసం వద్దకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. ముందుగా వారిని లోపలికి వెళ్లనివ్వని అధికారులు.. కాసేపటి తరువాత అనుమతించారు. ఈ క్రమంలో విచారణ అధికారులతో కేటీఆర్, హరీష్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీ ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment