సాక్షి,గుంటూరు: వైఎస్‌జగన్ తన హయంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టారని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.ఈ విషయమై రజిని బుధవారం (సెప్టెంబర్18) మీడియాతో మాట్లాడారు.
‘మెడికల్ కాలేజీల బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. దీంతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏపీలోనూ ఉండాలనే ఆలోచనలతో వైఎస్‌జగన్ మెడికల్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రెండో దశలో ప్రారంభించాల్సిన అయిదు మెడికల్ కాలేజీల పరిస్థితేంటి’అని విడదల రజని ప్రశ్నించారు.
విడదల రజిని ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..
- కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది
- ఏపిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
- కాలేజీ ఆస్పత్రులతో పేదలకు మెరుగైన, ఉచిత వైద్యసేవలు అందించవచ్చని వైఎస్‌జగన్ భావించారు
- మెడికల్ కాలేజ్ ఒక్క రాత్రిలో నిర్మాణం కాదు
- వందేళ్ళలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి
- కేవలం ఐదేళ్ళలో వైఎస్‌జగన్ ఐదు మెడికల్ కాలేజ్ ప్రారంభించి మరో ఐదు కాలేజీల నిర్మాణం ప్రారంభించారు
- ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
- కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
- దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయని దుస్సాహాసం కూటమి ప్రభుత్వం చేసింది
- పులివెందుల కాలేజీకి సీట్ల కేటాయింపు వద్దని ప్రభుత్వం లేఖ రాసింది
- పులివెందుల మీద ద్వేషం, రాజకీయ కక్షతోనే ప్రభుత్వం లేఖ రాసింది.
- వైఎస్‌జగన్ మీద కక్షతోనే విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారు
- మూడో ఫేజ్‌లో రావాల్సిన ఏడు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు
- ప్రయివేట్--పబ్లిక్ పార్టనర్ షిప్ లో నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
- ప్రయివేటు వ్యక్తులకు బదలాయిస్తూ స్కామ్‌కు తెర తీస్తున్నారు.
- ఫీజుల జీవోలను రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు అదే జీవో పేరుతో ఫీజులు కొనసాగిస్తున్నారు]
ఇదీ చదవండి.. బాబూ అమరావతి మాత్రమే సెంటిమెంటా..?
Comments
Please login to add a commentAdd a comment