సాక్షి, విజయనగరం : తుమ్మికాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తుండటంతో మితిమీరిన వేగంతో ప్రయాణించారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీని, అరకు నుంచి వస్తున్న కారు డీకొట్టింది.
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మార్గమద్యలో మృతి చెందాడు. మరో వ్యక్తికి చికిత్సను అందిస్తున్నారు. కారులో రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి లోడ్‌తో అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment