సాక్షి, విజయనగరం: రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ 26 నుంచి 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బాబు కుటుంబ సభ్యుల సూచనలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే అచరిస్తామని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే పార్టీ వైఎస్సార్‌సీపీయే. విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘ నిన్నటి సభలో సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారు. వ్యక్తి గత దూషణలు చేయలేదు. లోకేష్ అమిత్ షాను కాదు అమితాబ్‌ను కలిసినా మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారు కానీ వ్యక్తి గతం కాదు’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్
►26- ఇచ్చాపురం
►27-గజపతినగరం
►28-భీమిలి
►30-పాడేరు
►31-ఆముదాలవలస
►నవంబర్ 1-పార్వతీపురం
►నవంబర్ 2 -మాడుగుల
►నవంబర్ 3 -నరసన్నపేట
►నవంబర్ 4 -ఎస్.కోట
►నవంబర్ 6 -గాజువాక
►నవంబర్ 7 -రాజాం
►నవంబర్ 8 -సాలూరు
►నవంబర్ 9 -అనకాపల్లి
చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment