కోర్టు ప్రదక్షిణలతో సరి | CM KCR Review Meeting With Health Officials In Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

కోర్టు ప్రదక్షిణలతో సరి

Published Wed, Jul 22 2020 12:46 AM | Last Updated on Wed, Jul 22 2020 10:04 AM

CM KCR Review Meeting With Health Officials In Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటికి 87 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకిన వారికి వైద్యం అం దించే విషయంలో క్షణం తీరికలేకుండా పని చేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్‌ అధి కారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమ యం కేటాయించాల్సి వస్తోంది. ఈ క్లిష్ట సమ యంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టుకు తిరగ డం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం’ అని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనాపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ ముర్తజా రిజ్వీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, గంగాధర్‌ తదితరులతో సమీక్ష నిర్వహిం చారు. ‘సమీక్ష సందర్భంగా హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచా రణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా కట్టడి, పరీక్షలు–చికిత్స విష యంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సమా వేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు’ అని సీఎంవో ప్రకటనలో తెలిపింది. 

డ్యూటీ చేసేదెప్పుడు!
‘వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంతమందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధ కలిగిస్తున్నది. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్‌ దాఖలు చేశారు. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్‌ దాఖలు అవుతూనే ఉన్నాయి. హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉంది. ఏకంగా 87 పిల్స్‌పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరుకావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉంది. అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతున్నది. కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది అని సమావేశంలో పాల్గొన్న పలువురు ఆవేదక వ్యక్తం చేశారు’అని సీఎంఓ పేర్కొంది. 

పూర్తి వాస్తవాలను హైకోర్టుకు సమర్పించాలి: సీఎం కేసీఆర్‌ 
‘ఈ సమావేశంలో వ్యక్తమయిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ, అందిస్తున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ, చేస్తున్న పనిని తెలపాలని చెప్పారు’అని సీఎంఓ వెల్లడించింది.

హుందాగా, సౌకర్యంగా..
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయం కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్ష ణీయంగా, హుందాగా ఉండాలని, లోపల సకల సౌకర్యాలతో పనిచేసుకోవడానికి అను కూలంగా ఉండేలా తీర్చి దిద్దాలన్నారు. సచివాలయం కొత్త భవనం డిజైన్లను మంగళ వారం పరిశీలించిన కేసీఆర్‌ పలు మార్పులు సూచించారు. సీఎం, మంత్రులు, సీఎస్, కార్యదర్శులు, సలహాదారులు, సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యా లయాలు ఉండాలని, ప్రతి అంతస్తులో డైనింగ్‌ హాల్, సమావేశ మందిరం ఉండాలన్నారు. విఐపీలు, డెలిగేట్స్‌ కోసం వెయిటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో ఏం పని జరుగుతుంది? ఎందరు పనిచేస్తారు? ఎందరు సందర్శకు లుంటారు? వంటి విషయాలను పరిగణన లోకి తీసుకొని నిర్మాణం చేపట్టాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement