Health officials
-
ప్రాణాలు తీస్తున్న ఆర్ఎంపీలు?! అక్కడ అసలేం జరుగుతోంది?
సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బూరం చెన్నమల్లు యాదవ్ స్వల్ప జ్వరంతో ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌తో కేవలం ఐదు గంటల్లో ప్రాణాలు కోల్పోయాడు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు సైతం ఇలాగే మృతి చెందాడు. తాజాగా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన వివాహిత దన్నూరి పుష్పలత ప్రాణాలు కోలో్పయింది. ఆమె చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చెందిన గోంగ్లె బండు– చైతన్య దంపతుల కుమార్తె ఆద్యశ్రీ (4) ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చింతలమానెపల్లి(సిర్పూర్): గల్లీగల్లీకి వెలుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్‌లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిధి దాటి వైద్యం చేస్తు న్న కొందరు ఆర్ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్ఎంపీలు ఉన్నట్లుగా ఆర్ఎంపీ, పీఎంపీల సంఘాల లెక్కలు చెబుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేని కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు వైద్యపరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతంగా మందులు రాయడం, ఇంజక్షన్లు వేయడం చేస్తున్నారు. కొద్దినెలల పాటు ఆర్ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం గ్రామాల్లో సొంతంగా క్లినిక్‌లు తెరుస్తున్నారు. ధనార్జనే ధ్యేయం.. గతంలో ప్రభుత్వాలు తెచ్చిన నిబంధనలను ఆసరాగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా క్లినిక్‌ల్లో వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స అందించాల్సి వీరు ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో రోగులకు వైద్యం అందిస్తున్నారు. భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల క్లినిక్, మందుల దుకాణం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకేగదిలో నిర్వహిస్తుండడం గమనార్హం. పరిమితులు దాటి చేస్తున్న వైద్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ల్లోనూ ఆర్ఎంపీ క్లినిక్‌లు ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాణాలు పోతున్నా చర్యలేవి..? ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ ఓ వైపు ప్రాణా లు పోతున్నా పట్టించుకోరా..?’ అంటూ ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కిల్లింగ్ ఇంజక్షన్స్.. ఇటీవల బాధితులు మృతి చెందిన ఘటనలు ఆర్ఎంపీలు అందించిన వైద్యంతోనే జరిగినట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న వారికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వాంతులు చేసుకోవడం, చలి పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోగా రోగులు నేరుగా కోమాలోకి వెళ్తున్నారు. ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యం, వారు ఇస్తున్న ‘కిల్లింగ్ ఇంజక్షన్’ ఏంటన్నది వైద్యాధికారులు తేల్చాల్సి ఉంది. రోగుల ప్రాణాలకు ముప్పు వైద్యం అనేది రోగిని అన్నిరకాలుగా పరీక్షించి అందించాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో వైద్యం అందించకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారి వద్దే వైద్యం తీసుకోవాలి. బాధితుల పరిస్థితిని తెలుసుకునే అవకాశం కేవలం నిపుణులకు మాత్రమే ఉంటుంది. – అరుణకొండ రవికుమార్, ఎండీ జనరల్ ఫిజీషియన్, మంచిర్యాల ఎక్కువ డోస్ మందులతోనే.. రోగుల జ్వరం తీవ్రతతతోపాటు ప్లేట్‌లెట్స్‌ను కూడా వైద్యులు గమనించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే ఫ్లూయిడ్స్, నరాల ద్వారా ఇచ్చే మందులను పరిశీలనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ డోస్ మందులను తీవ్రస్థాయిలో వినియోగించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. – సందీప్ జాదవ్, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు -
వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి : వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన సదస్సులో పేపర్ రహిత వైద్య సేవలు(డిజిటల్ హెల్త్ సర్వీసెస్) అంశంలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ విభాగం ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్‌ను మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అవార్డులు గెలుచుకోవడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం జగన్ అభినందించారు. -
నెల్లూరులో భారీగా కుళ్లిన చికెన్.. అక్కడ వేస్ట్‌గా కొనుగోలు చేసి.. ఇక్కడ ఫ్రెష్‌గా..
కాసుల వేటలో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమిళనాడులో చికెన్ వ్యర్థాలుగా పడేసే లివర్, కందనకాయలతో పాటు నిల్వ చికెన్‌ను వేస్ట్‌గా కొనుగోలు చేసి నెల్లూరులో ఫ్రెష్ చికెన్‌గా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్ హెల్త్ అధికారుల దాడులతో సర్దుమణిగిన నిల్వ చికెన్ వ్యాపారం మళ్లీ ఇటీవల కాలంలో పుంజుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై పరిసరాల నుంచి కొనుగోలు చేసిన ఇలాంటి వ్యర్థాలను హోటల్స్‌కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాక్షి, నెల్లూరు: తమిళనాడులో చికెన్ లివర్, కందనకాయలకు డిమాండ్ తక్కువ. ఇక్కడ చికెన్ కేజీ ధరలతోనే లివర్, కందనకాయలను కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్ లివర్, కందనకాయలను దిగుమతి చేస్తున్నారు. నగరంలోని చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా జరుగుతోంది. గతంలో ఇప్పటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పలు దుకాణాలపై దాడులు చేసి గుర్తించిన విషయం తెలిసిందే. తిరిగి వెంకటరమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ ముఠా ఆగడాలకు మరోసారి అడ్డుకట్టవేశారు. కేజీ రూ.100లకే విక్రయం తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రతి వారం భారీగా నిల్వ చికెన్, లివర్, కందనకాయల మాంసాన్ని రూ.40లకే కొనుగోలు చేసి ట్రక్కుల ద్వారా నెల్లూరుకు తరలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు తమ ఇళ్లలో నిల్వ చేసి చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు రూ.100లకు విక్రయిస్తున్నారు. తమిళనాడులో లివర్, కందనకాయలు తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని వాటిని కొనుగోలు చేయరు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చికెన్ ధరతో సమానంగా లివర్, కందనకాయలను విక్రయిస్తుంటారు. తమిళనాడులో నిల్వ ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది. విస్తృత తనిఖీలు అవసరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వెంకటరమణ గతంలో విధులు నిర్వహించిన సమయంలో నగరంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. బోడిగాడితోట వద్ద కుళ్లిన మాంసం నిల్వలపై, చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలపై వరుస దాడులతో విక్రయదారుల్లో భయాందోళన నెలకొంది. ఆ తర్వాత ఆయన మరో విభాగానికి బదిలీ కావడంతో కొంత కాలం ఈ ముఠా ఆగడాలు మళ్లీ చెలరేగాయి. తిరిగి ఎంహెచ్‌ఓగా వెంకటరమణ బాధ్యతలు తీసుకోవడంతో ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మళ్లీ విస్తృత స్థాయిలో దాడులు చేస్తే ఇలాంటి నిల్వ మాంసం విక్రయాలు గుట్టురట్టు అయ్యే అవకాశం ఉంది. 400 కేజీల నిల్వ మాంసం పట్టివేత ►నోటీసులు జారీ, రూ.25 వేల జరిమానా నగరంలోని మైపాడుగేటు వేణుగోపాల్‌నగర్‌లో ఉన్న ఓ చికెన్ స్టాల్లో గుట్టుచప్పుడు కాకుండా 27వ తేదీ నాటి నిల్వ ఉంచిన చికెన్ లివర్, కందనకాయలను ఆరిఫ్ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటకరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. 400 కేజీల చెడిపోయిన మాంసాన్ని గుర్తించారు. దీంతో ఫినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. మాంసాన్ని చెత్త వాహనాల్లో డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన ఆహారం కొనుగోలు చేసేందుకు వస్తారని, ఇలా చెడిపోయిన ఆహారాన్ని విక్రయించడం ద్వారా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. ప్రజలకు అనారోగ్య కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికెన్ స్టాల్‌కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య మాట్లాడుతూ 27వ తేదీనాటి మాంసాన్ని నెల్లూరుకు తరలించి దిగుమతి చేయడాన్ని వెంకటరమణ బృందం దాడులు చేసి పట్టుకున్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారా న్ని మాత్రమే విక్రయించాలన్నారు. -
అంతా ఆ తాను ముక్కలే!
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన.. డిప్యుటేషన్లపై జీహెచ్ఎంసీకి వచ్చి,దాదాపుగా మెడలు పట్టి గెంటినంత పరిస్థితి వచ్చేంత దాకా సహాయ వైద్యాధికారులు (ఏఎంఓహెచ్‌లు) మాతృసంస్థలకు వెళ్లకపోవడంలో పలువురు అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడమేనని తెలుస్తోంది. డిప్యుటేషన్లకు సంబంధించి అవగాహన ఉన్నవారు తెలిపిన వివరాల మేరకు, డిప్యుటేషన్ ముగిసినా వెళ్లకపోవడంలో ప్రధాన పాత్రధారులు ఏఎంఓహెచ్‌లే కాగా.. వారు కొనసాగేందుకు పరోక్షంగా సహకరించిన సంబంధిత అధికారులు సైతం బాధ్యులేనని తెలుస్తోంది. ► జీహెచ్ఎంసీకి వేరే ప్రభుత్వ విభాగం నుంచి డిప్యుటేషన్ మీద పనిచేసేందుకు రావడానికి సంబంధిత అధికారి విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు అంగీకరించాలి. అందుకనుగుణంగా అధికారి మాతృసంస్థ ఉన్నతాధికారులు డిప్యుటేషన్‌పై పంపేందుకు అంగీకరిస్తారు. ఆ మేరకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ► తొలుత ఏడాది కాలానికని వచ్చేవీరు విజ్ఞప్తి చేసుకుంటే.. వీరి పనితీరు నచ్చితే మరో ఏడు పొడిగించేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అంగీకరిస్తారు.అలా ప్రతియేటా పొడిగింపుతో మూడేళ్ల వరకు కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత సైతం కొనసాగాలనుకుంటే.. జీహెచ్ఎంసీ అంగీకరించడంతోపాటు సంబంధిత అధికారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలి. ఆమోదిస్తే ఐదేళ్ల వరకు కొనసాగవచ్చు. ఆ తర్వాత ఉండేందుకు వీల్లేదు. ► ఇలా.. ఒక్కో ఏడాది ముగియగానే నిబంధనలకనుగుణంగా పొడిగింపు లేని పక్షంలో జీహెచ్ఎంసీలోని వారి పైఅధికారి, పరిపాలన విభాగం, వారికి వేతనాలు చెల్లించే విభాగం, అకౌంట్స్ విభాగం గాని గడువు ముగియడానికి ముందస్తుగానే ఆ విషయాన్ని తెలియజేయాలి. నిబంధనలు పాటించనిపక్షంలో వేతనం చెల్లించకుండా తగు చర్యలు తీసుకోవాలి. లేదా మాతృసంస్థకు సరెండర్ చేయాలి. కానీ.. జీహెచ్ఎంసీలో దాదాపు గత అయిదేళ్లుగా ఈ పద్ధతిని పాటించిన దాఖలాల్లేవు. ప్రశ్నించిన సీఎస్? ► ఎప్పుడైతే విస్తృతాధికారాలను జోన్లకు అప్పగించారో, ప్రధాన కార్యాలయం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. సంబంధిత అధికారులకు ఈ విషయాల గురించి తగిన అవగాహన లేదో, లేక మనకెందుకులే అని మిన్నకున్నారో, లేక ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయో తెలియదు గాని అయిదేళ్లు దాటాక కొనసాగుతున్న వారు సైతం ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఉండేవారో తెలియదు గాని.. వారిలో కొందరి అవినీతి పెచ్చరిల్లి బట్టబయలు కావడం... ఒకరిపై ఏకంగా పోలీసు కేసు సైతం నమోదైన నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిని డిప్యుటేషన్ గడువు ముగిసినా ఎందుకు కొనసాగిస్తున్నారని సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
మెక్‌డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం
కొన్ని కొన్ని పనులు సదుద్దేశంతో చేసినప్పటికీ ఒక్కొసారి మనకు తెలియకుండానే అవి పెద్ద పెద్ద వివాదాలకు దారితీసేలా తయారువుతాయి. అచ్చం అలాంటి పరిస్థితినే బ్రెజిల్‌లోని ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ఎదుర్కొంటుంది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) అసలు విషయంలోకెళ్లితే....బ్రెజిల్లో సావో పాలో రాష్ట్రంలోని బౌరులో ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ రూపొందించిన యూనిసెక్స్ టాయిలెట్ బాత్రూమ్ పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ యూనిసెక్స్ టాయిలెట్ రూమ్‌ను పురుషులు, స్త్రీలు ఇద్దరూ వినియోగించేలా మెక్‌డొనాల్డ్స్ రూపొందించింది. అయితే పురుషులు, స్త్రీలు వినియోగించేలా ఒకేలాంటి టాయిలెట్ రూమ్ లేంటి అంటూ ఒక మహిళ హెల్త్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. పైగా చిన్నపిల్లలు కూడా వాటినే ఎలా వినయోగిస్తారంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్న ఒక ఆడియో క్లిప్‌ను కూడా ఆరోగ్య అధికారులకు పంపించారు . దీంతో ఆరోగ్య అధికారులు మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌ని సందర్శించడమే కాక ఆరోగ్య నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్య దృష్ట్యా నిమిత్తమే కాక అందురూ గుర్తించే విధంగా పురుషులకు, స్త్రీలకు వేర్వేరు టాయిలెట్ రూంలు ఉండాల్సిందేనని చెప్పారు. పైగా రెస్టారెంట్లో రెండు వారాలలోపు వేర్వేరు టాయిలెట్ రూంలు ఏర్పాటు చేయాలని లేనట్టయితే మూసివేయడం లేదా జరిమాన వంటి చర్యలు ఎదుర్కోవల్సి ఉంటుందంటూ అధికారులు హెచ్చరించారు. అయితే మెక్‌డొనాల్డ్స్ గౌరవార్థమే ప్రతిఒక్కరూ వినియోగించడానికి స్వాగతించేలా కొద్దిపాటు మార్పులతో ఈ బాత్రూంలు రూపొందించామని అంతేకాక నిర్థిష్ట ప్రమాణాలకు అనుగుణంగా అధికారులకు సహరికరిస్తామంటూ వివరణ ఇచ్చుకుంది. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) -
హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్లతో ఆళ్ల నాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ ఆధారంగా ఆక్సిజన్ సదుపాయం ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వాడుకోవాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. చదవండి: వలపు వల.. బెజవాడలో మాయలేడీ మోసాలు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు -
చంద్రబాబు ట్వీట్‌పై స్పందించిన వైద్యారోగ్యశాఖ
సాక్షి, విజయవాడ: ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా రోగి మృతదేహాన్ని పట్టించుకోలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. జరిగిన వాస్తవాన్ని అధికారులు వెల్లడించారు. రాధాకృష్ణారెడ్డి అనే పేషెంట్ కోవిడ్ లక్షణాలతో మార్కాపురం కోవిడ్ ఆస్పత్రిలో చేరారని, అక్కడ శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడని అధికారులు తెలిపారు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించామని, అక్కడ వార్డుకు తరలించే సమయంలో మూడో ఫ్లోర్ నుంచి దూకేశాడని వివరించారు. వైద్యులు పరీక్షించగా రాధాకృష్ణారెడ్డి చనిపోయినట్లుగా తేలిందని.. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని అధికారులు వివరించారు. -
వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితి
మాయదారి మహమ్మారి జన సమూహంలోకి చొచ్చుకొచ్చేసిందా?.. కరోనా వైరస్ ఇకపై ఎవరికి, ఎక్కడ, ఎలా సోకిందో గుర్తించడం కష్టమేనా?.. వచ్చే నాలుగైదు వారాలు గడ్డు కాలమేనా?.. కరోనా వైరస్ ఇక స్వైరవిహారం చేయనుందా?.. గురువారం వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలో వైరస్ తీవ్ర రూపం దాల్చినట్టే కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్లింది. ఎక్కడుందో, ఎలా సోకుతుందో పసిగట్టడం కష్టం. కంటికి కనిపించని ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి. తక్షణమే గుర్తించడం, వెంటనే చికిత్స పొందడం ద్వారానే కరోనా నుంచి బయట పడగలం. తీవ్రత పెరిగితే ఆ తరువాత ఏం చేసినా ఫలితం ఉండదు’ అని వైద్యశాఖ సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య శాఖ చేపట్టిన చర్యలపై గురువారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని, ఇందులోనూ దీర్ఘకాలిక సమస్యలతో చనిపోయే వారే అధికంగా ఉన్నా రన్నారు. కరోనా వైరస్‌కు భయపడవద్దని, జాగ్రత్తలు పాటించి సహజీవనం చేయడమొక్కటే మన ముందున్న మార్గమన్నారు. ఈ వైరస్ ప్రభావం ఎన్నిరోజులుంటుందో ప్రస్తుతం చెప్పడం కష్టమన్నారు. రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలను పెంచుతున్నామని, ఇటీవల రెండు లక్షల కిట్లు తెప్పించగా వాటితో పరీక్షలు చేశామని, మరో రెండు లక్షల కిట్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ 3 సూత్రాలే శ్రీరామ రక్ష వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, ఆరడుగుల భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం.. ఇవి తప్పక ఆచరించాలన్నారు. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత అధికంగా ఉందని, దీంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, కొత్త జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా చికిత్సను మరింత విస్తృతం చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే అప్పుల పాలే.. బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని, లాక్డౌన్ నేపథ్యంలో మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే అప్పుల పాలవుతారని డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రస్తుతం కరోనాకు ప్రత్యేక చికిత్స లేదని, లక్షణాలను బట్టి మందులు వేసుకోవాలని, ఇది చాలా సింపుల్ పద్ధతి అని అన్నారు. చిన్న లక్షణం కనిపించినా డాక్టర్ వద్దకు వెళ్లాలని, నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పుగా మారుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకు పైగా ఐసోలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల్లో 4,200 పడకలు ఉన్నాయని, మొత్తంగా 15 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. లక్షణాలు ఉన్న వారంతా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఈ మేరకు అన్ని పీహెచ్‌సీల్లో కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజూ సగటున 15 వేల పరీక్షలు చేస్తున్నామని, త్వరలో వీటిని 20–25 వేలకు పెంచుతామన్నారు. కరోనా బారిన వెయ్యి మంది వైద్య సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న దాదాపు వెయ్యికి పైగా వైద్య సిబ్బంది వైరస్ బారినపడ్డారని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. కోర్టుల్లో గడియకో పిల్ వేస్తే ఎలా పనిచేస్తామని, ఇది మంచి పరిణామం కాదన్నారు. వైద్య సిబ్బందికి అన్ని వర్గాలు మద్దతు పలకాలని, కరోనా బాధితులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, స్థానికంగానే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. బాధితుల్ని అవసరమైతే 108 అంబులెన్స్‌ల్లో నగరంలోని ఆస్పత్రులకు తరలించే బాధ్యత వైద్యాధికారులదేనని ఆయన చెప్పారు. ఇటు ‘సీజనల్’ దాడి.. అటు కరోనా పంజా కరోనా వైరస్‌తో కొత్త చిక్కొచ్చిపడింది. అసలే వర్షాకాలం.. జలుబు, వైరల్ జ్వరాలు పంజా విసిరే సమయం. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్‌గా వచ్చే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలకు స్వైన్‌ఫ్లూ కూడా తోడైంది. సీజనల్ వ్యాధులకు..కరోనా వైరస్‌కు కామన్ సింప్టమ్ జ్వరమే. దీంతో ఎవరు ఏ జ్వరంతో బాధపడుతున్నారో గుర్తించడం కష్టం కానుంది. ఇప్పటికే గాంధీ సహా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్లుగా మార్చింది. మున్ముందు కేసులు భారీగా పెరుగుతాయనే వైద్య ఆరోగ్యశాఖ అంచనాలతో ఇప్పటి వరకు టెస్టింగ్, ఐసోలేషన్ సెంటర్లుగా ఉన్న కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయి కోవిడ్ కేంద్రాలుగా మార్చుతున్నట్టు ప్రకటించడంతో ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు చికిత్సలు ప్రశ్నార్థకంగా మారాయి. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఇక్కడ మార్చి 2న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 1,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత వీటి సంఖ్య అనుహ్యంగా పెరిగింది. దీంతో జూన్‌లో 11,080 కేసులు, జూలైలోని 22 రోజుల్లోనే 21,443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటున 800–1,000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలు కన్పించట్లేదని అంచనా. దీంతో తమకు తెలియకుండానే వీరు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ కాంటాక్ట్ ట్రేసింగ్ను నిలిపివేసింది. ఆస్పత్రుల్లోని పడకల నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్ కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్య విధాన పరిషత్ ద్వారా నిర్వహిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లకు బకాయిలన్నీ చెల్లించాలని, ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లు మొదలు పెట్టాలని, శానిటేషన్, పేషెంట్ కేర్ ప్రొవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్ర కార్యాలయ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని తెలిపారు. -
కోర్టు ప్రదక్షిణలతో సరి
సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటికి 87 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకిన వారికి వైద్యం అం దించే విషయంలో క్షణం తీరికలేకుండా పని చేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధి కారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమ యం కేటాయించాల్సి వస్తోంది. ఈ క్లిష్ట సమ యంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టుకు తిరగ డం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం’ అని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గంగాధర్ తదితరులతో సమీక్ష నిర్వహిం చారు. ‘సమీక్ష సందర్భంగా హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచా రణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా కట్టడి, పరీక్షలు–చికిత్స విష యంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సమా వేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు’ అని సీఎంవో ప్రకటనలో తెలిపింది. డ్యూటీ చేసేదెప్పుడు! ‘వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంతమందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధ కలిగిస్తున్నది. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేశారు. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయి. హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉంది. ఏకంగా 87 పిల్స్‌పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరుకావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉంది. అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతున్నది. కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది అని సమావేశంలో పాల్గొన్న పలువురు ఆవేదక వ్యక్తం చేశారు’అని సీఎంఓ పేర్కొంది. పూర్తి వాస్తవాలను హైకోర్టుకు సమర్పించాలి: సీఎం కేసీఆర్ ‘ఈ సమావేశంలో వ్యక్తమయిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు. వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ, అందిస్తున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ, చేస్తున్న పనిని తెలపాలని చెప్పారు’అని సీఎంఓ వెల్లడించింది. హుందాగా, సౌకర్యంగా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్ష ణీయంగా, హుందాగా ఉండాలని, లోపల సకల సౌకర్యాలతో పనిచేసుకోవడానికి అను కూలంగా ఉండేలా తీర్చి దిద్దాలన్నారు. సచివాలయం కొత్త భవనం డిజైన్లను మంగళ వారం పరిశీలించిన కేసీఆర్ పలు మార్పులు సూచించారు. సీఎం, మంత్రులు, సీఎస్, కార్యదర్శులు, సలహాదారులు, సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యా లయాలు ఉండాలని, ప్రతి అంతస్తులో డైనింగ్ హాల్, సమావేశ మందిరం ఉండాలన్నారు. విఐపీలు, డెలిగేట్స్ కోసం వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో ఏం పని జరుగుతుంది? ఎందరు పనిచేస్తారు? ఎందరు సందర్శకు లుంటారు? వంటి విషయాలను పరిగణన లోకి తీసుకొని నిర్మాణం చేపట్టాలన్నారు. -
కరోనా వైరస్: వారిపైనే ఫోకస్
ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. సుమారు 70 మంది జిల్లా నుంచి వెళ్లినట్లు గుర్తించారు. ఈ నెల 19న వీరంతా జిల్లాకు చేరుకున్నారు. అప్పటి నుంచి వీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారితో సన్నిహితంగా 134 మంది ఉన్నట్లు తెలిసింది. వారిలో 90 మందిని గుర్తించి సోమవారం ఒక్కరోజే 80 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. సాక్షి, అమరావతి: మత ప్రార్థనలకు వెళ్లిన వచ్చి క్వారంటైన్‌కు తరలించిన వారి శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపుతున్నారు. సోమవారం ఒక్కరోజే 80 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి శాంపిళ్లు సేకరించారు. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. గుంటూరు, మాచర్ల ప్రాంతాల్లో కరోనా బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో వైద్య సేవలు అందిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లలో వసతుల కల్పన బాధ్యతలను డీఆర్డీఏ పీడీ యుగంధర్‌కు అప్పగించారు. కరోనా అనుమానిత బాధితులను క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే బాధ్యతను డ్వామా పీడీ గజ్జల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు కరోనా అనుమానితులను గుర్తిస్తూ... మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారిలో కొంత మందిని హోం క్వారంటైన్‌తోపాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. కరోనా కోరల్లో జిల్లా ప్రజలు చిక్కుకోకూడదనే ధృఢసంకల్పంతో అధికారులు రేయింబవళ్లు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినే‹Ùకుమార్, తదితర అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దిశ, నిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్న 16 ప్రత్యేక బృందాలను బలోపేతం చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల వివరాలు అందించాలని ఆదేశించారు. విద్యా శాఖతోపాటు, పలు శాఖల ఉద్యోగులను కరోనా విధులకు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 13,593 బెడ్ల గుర్తింపు ప్రైవేటు ఆసుపత్రులను సైతం ఆ«దీనంలోకి తీసుకుని ఆయా ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కలి్పంచి కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో జిల్లాలోని 85 ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను గుర్తించి అందులో 7,312 బెడ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండో దశలో ఆరోగ్యశ్రీలేని ప్రైవేటు ఆసుపత్రులు 97 ఆసుపత్రుల్లో 6,221 బెడ్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 13,593 బెడ్లను ఏర్పాటు చేసే దిశగా ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ పర్యవేక్షిస్తున్న డెప్యూటీ కలెక్టర్ కొండయ్య ఆధ్వర్యలో ప్రణాళికలు రచిస్తున్నారు. మెరుగైన వసతులు కల్పిస్తాం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూలీ పనుల కోసం వచ్చిన వలస కూలీలకు మెరుగైన వసతులతోపాటు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. వలస వచ్చిన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుంటూరులోని మంగళదాస్‌నగర్‌లో ఇప్పటికి పూర్తి లాక్ డౌన్ ఏర్పాటు చేశాం. మాచర్లలోని కంటోన్మెంట్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. –ఐ.శామ్యూల్ ఆనందకుమార్, కలెక్టర్ -
కరోనా: వి‘దేశీ’ యుద్ధం!
సాక్షి, మచిలీపట్నం: విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే అసలు జిల్లాకు ఎంతమంది వచ్చారనే లెక్క పక్కాగా తీశారు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి జిల్లాకు 2,703 మంది వచ్చినట్లుగా ధ్రువీకరించారు. కేంద్ర విమానయాన శాఖ నుంచి వచ్చిన జాబితాలో ఉన్న అడ్రస్‌ల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఇందులో 2,606 మందిని గుర్తించారు. 97 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వీరు ఎక్కడ ఉన్నారనేది దానిపై ఆరా తీస్తున్నారు. జాబితాలో ఇచ్చిన అడ్రస్‌లో వారు లేకపోవటంతోనే సమస్యగా మారింది. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆచూకీ లభించకపోవటంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎందుకిలా జరిగిందనేది నిశిత పరిశీలన చేయాలని పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖలకు ఆదేశించింది. మరో పక్క సచివాలయ, వార్డు/గ్రామ వలంటీర్లు సైతం ఇదే పనిలో ఉన్నారు. (నడుస్తూనే షాపులకు వెళ్లాలి) 9 మందిపై కేసు నమోదు.. విదేశాల నుంచి వచ్చిన వారు 28 రోజుల వరకు తప్పనిసరిగా ఇళ్లల్లోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ కొంతమంది దీనిని బేఖాతర్ చేస్తూ, బయటకొస్తున్నారు. ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదైతే పాస్‌పోర్టు, ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు అంటున్నారు. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావద్దని సూచిస్తున్నారు. (ఇది.. ఇన్ఫోడెమిక్ !) గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ.. విదేశాల నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు 2,443 మంది ఉండగా, ఇందులో 1,305 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా 1,138 మంది పట్టణ ప్రాంతాల వారని అధికారులు లెక్క తేల్చారు. ఇక మిగిలిన వారిలో ఇతర జిల్లాలకు చెందిన వారు 43 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 73 మంది, ఇతర దేశాలకు చెందిన వారు 47 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్లో ఉంచారు. (బోగీల్లో 20 వేల ఐసోలేషన్ పడకలు!) వయసుల వారీ ఇలా.. పది ఏళ్లలోపు వారు 119 మంది ఉండగా, 10నుంచి 20 ఏళ్లు లోపువారు 107 మంది ఉన్నారు. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వారు 1,681 మంది కాగా, ఆ పై వయస్సు గల వారు 536 మంది ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. (పొడిగింపు లేదు.. ఎమర్జెన్సీకి తావు లేదు) -
బతికుండగానే శ్మశానానికి తరలించారు
- వ్యాధిగ్రస్తుడిని మూటకట్టి శ్మశానంలో వదిలిపెట్టిన సిబ్బంది - సీఐ వెంకటరవి సహకారంతో - అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి వైద్యసాయం - తమకు సంబంధం లేదని తేల్చిన హెల్త్ అధికారులు - నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్న సీఐ సాక్షి,తిరుమల : మానవసేవే మాధవ సేవగా సేవలందించాల్సిన టీటీడీ సిబ్బంది ఏడుకొండల వెంకన్న సాక్షిగా మానవత్వాన్ని మంట కలిపారు. ఆలయానికి కూతవేటుదూరంలోనే బతికుండగానే ఓ వృద్ధుడిని శ్మశానానికి తరలించిన ఘటన సోమవారం తిరుమలలో జరిగింది. పోలీసుల సహకారంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆయననెవరు ? మహారాష్ట్రలోని శిరిడీ క్షేత్రానికి 20 కిలోమీటర్లదూరంలోని కోపర్గావ్ పట్టణానికి చెందిన ప్రీతమ్ శివాజి బోస్లే (75). శ్రీవారి దర్శనానికి వచ్చాడు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా తిరుమలలోనే బతుకుబండిని లాగిస్తున్నాడు. అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆలయానికి కూతవేటు దూరంలోని రాంబగీచా అతిథిగృహం వద్ద భక్తులు, స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తిని బతుకుతున్నాడు. ఆరోగ్యం క్షీణించటంతో నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో అతను నిద్రించే ప్రాంతంలో చీమలు పట్టి, రక్తం, నెత్తురు కారే స్థితిలో దుర్వాసన మద్య అతను కాలాన్ని సాగిదీశాడు. బతికుండగానే శ్మశానానికి తరలింపు నడవ లేని స్థితిలో మూలుగుతున్న ఆ వృద్ధుడిని టీటీడీ పారిశుద్ధ్య ఔట్సోర్సింగ్ సిబ్బంది సోమవారం చూసారు. చీము, నెత్తురు కారుతూ కనిపించిన ఆయన పరిస్థితి చూసి ఒకటి రెండు రోజుల్లోనే మరణించే అవకాశం ఉందని భావించినట్టున్నారు. మరణించిన తర్వాత కంటే ముందే తీయటం సులభమనే ఉద్దేశంతో భావించినట్టున్నారు. టీటీడీ హెల్త్ అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించే లారీ తీసుకొచ్చారు. ఓ ప్లాస్టిక్ సంచిలో అతన్ని మూటకట్టారు. లారీలో వేసుకుని ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని శ్మశానంలో మూటగా దింపి సమాధులు మధ్య వదిలిపెట్టి వచ్చేశారు. 108 ద్వారా ఆస్పత్రికి తరలింపు ప్రాణాలతో బతికున్న వృద్ధుడిని మూటకట్టి చెత్తలారీలో ఎక్కించటాన్ని అక్కడి ట్యాక్సీ సిబ్బంది చూసి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో కొందరు మీడియా సిబ్బంది శ్మశానంలోకి వెళ్లి చూడగా మూటలో మూలుగుతున్న వృద్ధుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటరవి తక్షణమే శ్మశానానికి చేరుకుని మూటవిప్పి బాధితుడిని రక్షించే చర్యలు ప్రారంభించారు. బిస్కెట్లు, నీటి బాటిల్ తెప్పించటంతో వాటిని స్వీకరించి బాధితుడు ఆకలి తీర్చుకున్నాడు. నడవలేని స్థితిలోని బాధితుడిని 108 అంబులెన్స్‌లో స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. బాధితుడు కుష్టువ్యాధి గ్రస్తుడని వైద్యులు తెలిపారు. తర్వాత అతన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి లెప్రసీవార్డుకు తరలించి వైద్యం చేయించారు. బాధితుడికి తక్షణమే వైద్య సాయం అందించటంలో చొరవ చూసిన తిరుమల టూ టౌన్ సీఐ వెంకటరవిని ప్రతి ఒక్కరూ అభినందించారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత టీటీడీ హెల్త్ అధికారులు స్పష్టం చేశారు. తమ సిబ్బంది ఎవ్వరిని లారీలో శ్మశానానికి తరలించలేదని వివరణ ఇచ్చినట్టు సీఐ వెంకటరవి మీడియాకు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, సీసీ పుటేజీ ద్వారా నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
స్వైన్ గణగణ
జిల్లాలో వ్యాధి విజృంభణ వినుకొండలో ఒకరి మృతి మరో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నేటికీ ఏర్పాటు కాని నిర్ధారణ కేంద్రాలు కనీసం స్క్రీనింగ్ కేంద్రాలు లేవు సాక్షి, గుంటూరు : జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి కోరలు చాస్తోంది. వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్న వినుకొండకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. జిల్లాలో మరో ముగ్గురికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు వ్యక్తులు అనుమానంతో గుంటూరు నగరంలోని జ్వరాల ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఐడీహెచ్ వైద్యాధికారులు వారి శాంపిల్స్ తీసి హైదరాబాద్‌లోని ఐపీఎంకు పంపగా, వారిలో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయిందని చెబుతున్నారు. వీరిలో పేరేచర్ల గ్రామానికి చెందిన షేక్ బడేషా అనే వ్యక్తికి వ్యాధి పూర్తిగా నయం కావడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన వెంకటనర్సమ్మ అనే మహిళ, కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన అనూష(19) అనే యువతికి వ్యాధి నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. కాగా, గుంటూరుకు చెందిన ఎనుగంటి నర్సయ్య అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్లి అక్కడ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించగా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఒంగోలులో మృతి.. ఇదిలా ఉంటే వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన దివ్వెల ఆంజనేయులు(33) అనే వ్యక్తి గత నెల 28వ తేదీన శ్వాస తీసుకోలేక స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు, అక్కడే చికిత్స పొందుతున్న అతడు సోమవారం రాత్రి మృతి చెందాడు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నప్పటికీ రెండు జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోలేదని మృతుని బంధువులు ఆరోపించారు. ఆంజనేయులు మృతదేహాన్ని గ్రామంలోకి తేవడంతోనే ఎక్కువ సమయం ఉంచకుండా అంత్యక్రియలు ముగించారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మజారాణి ఆదేశాలతో వినుకొండలో గ్రామానికి చేరుకున్న సిబ్బంది ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. భయాందోళనలో ప్రజలు.. జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. గాలి ఆధారంగా సోకే వ్యాధి కావడంతో ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాంణాంతక వ్యాధి అయినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని ఛాతి,ఊపిరితిత్తుల ఆసుపత్రిలో ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉండేది. విభజన అనంతరం నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో ఎక్కడా నిర్ధారణ కేంద్రంగానీ, పరికరాలు గానీ లేవు. కనీసం హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర లోని జిల్లాలకు వచ్చే ప్రయాణికులను కనీసం స్క్రీనింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టకపోవడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యం పై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఏ మాత్రం బాధ్యత లేదని అర్థమవుతోంది. ఇదిలావుంటే, ఈ నెల 17న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అన్ని శైవక్షేత్రాలు జనంతో కిటకిటలాడతాయి. ముఖ్యంగా జిల్లాలోని కోటప్పకొండ, అమరావతికి భక్తులు లక్షల్లో వస్తారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కొచ్చెర్లను సందర్శించిన వైద్యుల బృందం ఈపూరు : కొచ్లెర్లలో వైద్యబృందం సోమవారం ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు నమోదు చేసుకున్నారు. గోరంట్ల నర్సమ్మకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించటంతో జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతోంది. గుంటూరు ప్రభుత్వ వైద్యులు ఆద్మాలిస్ట్ కె.ఎస్ భానూ ప్రకాష్ ఆధ్వర్యంతో బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు.