న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోటి రూపాయలు అంటే ‘టన్ను స్టీల్ ’ అనే పదం సృష్టికర్త చంద్రబాబేనని దుయ్యబట్టారు. వాడుకలో ఉన్న కొత్తపదాలను గుర్తించి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఏటా నిఘంటువులో చేరుస్తుందని, కోటి రూపాయలంటే ఒక 'టన్ను స్టీల్' అనే పదజాలాన్ని కూడా చేర్చాలని ఉత్సాహవంతులైన యువతీ, యువకులు ఆక్స్‌ఫర్డ్‌కు మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారని సెటైర్లు వేశారు.
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఈ పదం చేరితే అది చంద్రబాబు క్రెడిటేనని అన్నారు. కొత్త టెక్నాలజే కాదు, కొత్త పదాలు కూడా సృష్టించడంలో చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంలో కోటి రూపాయలను టన్ను స్టీలుగా దళారీ ఎంవీపీ మెయిల్‌లో పేర్కొన్నారు.
చదవండి: టీడీపీ నేతల అత్యుత్సాహం.. అంబులెన్స్ వచ్చినా దారివ్వని చంద్రబాబు
వాడుకలో ఉన్న కొత్తపదాలను గుర్తించి Oxford డిక్షనరీ ఏటా నిఘంటువులో చేరుస్తుంది. కోటి రూపాయలంటే ఒక 'టన్ను స్టీల్' అనే పదజాలాన్ని కూడా చేర్చాలని ఉత్సాహవంతులైన యువతీ, యువకులు Oxfordకు మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారట. ఆ క్రెడిట్ కూడా బాబు గారికే దక్కుతుంది. కొత్త టెక్నాలజీనే కాదు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 6, 2023
'స్టీల్ టన్నుల' పేరుతో షాపూర్జీ నుంచి నేరుగా 18.93 కోట్లు, బోగస్ కంపెనీలు హయగ్రీవకు 11.12, శకలక, అన్నైకి 33.76, ఎవరెట్, నయోలిన్ లకు 50.43, పౌర్ ట్రేడింగ్ 9.42, ఫొనిక్స్ కు 18.14, లక్ స్టోన్ కు 1.23, దుబాయిలో దినార్ల రూపంలో అందినవి 15.13 కోట్లు. ఈ వివరాలు ఫేక్ అని చెప్పే దమ్ముందా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 6, 2023
Comments
Please login to add a commentAdd a comment