వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు | AP CM YS Jagan Congratulates Health Officials | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు

Published Fri, Jan 27 2023 6:41 PM | Last Updated on Fri, Jan 27 2023 6:45 PM

AP CM YS Jagan Congratulates Health Officials - Sakshi

తాడేపల్లి : వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన సదస్సులో పేపర్‌ రహిత వైద్య సేవలు(డిజిటల్‌ హెల్త్‌ సర్వీసెస్‌) అంశంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ విభాగం ఐదు అవార్డులను గెలుచుకుంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్‌ను మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అవార్డులు గెలుచుకోవడంపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం జగన్‌ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement