( ఫైల్ ఫోటో )
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి హౌసింగ్ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉన్న ప్రకాష్.. లక్ష్మి బంధువులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ప్రకాష్‌కు లక్ష్మి భర్త, బంధువులు దేహశుద్ధి చేశారు. లక్ష్మిని లోబరుచుని నగదు, బంగారం అపరిహరించాడని ఆమె భర్త, బంధువులు అంటున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
చదవండి: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి
కాగా, ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆది నుంచీ నేర చరిత్ర కలిగిన వాడని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రకాష్‌పై ఉన్న కేసులు, అభియోగాలను వివరించారు. ఉన్నతాధికారులు అతన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారన్న దానిలో వాస్తవం లేదన్నారు. ప్రకాష్‌పై అభియోగాలు రుజువైనందున అండర్ రూల్ ఆఫ్-20 ‘ఏపీసీఎస్ రూల్స్ 1991’ ప్రకారం ఆగస్టు 24న ప్రకాష్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. విచారణ రిపోర్టులు అన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు.
ఇదీ లక్ష్మి కేసు..
‘అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన బి.లక్ష్మి ‘స్పందన’లో జిల్లా ఎస్పీకి లిఖితపూర్వక పిటిషన్ ఇచ్చింది. కానిస్టేబుల్ ప్రకాష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించడమే కాకుండా 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొన్నాడని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించి, బెదిరించినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఎస్పీ తక్షణమే గార్లదిన్నె పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. గార్లదిన్నె ఎస్‌ఐ 2019 జూన్ 22న కేసు నమోదు చేశారు. ప్రకాష్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ ఎస్పీకి నివేదిక పంపారు.
దాని ఆధారంగా 2019 డిసెంబరు 19న ప్రకా‹Ùను సస్పెండ్ చేశారు. అదే రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆఫీసర్‌గా ధర్మవరం ఎస్‌డీపీవో రమాకాంత్‌ని నియమించారు. ఓరల్ ఎంక్వైరీ ఆఫీసర్‌గా అనంతపురం సీసీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషాను నియమించారు. విచారణాధికారులు 8 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. మార్చి 1న లక్ష్మి కూడా డీఎస్పీ మహబూబ్ బాషా ముందు సాక్ష్యం ఇచ్చింది. ప్రకాష్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడని తెలిపింది. ఈ ఏడాది జూన్ 23న ప్రకాష్ ఓరల్ ఎంక్వైరీ ఆఫీసరు ముందు సంజాయిషీ ఇచ్చారు. లక్ష్మి చెప్పిన విషయాలను అతను ఖండించలేదు. దీంతో ఓరల్ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్టును జూన్ 23న డీఎస్పీ మహబూబ్‌బాషా జిల్లా ఎస్పీకి అందజేశారు. అనంతరం ప్రకాష్‌కు మూడు నోటీసులిచ్చాం. చివరి నోటీసుకు అతను ఆగస్టు 17న సంజాయిషీ ఇచ్చారు’ అని ఏఎస్పీ వివరించారు.
ప్రకాష్ నేరాల చిట్టా ఇది
♦2000 ఫిబ్రవరి 11న ఆర్‌ఎస్‌ఐ శేఖర్‌పై హత్యాయత్నం కేసులో ప్రకాష్ నిందితుడు. ఈ కేసులో 2001 జనవరి 1న అతన్ని అరెస్టు చేశాం.
♦2006లో హైవే పెట్రోలింగ్ వాహనం డ్రైవర్‌గా ఉన్న ప్రకాష్.. ఇందిరా ప్రియదర్శిని హోటల్ çసప్లయర్ బి.ధనుంజయబాబును ఇనుప రాడ్‌తో కొట్టాడు. ఈ కేసులో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి 2 ఏళ్లు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. అప్పీల్ సమయంలో నిందితుడు, ఫిర్యాదుదారు రాజీ పడ్డారు.
♦2008 అక్టోబరు 18న కదిరిలో బజాజ్ క్యాలిబర్ (ఏపీ0హెచ్ 5780) చోరీ చేశాడు.
♦2009లో అనంతపురం సాయినగర్‌కు చెందిన కురుగోడు గంగాధర్‌కు స్లె్పండర్æ బైక్(ఏపీ04ఎఫ్ 0874) చోరీ చేశాడు. ఈ కేసులో ప్రకా‹Ùను పోలీసులు 2009 జూన్ 13న అరెస్టు చేశారు.
♦2009 జూన్ 12న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద బైక్ (ఏపీ02 కే 9283) చోరీ చేశాడు. ఈ కేసులోనూ ప్రకాష్‌ను అరెస్టు చేశారు.
♦కదిరిలో 2014 ఫిబ్రవరి 11న ప్రకాష్, మరో నలుగురు ఏపీ 02 ఆర్ 1456 స్కార్పియో వాహనంలో అబ్రహాంను కిడ్నాప్ చేసి కేరళలో నిర్బంధించి, ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. దీనిపైనా కేసు నమోదు చేశారు.
♦2019లో అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుండగా కలెక్టర్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
♦ఈ ఏడాది అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్‌పై ఫోర్జరీ కేసు నమోదయ్యింది. ఈ తరహా 10 కేసులతో పాటు శాఖాపరమైన చర్యలు ప్రకా‹Ùపై చాలా ఉన్నాయి.
♦2008 జూన్ 25న ప్రకాష్‌ను ఓసారి సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.
ఎస్పీ, మరో ఇద్దరు అధికారులపై కేసు నమోదు
డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి, ఏఆర్ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, అనంతపురం సీసీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషాలపై (క్రైం నంబర్ 209/2022 అండర్ సెక్షన్ 167, 177, 182 రెడ్‌విత్ 34 ఐపీసీ 3 (1)(క్లాజ్), సెక్షన్ 3 (2) సెవెన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్) కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణాధికారిగా పలమనేరు ఎస్‌డీపీవో సి.ఎం. గంగన్నను నియమిస్తూ డీఐజీ ఎం.రవిప్రకాష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రకాష్ అందుబాటులోకి రాలేదు : గంగన్న
ఎస్పీపై నమోదైన కేసులో విచారణాధికారి గంగన్న గురువారం అనంతపురం వచ్చారు. విచారణకు హాజరుకావాలని కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఫోన్‌లో సంప్రదించామన్నారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో నోటీసు ఇంటికి, ప్రకాష్ ఫోన్‌కు మెసేజ్, వాట్సాప్ ద్వారా పంపినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment