
అధికారాన్ని అడ్డంపెట్టుకుని రెండెకరాల నుంచి 2 లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలిపెట్టావు. ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకుని ఏపీ ప్రతిష్టనే దెబ్బతీసే కుట్రలు. ఎంత కృతజ్ఙత లేని వాడివి నీవు.. చంద్రం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ‘‘అధికారాన్ని అడ్డంపెట్టుకుని రెండెకరాల నుంచి 2 లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలిపెట్టావు. ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకుని ఏపీ ప్రతిష్టనే దెబ్బతీసే కుట్రలు. ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు.. చంద్రం’’అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్ తన బాధ్యతను చాటుకున్నారు..
రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.309 కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారని’’ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలతో పాటు 50 క్రయోజనిక్ ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక ప్రాణవాయవుకు కొరత ఉండదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలి పెట్టావు. ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకుని ఏపీ ప్రతిష్టనే దెబ్బతీసే కుట్రలు చేస్తున్నావు. ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు...చంద్రం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 10, 2021
చదవండి: రాష్ట్రానికి పెద్ద వైరస్ చంద్రబాబే
ధైర్యం చెప్పకుండా దుష్ప్రచారమా?