సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్ అయ్యారు. రూ. 2వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ముఠాకు ఏఆర్ ఆర్‌ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కాగా, స్వర్ణలత జీవితంలో మరో కోణం బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. స్వర్ణలత సొంత జిల్లా విజయనగరంలో ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వర్ణ ఫౌండేషన్(www.swarnafoundationgroup.com) పేరుతో పేద విద్యార్థులకు, మహిళలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే, తాజాగా స్వర్ణలతపై ఆరోపణల నేపథ్యంలో ఆర్ఐ స్వర్ణలత ఫౌండేషన్ కార్యకలాపాలు బయటకు వచ్చాయి. కాగా, స్వర్ణ ఫౌండేషన్ సంస్థ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజల ఆరోగ్యం, విద్య కోసం పనిచేస్తోంది. ఆరోగ్యం, విద్యకున్న ప్రాముఖ్యత గురించి అవగాహాన కల్పిస్తోంది. ఈ ఫౌండేషన్ అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలను ఆదుకోవడం, పిల్లల విద్య, ఆరోగ్య సమస్యల కోసం ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం అనే ప్రాథమిక లక్ష్యంతో ఏర్పడింది.
ఇది కూడా చదవండి: జీడిపై చీడ రాతలు! అప్పుడు కిమ్మనని రామోజీ ఇప్పుడు మాత్రం గుండెలు బాదుకుంటున్నాడు
Comments
Please login to add a commentAdd a comment