న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సాధారణ బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయస్థానం మద్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యతిరేకించింది. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఆయన ఆరోగ్యం అడ్డురాలేదని పేర్కొంది.
అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారని .. అక్కడ ప్రచారం చేసేందుకు ఆయన బెయిల్ ఇవ్వలేదని తెలిపారు. పంజాబ్‌లో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌కు ఆయన ఆరో గ్యం ఆటంకం కలిగించలేదని అన్నారు.
‘ఇప్పటి వరకు సీఎం చాలా ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషయంలో బెయిల్ దాఖలు చేశారు. అయన ప్రవర్తన బెయిల్‌కు అర్హత కాదు’ అని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదపరి విచారణను జూన్1కు వాయిదా వేసింది.
కాగా లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాలని ఆదేశించింది.
అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని వివరించింది. దీంతో ఈ కేసులో మధ్యంతర, సాధారణ బెయిల్‌ను కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment