దేవుడిలా ఆదుకున్న పోలీస్‌.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రశంసలు | Police Constable Help Destitute Woman In Anantapur District | Sakshi
Sakshi News home page

దేవుడిలా ఆదుకున్న పోలీస్‌.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రశంసలు

Nov 27 2021 10:21 AM | Updated on Nov 27 2021 10:53 AM

Police Constable Help Destitute Woman In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గూటి పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మారుతీ ప్రసాద్ ఓ అభాగ్యురాలిపట్ల మానవత్వం చూపించారు. అనంతపురం హైవే రోడ్డులో చలితో వణుకుతున్న మహిళకు తన వింటర్‌ జాకెట్‌ని అందించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు నగదు సాయం చేయడంతో పాటు అనాథ శరణాలయంలో చేర్చి  మారుతీ ప్రసాద్‌ తన మానవత్వాన్ని చాటుకున్నారు.

కానిస్టేబుల్‌ దాతృత్వానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మారుతీ ప్రసాద్‌ని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement