krishna babu
-
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కొవ్వూరు: వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్టీ రామారావుపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు వేరైనప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఆయన మరణానంతరం 2012లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లోనూ, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో పునర్విభజన అనంతరం కొవ్వూరులోనూ కృష్ణబాబు రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన భార్య నాగమణి గతంలోనే మరణించారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ సలహాదారు, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.రాజీవ్‌కృష్ణ ఆయన అల్లుడు. కృష్ణబాబు మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కొవ్వూరు మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన దొమ్మేరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
పేదవాడికి ఆరోగ్యశ్రీ చేరువ చేయడమే లక్ష్యం: సీఎం జగన్
-
ప్రతి ఇంటిలోనూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తాం: సీఎం జగన్
-
కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో వైద్య విద్యలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి ముందు, తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ వైద్య కళాశాలలను ప్రైవేటు కాలేజీలకు దీటుగా నిర్వహించడంలో భాగంగా ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు బుధవారం జారీ చేశారు. ఈ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని మూడు విభాగాలుగా చేశారు వాటిలో 50 శాతం జనరల్ విభాగం, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయనున్నారు. జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఎన్ఆర్ఐ విభాగంలో రూ. 20 లక్షలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా వచ్చే ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీ మెర్క్)లో డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి చేపడతారు. రూ.12,300 కోట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.16 వేల కోట్లతో నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల బలోపేతానికి రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం రూ.12.300 కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెచ్చిస్తున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన నూతన కళాశాలలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. ఈ వైద్య కళాశాలలన్నింటికీ కొత్తగా పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన 7 వైద్య కళాశాలలు 2025–26లో ప్రారంభించాలని నిర్ణయించారు. -
వైద్యశాఖలో 2,118 పోస్టుల మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడేళ్ల వ్యవధిలో ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కోచోట 150 సీట్ల చొప్పున 750 ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఇదిలావుండగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఎస్ఆర్ జిల్లా పాడేరు, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు. ఇప్పటికే ఈ మూడు చోట్ల ఉన్న ప్రభుత్వాస్పత్రులను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా 330 పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో 16 యూనిట్లతో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడానికి వీలుగా అడిషనల్ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్, వివిధ పోస్టులను సృష్టించారు. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు. ఇదిలావుండగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్ నరసింహం ‘సాక్షి’తో చెప్పారు. కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. -
వైద్య ఆరోగ్య రంగంలో అగ్రగామి ఏపీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్), శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం నూరా హెల్త్ సంస్థ, యూనిసెఫ్ల సహకారంతో వైద్య శాఖ కేర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంపై ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి విజయవాడలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రతి లక్ష ప్రసవాలకు దేశంలో ఎంఎంఆర్ 97గా ఉంటే ఏపీలో 45గా ఉందని, ఐఎంఆర్ దేశంలో 28గా ఉంటే రాష్ట్రంలో 24కు తగ్గిందని చెప్పారు. ఎంఎంఆర్, ఐఎంఆర్‌ను సింగిల్ డిజిట్‌కు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ కేర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు సంరక్షణ, రక్తహీనత సమస్య నివారణ.. ఇలా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో దేశంలోనే ఒకటి, రెండోస్థానాల్లో రాష్ట్రం ఉండాలన్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, నూరా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సీమామూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్.ఎస్.అనిల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగవు రాష్ట్రంలో మే ఒకటో తేదీ నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కృష్ణబాబు కోరారు. ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రా«దాన్యం ఇస్తున్న సీఎం జగన్ బిల్లుల చెల్లింపు విషయంలోను తీవ్రజాప్యం లేకుండా చూస్తున్నారని చెప్పారు. ఇటీవల బిల్లు చెల్లింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, పెండింగ్ బిల్లుల్లో కొంత భాగాన్ని త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. రూ.రెండువేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నది వాస్తవం కాదని, రూ.800 కోట్ల మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తుంటే.. ప్రస్తుతం రూ.మూడువేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దీన్నిబట్టి ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోందని చెప్పారు. -
ఏపీలో కరోనా మరణాలు లేవు: కృష్ణ బాబు
-
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు లేవు: ఎంటీ కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12591 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.32 శాతంగా నమోదైంది. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయితే, ఏపీలో మూడు కోవిడ్ మరణాలు సంభవించాయని వస్తున్న వార్తలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ, విశాఖపట్నంలో నమోదైన మూడు మరణాలకి కరోనా కారణం కాదని స్పష్టం చేశారు. మరణించిన వారిలో ఇద్దరు వైరల్ న్యూమోనియా, ఒకరు ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. ఏపీలో కరోనా మరణాలు లేవని, కరోనా పరీక్షల సంఖ్యని 5 వేలకి పెంచామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలో గుర్తించిన 17 వేల మంది జ్వర బాధితులకి పరీక్షలు నిర్వహించి, కరోనాపై అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఏపీలో గత వారంలో పాజిటివిటీ రేటు కేవలం 2.12 శాతం మాత్రమే ఉందని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. కరోనా ప్రస్తుత వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రెండు రోజుల పాటు నిర్వహించిన కోవిడ్ మాక్ డ్రిల్ లో గుర్తించిన విషయాలని సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు అనవసర భయాందోళనలకి గురి కావద్దని తెలిపారు. దీర్ఘకాలిక రోగాలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి.. -
‘వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే ఏపీ రోల్ మోడల్’
విజయవాడ: ఎకో ఇండియా సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందని..ఎకో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, సిబ్బంది సామర్థ్యం పెంచేలా ఎకో ఇండియా ఆధ్వర్యంలో ఎకో ప్రాజెక్టుపై నిర్వహించే రెండు రోజుల సదస్సును ఆయన విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ..ఎకో ఇండియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా శిక్షణ ఉంటుందన్నారు. వార్డు బాయ్ నుంచి అత్యున్నత స్థాయి వైద్యాధికారి వరకు ఎకో ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని..హెల్త్ కేర్ రంగంలో ఇలాంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని..అందుకే గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్పీ తదితర సిబ్బందికి వివిధ విధానాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ జరుగుతోందని..గ్రామస్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని..వారందరికీ ఎకో ప్రాజెక్టు ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు. పలుచోట్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని గుర్తించాలన్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని..కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో మార్పు రావాలన్నారు. టెలీ మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్, టెలీ లెర్నింగ్ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ ఏడాది అయిదు మెడికల్ కళాశాలలు ప్రారంభించబోతున్నామని.. ఇప్పటికే విజయనగరం మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయన్నారు. ఎకో ఇండియా సంస్ధతో ఎంవోయూ ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడలేదని..వారే ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితులు తగ్గించాలనేది ప్రభుత్వ భావనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రానికి 20 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని..జాతీయ రహదారుల పక్కనే 13 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ శ్రీ.జె.నివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగమే ప్రాజెక్ట్ ఎకో అన్నారు. ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం, వైద్యులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం ఎకో ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందన్నారు. ఈ ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు, అధికారులు, తదితర సిబ్బంది ఉపయోగించుకోవాలని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ సూచించారు. ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా మాట్లాడుతూ.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలుకు, వాటిని బలోపేతం చేసేందుకు ఎకో ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. 180 దేశాల్లో ఎకో ప్రాజెక్టు సేవలు అందిస్తోందని..2008లో భారత్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో 20 రాష్ట్రాలతో ఎకో ఇండియా సంస్థ ఎంవోయూ చేసుకుని ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎకో ప్రాజెక్టు ద్వారా డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, డెంటిస్టులు, ఆశా, ఏఎన్ఎం, వైద్య సంబంధింత స్పెషలిస్టులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు పరికరాలను ఉపయోగించడంలో నాణ్యమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాస్మిన్, నోడల్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రమేష్, స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మీ, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎమ్ డాక్టర్ వెంకట కిశోర్, సీఏవో గణపతిరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కన్సల్టెంట్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. -
కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం
సాక్షి, అమరావతి: కాకినాడ జీజీహెచ్‌లో రూ.42 కోట్లతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ నిర్మించడంతో పాటు వైద్యపరికరాల్ని ఏర్పాటు చేసేందుకు రంగరాయ వైద్యకళాశాల అల్యుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్–ఎమ్‌కానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ఆర్–ఎమ్‌కానా ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా వైద్యరంగంలో సీఎం జగన్ ఆస్పత్రుల బలోపేతం, కొత్త వైద్యకళాశాలలు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరుకు స్ఫూర్తిగా తాము ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చామని ఆర్–ఎంకానా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం గ్రౌండ్, మొదటి ఫ్లోర్లను నిర్మించామని, మిగిలిన భవన నిర్మాణం పూర్తిచేయడంతో పాటు అన్ని వసతులతో 18 నెలల్లో ఎంసీహెచ్ బ్లాక్‌ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలతో కూడిన మాతాశిశు సంరక్షణ సేవలు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ బ్లాక్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 12 లేబర్ టేబుళ్లు , 40 పడకల యాంటీనేటల్ వార్డు, రెండు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, మొదటి ఫ్లోర్లో 75 పడకల పోస్ట్‌నేటల్ వార్డు, రెండో ఫ్లోర్లో రెండు అధునాతన ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్లు, మూడు, నాలుగు ఫ్లోర్లలో నియోనేటల్ వార్డు, వెంటిలేటర్, ఫొటోథెరపీ వంటి సౌకర్యాలు సమకూరతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్–ఎంకానా వ్యవస్థాపకులు, రంగరాయ వైద్యకళాశాల రెండోబ్యాచ్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ పాలడుగు రాంబాబు, డాక్టర్ ఎస్.వి.లక్ష్మీనారాయణ, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఆర్–ఎంకానా ప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు కృతజ్ఞతలు తెలిపారు. -
కరోనాపై కంగారొద్దు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యశాఖ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే తొలి నుంచి కరోనా వైరస్ నియంత్రణ పట్ల పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఒకవేళ మన వద్ద కేసుల నమోదు పెరిగినా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా గ్రామస్థాయిలోనే అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలతో పాటు, పాజిటివ్ రోగులకు వైద్యసేవలను అందుబాటులో ఉంచుతోంది. విలేజ్ క్లినిక్స్‌లో ర్యాపిడ్ కిట్లు గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలను చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో కరోనా పరీక్షతో పాటు 14 రకాల రోగ నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విలేజ్ క్లినిక్‌లో కనీసం 10 కరోనా పరీక్షల ర్యాపిడ్ కిట్లను వైద్యశాఖ నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినవారి నమూనాలను ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లకు పంపి పరీక్షించనున్నారు. రాష్ట్రంలో 13 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కేసులు అధికం కొత్త వేరియంట్ కేసుల నమోదుపైనా వైద్యశాఖ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాజిటివ్ రోగుల నమూనాలను విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపి పరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు తేలింది. గత నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య పాజిటివ్ రోగుల 167 నమూనాలను సీక్వెన్సింగ్ చేశారు. వీటిలో అత్యధికంగా 84 కేసులు ఎక్స్‌బీబీ.1.16 రకం ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1 రకం కేసులు 13, ఎక్స్‌బీబీ.2.3. వేరియంట్ కేసులు 17, మిగిలినవి ఇతర వేరియంట్లుగా తేలింది. ఎనీటైమ్ అందుబాటులో పడకలు, మందులు కరోనా తొలి వేవ్ నుంచి వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ.. ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ నిల్వలు, ఇతర చికిత్స వనరులను ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12,292 సాధారణ, 34,763 ఆక్సిజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. 5,813 వెంటిలేటర్లు, 5,610 పీడియాట్రిక్ వెంటిలేటర్లు, 297 నియోనాటల్ వెంటిలేటర్లు, 3,902 డీటైప్ సిలిండర్లు, 15,565 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 170 పీఎస్ఏ ప్లాంట్లు ఉన్నాయి. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 2,64,109 ర్యాపిడ్ కిట్లు, 4,88,962 వీటీఎం–ఆర్టీపీసీఆర్ కిట్లు ఉన్నాయి. చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు 1.39 లక్షలు, ఇతర మందుల నిల్వలు సరిపడా ఉన్నాయి. వందశాతం రెండుడోసుల వ్యాక్సినేషన్ రాష్ట్రంలో 18 ఏళ్లుపైబడిన 3.95 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాల్సిందిగా లక్ష్యం ఉంది. ఈ క్రమంలో లక్ష్యానికి మించి 4.35 కోట్ల మందికి ఇప్పటికే రెండుడోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలందరికీ రెండుడోసుల వ్యాక్సిన్ వేశారు. 18–59 మధ్య వయసుగల 2.30 కోట్ల మందికి ప్రికాషన్ డోసు టీకాను వైద్యశాఖ వేసింది. ఆందోళనకర పరిస్థితి లేదు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ కేసులు పెరిగినా సమర్థంగా నియంత్రించడానికి అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయి. ఫీవర్ సర్వేను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం 49వ రౌండ్ ఫీవర్ సర్వే చేపడుతున్నాం. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అవసరం మేరకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైరస్ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ ప్రజలు సైతం సమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి వైద్య, ఆరోగ్యశాఖ -
శారీరక శ్రమతోనే ఎన్సీడీ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: బీపీ, షుగర్, ఇతర నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) నుంచి బయటపడడానికి నడక, వ్యాయామం వంటి శారీరకశ్రమే శరణ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్, సాంకేతిక విద్యాసంస్థల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ సమస్యల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను డ్రైవ్‌లా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నడక, వ్యాయామాలు చేసుకోవడానికి వీలుగా స్థలాలు, క్రీడామైదానాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనిపై విద్యాసంస్థల యాజమాన్యాలు రెండు, మూడురోజుల్లో తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపాలని కోరారు. రాష్ట్రంలో 1990లో 30 శాతం ఉన్న ఎన్సీడీ ప్రభావం ప్రస్తుతం 63 శాతానికి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ సమస్యలే ప్రధాన కారణమన్నారు. ఈ క్రమంలో ఎన్సీడీ సమస్యల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 30 ఏళ్లు పైబడిన వారికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేసి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఐదుగురిలో ఒకరు బీపీ/షుగర్‌తో ఉన్నట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ సురేష్‌బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి : వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన సదస్సులో పేపర్ రహిత వైద్య సేవలు(డిజిటల్ హెల్త్ సర్వీసెస్) అంశంలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ విభాగం ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్‌ను మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అవార్డులు గెలుచుకోవడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం జగన్ అభినందించారు. -
మార్చికల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సాక్షి, విశాఖపట్నం: వచ్చే మార్చి నాటికి శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అందుబాటులోకి తెస్తున్నామని.. ఇక్కడి ఉద్దానంతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరుల్లోని కిడ్నీ తీవ్రతను తగ్గించే చర్యలు కూడా ఇప్పటికే చేపట్టామని.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపీ), ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలు కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. విశాఖలో మూడ్రోజులుగా జరుగుతున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఒప్పందం జరిగితే ప్రవాస భారతీయ వైద్య ప్రముఖుల సేవలను రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య విద్యాలయాలు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వైద్య రంగ నిపుణుల సూచనలు, సలహాలను ప్రభుత్వం తీసుకుని వాటి ఆచరణకు కృషిచేస్తుందని చెప్పారు. విదేశీ వైద్య ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ప్రధాన వైద్యశాలల్లో అత్యవసర చికిత్సలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని కోరినట్లు తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన మన వైద్యులు వారి అనుభవాలను మన రాష్ట్ర వైద్య విధానంలో మార్పుల కోసం సహకరించాలని కోరారు. అంకాలజీ విభాగాల బలోపేతం అలాగే, రాష్ట్రంలోని ఏడు పురాతన వైద్య కళాశాలల్లో అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సదుపాయాలతో పాటు రేడియోథెరపీ, సర్జికల్, మెడికల్ అంకాలజీ విభాగాలను బలోపేతం చేసే అంశం ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని కృష్ణబాబు వెల్లడించారు. ఈ సదస్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్, ‘ఆపీ’ ఇండియా ప్రతినిధులు డాక్టర్ టి.రవిరాజు, రవి కొల్లి, ‘ఆపీ’ అమెరికా కోఆర్డినేటర్ ప్రసాద్ చలసాని, భారత సంతతి అమెరికా వైద్యులు, దేశంలోని పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. అంతకుముందు.. డాక్టర్ రవిరాజు ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రసాద్ చలసానికి ప్రదానం చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తోందని కృష్ణబాబు చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆరోగ్య పథకాలు, సేవలను అమలుచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు, ప్రతి జిల్లాలో ఒక క్యాథ్‌ల్యాబ్‌ను గిరిజన ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేసిన 2,225 ఆస్పత్రుల ద్వారా 3,255 రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క క్యాన్సర్‌కే ఏటా రూ.400 కోట్లు వెచ్చిస్తోందన్నారు. -
‘డైట్ కాంట్రాక్టర్లకు అధికశాతం బిల్లులు చెల్లించేశాం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లకు గత నెలలోనే అత్యధిక శాతం బిల్లులు చెల్లించామని, ఈ విషయం తెలుసుకోకుండా రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మండిపడ్డారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో షెడ్యూల్ ప్రకారం గతనెల 26నే రూ.6 కోట్ల మేర డైట్‌బిల్లులు చెల్లించామన్నారు. ఇంకా రూ.94 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉందని, త్వరలోనే చెల్లిస్తామని అన్నారు. జనని సురక్ష యోజన కింద రూ.13.69 కోట్లు గత నెల 22నే కలెక్టర్లకు మంజూరు చేశామన్నారు. సాలూరు ఆస్పత్రిలో పెండింగులో ఉన్నది రూ.1.40 లక్షలు కాగా, రూ.12 లక్షలు పెండింగ్ ఉన్నాయంటూ రాశారన్నారు. పార్వతీపురం మన్యంలో రూ.12 లక్షలకు గాను రూ.9.70 లక్షలు డిసెంబర్ 26న చెల్లించామన్నారు. బాడంగి ఆస్పత్రిలో రూ.4.80 లక్షలు పెండింగ్‌లో ఉందన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా తప్పుడువార్తలు రాయడంవెనుక ఉద్దేశం ప్రజలను తప్పుదోవ పట్టించడం, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమేనన్నారు. గ్రీన్ చానల్ ఏర్పాటుచేసి మరీ డైట్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్ చార్జీలను రోగికి రూ.40 నుంచి రూ.80కు పెంచామన్నారు. పెంచిన చార్జీలకు అనుగుణంగా కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక జరుగుతోందని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో బడ్జెట్లో 3.4 శాతం నుంచి 4 శాతం మేర మాత్రమే వైద్య రంగానికి ఖర్చు చేస్తుండగా, మన రాష్ట్రంలో 7.3 శాతం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 2018–19లో ఏపీవీవీపీలో రూ.కోటి మేర నెలకు ఆరోగ్యశ్రీ కింద బిల్లు చెల్లింపులు ఉండేవని, ప్రస్తుతం నెలకు రూ.12 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు చేపట్టిందని, 47 వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పును తెలుసుకోవడానికి జనవరి 26 నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టి ఆడిట్ చేయాలని ముఖ్యమంత్రి‡ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. -
యాంటి బయోటిక్స్ అనధికార విక్రయాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: యాంటి బయోటిక్స్ విచ్చలవిడిగా వినియోగించడం ప్రాణాంతకంగా మారుతోందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారుతున్న యాంటీ మైక్రోబియాల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్)ను నియంత్రించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్ శనివారం ముగిసింది. ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కాల్ ఫర్ యాక్షన్’ను ఆవిష్కరించిన కృష్ణబాబు ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ల బలోపేతానికి ‘విజయవాడ డిక్లరేషన్’ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలను రక్షించుకునేందుకు యాంటీ బయోటిక్స్ వినియోగం వల్ల పెరుగుతున్న ఏఎంఆర్‌ను కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం యాంటి బయోటిక్స్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు అనధికారిక విక్రయాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎంఆర్ కట్టడి కోసం గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఏఎంఆర్ కట్టడి కార్యాచరణ ప్రణాళికను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు రాష్ట్రంలోని కృష్ణా జిల్లాను కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా అమలవుతున్న ఈ ప్రణాళిక ఫలితాలను సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా), ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (ఇఫ్కాయ్), వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ (డబ్ల్యూఏపీ) వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్, ఏఎంఆర్ నోడల్ అధికారి జె.నివాస్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్ నారా>యణ్, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పి.రెడ్డన్న, సెక్రటరీ జనరల్ డాక్టర్ రత్నాకర్, ఇఫ్కాయ్ అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి పాల్గొన్నారు. -
గ్రామాలకు స్పెషలిస్ట్ వైద్యులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రూరల్/ప్రభుత్వ సేవలను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో రాష్ట్ర కోటా, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఒక సంవత్సరం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2022–23వ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కోర్సులు పూర్తి చేసుకున్న స్పెషలిస్ట్ వైద్యులను తొలి ప్రాధాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో నియమిస్తారు. ఆ తర్వాత మిగిలిన వారి సేవలను డీఎంఈ పరిధిలో వినియోగించుకుంటారు. ముందుగానే ఒప్పందం నాన్ సర్వీస్ అభ్యర్థులు కోర్సు అనంతరం సంవత్సరం పాటు రూరల్/ప్రభుత్వ సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రం తీసుకుంటారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి కోర్సు పూర్తయిన 18నెలల వ్యవధిలో ప్రభుత్వ సేవల్లో చేరకపోతే పీజీ చేసినవారికి రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి రూ.50లక్షల జరిమానా విధిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లలో 707 మంది, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో 1,142 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతారు. వీరందరూ ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందనున్న వీరందరూ 2025–26లో కోర్సులు పూర్తి చేసుకుంటారు. అనంతరం గ్రామీణ సేవల్లో చేరాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అన్ని కళాశాలలకు ఆదేశాలు మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. అన్ని కాలేజీలకు ఆదేశాలు ► మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. -
మరింత మెరుగ్గా 108, 104 సేవలు
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 108, 104ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సేవలందించడం లేదంటూ ఐటీ విభాగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులలో జీపీఎస్ సౌకర్యంపై ఆరా తీశారు. వాహనాల మరమ్మతుల విషయంలో జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాహనాల బఫర్ స్టాక్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. రెండు వారాల్లో సేవలు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాం: కృష్ణబాబు
-
వైద్యులకు ఇదో మంచి పేరు తెచ్చుకునే అవకాశం: వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
-
క్యాన్సర్ చికిత్సపై సీఎం జగన్ ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు: కృష్ణబాబు
సాక్షి, అమరావతి: హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్పై ఒప్పందం జరిగినట్లు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఏపీలో క్యాన్సర్ చికిత్సకు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. గత ఏడాది లక్షా 30 వేల మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కిలోమీటర్లకు క్యాన్సర్ వైద్యం అందే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించి వైద్యం అందించాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు క్యాన్సర్‌కి సంబంధించి టెలి కన్సల్టెన్సీ సర్వీస్ ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. చదవండి: (టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్) -
AP: క్యాన్సర్‌కు రాష్ట్రంలోనే కార్పొరేట్ వైద్యం
సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు రాష్ట్రంలోనే కార్పొరేట్ వైద్యం అందిచాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్‌పై అధికారులతో సోమవారం ఆయన మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ రోడ్ మ్యాప్‌ను వివరించారు. కృష్ణబాబు మాట్లాడుతూ.. అధునాతన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 11 ప్రభుత్వ బోధనాస్పత్రులలో క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా 7 బోధనాస్పత్రుల్లో రేడియోథెరపీ, మెడికల్, సర్జికల్ అంకాలజీ విభాగాలను అభివృద్ధి చేయాలన్నారు. మిగతా నాలుగుచోట్ల సేవలు విస్తరింపజేయాలన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ ఆçస్పత్రికి సాంకేతిక బృందాన్ని పంపి శిక్షణాంశాలపై నివేదిక రూపొందించాలన్నారు. గ్రామస్థాయి వరకూ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధంచేయాలని కోరారు. కొత్తగా నిర్మించే 16 వైద్య కళాశాలల్లోను క్యాన్సర్ చికిత్స పరికరాల కోసం బంకర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రేడియో అంకాలజీ కోసం లీనియర్ యాక్సిలేటర్, కొబాల్ట్, బ్రాఖీ థెరపీ, సి.టి స్టిమ్యులేటర్ పరికరాలపై ఆయన ఆరా తీశారు. క్యాన్సర్ కేర్ సెంటర్లుగా ఆ మూడు.. విశాఖ ఏఎంసీ, గుంటూరు జిల్లా చినకాకాని, తిరుపతిలోని బాలాజీ అంకాలజీ ఇన్స్టిట్యూట్ కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని కృష్ణబాబు చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల్లో రేడియోథెరపీని అందుబాటులోకి తేవాలన్నారు. సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంఈ రాఘవేంద్రరావు, డీహెచ్ హైమావతి పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, భద్రతా సిబ్బంది పనితీరును తరుచూ పర్యవేక్షించాలని కలెక్టర్లను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతోనే ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సూచించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు స్పందించాలని సూచించారు. అధునాతన పరికరాల కొనుగోలు, వాటి నిర్వహణను ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు అన్ని బయోమెడికల్ పరికరాల నిర్వహణను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నట్లు చెప్పారు. అదనంగా కావాల్సిన మహాప్రస్థానం వాహనాల విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆర్డీవో, డీఎస్పీలతో కూడిన కమిటీలు ప్రైవేట్ వాహనాల మాఫియాను అడ్డుకోవడంతోపాటు స్థానిక ఆపరేటర్లతో చర్చించి వాహనాల రేట్లను అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు, మహాప్రస్థానం వాహనాలు, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, వ్యాక్సినేషన్, బయోమెట్రిక్ హాజరు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఆరా తీశారు. -
ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి కృష్ణబాబు బదిలీ అయ్యారు. కృష్ణబాబుకు రవాణాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. చదవండి: మండేకాలం.. జాగ్రత్త సుమా..! -
రెండ్రోజుల్లో అందరినీ తీసుకొస్తాం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ రెండ్రోజుల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఈ విషయమై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థుల వివరాలను సేకరించింది. కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్, కన్సల్టెన్సీల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌లో రాష్ట్రానికి చెందిన 615 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కతేలిందని టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. వీరితోపాటు వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడామని.. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక విమానాల్లో వీరందరినీ స్వదేశానికి తీసుకువస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటనలో తెలిపారు. వీరిని ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల నుంచి ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఏపీకి తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చెందిన 32 మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని కూడా మార్చి రెండులోగా తీసుకురానున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. ఇక ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను పోలండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లొవేకియా దేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ సహకారంతో ఆయా దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల సహకారంతో విద్యార్థులకు అవసరమైన వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 5 వర్సిటీల్లోనే అధికంగా విద్యార్థులు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని 14 విశ్వవిద్యాలయాల్లో చేరారని.. ఇందులో అత్యధికంగా ఐదు విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నారని కృష్ణబాబు పేర్కొన్నారు. మరోవైపు.. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న జఫోరియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చుట్టపక్కలే స్వల్పంగా బాంబుదాడులు జరిగినట్లు తేలిందని కృష్ణబాబు తెలిపారు. అలాగే, కైవ్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ యూఏఎఫ్‌ఎం, ఓడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, విన్‌టెసా ఓఓ బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులు అధికంగా ఉన్నారన్నారు. ఇక విశాఖపట్నం నుంచి 95 మంది, కృష్ణా జిల్లా నుంచి 89 మంది, తూర్పు గోదావరి నుంచి 70 మంది విద్యార్థులు వెళ్లగా, అత్యల్పంగా విజయనగరం నుంచి 11 మంది, శ్రీకాకుళం నుంచి 12, కర్నూలు నుంచి 20 మంది వెళ్లారు.