హామీలను తుంగలో తొక్కడమే చంద్రబాబు నైజం: విజయసాయిరెడ్డి | Vijay Sai Reddy Post On Chandrababu kamma Caste Posts In TTD | Sakshi
Sakshi News home page

ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే చంద్రబాబు నైజం: విజయసాయిరెడ్డి

Published Sat, Jul 27 2024 4:15 PM | Last Updated on Sat, Jul 27 2024 6:43 PM

Vijay Sai Reddy Post On Chandrababu kamma Caste Posts In TTD

ఏపీలో కూటమి పాలనలో ఒకే సామాజిక వర్గానికి చందిన వారికి అనేక పదవులు కేటాయించడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విమర్శలు గుప్పించిచారు. తిరుమల తిరుపతి దేశస్థానంలో అన్నీ కీలక పదవులను కమ్మ కులానికి చెందిన వారికే కట్టబెడుతోందని మండిపడ్డారు.

టీటీడీ అదనపు ఈవోతోపాటు ఇతర పదవుల్లో కమ్మలను టీడీపీ నియమించిందని తెలిపారు. ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్‌గా కూడా కమ్మ వ్యక్తిని, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా అదే సామాజాక వర్గానికి చెందినవ్వ్యక్తిని నియమించేందుకు కసరత్తులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇతర కులాల వారు కూడా ఈ పదవులకు అర్హులని ఎందుకు గుర్తించడం లేదనిని చంద్రబాబును ప్రశ్నించారు.  

అదే విధంగా చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణిని విజయసాయిరెడ్డి మరోసారి ఎండగట్టారు. బాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ అధికారంలోకి రాగానే మాయమవుతాయని సెటైర్లు వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతారని.. అదే అధికార పగ్గాలు చేతిలో ఉన్నసమయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని విమర్శించారు. 

 ఇచ్చిన హామీలను తూట్లు పొడవడమే చంద్రబాబు నైజం అని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం, అభివృద్దిపై కాకుండా తన మీద, తన కుటుంబం, కులం, డబ్బు మీద దృషి మారుతోందని అన్నారు. ఇంకా బాబులో  చిత్తశుద్ది ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement