సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబును స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ టార్గెట్ చేశారు. కృష్ణబాబుపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ పెట్టిన విజయ్.. పులివెందుల కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేశారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో కృష్ణబాబు పని చేశారంటూ పోస్ట్ పెట్టారు.
విజయ్ బహిరంగ ఆరోపణలతో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు మనస్తాపం చెందారు. ఎన్నికల తర్వాత బిల్లులు చెల్లించలేదంటున్న కృష్ణబాబు.. ఫేజ్-2 మెడికల్ కాలేజీలకు ఫలితాల ముందు రూ. 125 కోట్లు చెల్లించామని.. అందులో పులివెందుల కాలేజీకి రూ.25 కోట్లు చెల్లించామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయ్ తప్పుడు ఆరోపణలపై కృష్ణబాబు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment