
సాక్షి, విజయవాడ: ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా రోగి మృతదేహాన్ని పట్టించుకోలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. జరిగిన వాస్తవాన్ని అధికారులు వెల్లడించారు. రాధాకృష్ణారెడ్డి అనే పేషెంట్ కోవిడ్ లక్షణాలతో మార్కాపురం కోవిడ్ ఆస్పత్రిలో చేరారని, అక్కడ శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడని అధికారులు తెలిపారు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించామని, అక్కడ వార్డుకు తరలించే సమయంలో మూడో ఫ్లోర్ నుంచి దూకేశాడని వివరించారు. వైద్యులు పరీక్షించగా రాధాకృష్ణారెడ్డి చనిపోయినట్లుగా తేలిందని.. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment