kamma
-
హామీలను తుంగలో తొక్కడమే చంద్రబాబు నైజం: విజయసాయిరెడ్డి
ఏపీలో కూటమి పాలనలో ఒకే సామాజిక వర్గానికి చందిన వారికి అనేక పదవులు కేటాయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విమర్శలు గుప్పించిచారు. తిరుమల తిరుపతి దేశస్థానంలో అన్నీ కీలక పదవులను కమ్మ కులానికి చెందిన వారికే కట్టబెడుతోందని మండిపడ్డారు.TDP has appointed Kammas in all key positions including additional E.O of TTD. Now, they are looking to appoint a Kamma as the Chairman of TTD Board and another person from the same community as the Special Representatiive AP in Delhi. @ncbn, do you not believe that people from…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024టీటీడీ అదనపు ఈవోతోపాటు ఇతర పదవుల్లో కమ్మలను టీడీపీ నియమించిందని తెలిపారు. ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్‌గా కూడా కమ్మ వ్యక్తిని, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా అదే సామాజాక వర్గానికి చెందినవ్వ్యక్తిని నియమించేందుకు కసరత్తులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇతర కులాల వారు కూడా ఈ పదవులకు అర్హులని ఎందుకు గుర్తించడం లేదనిని చంద్రబాబును ప్రశ్నించారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణిని విజయసాయిరెడ్డి మరోసారి ఎండగట్టారు. బాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ అధికారంలోకి రాగానే మాయమవుతాయని సెటైర్లు వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతారని.. అదే అధికార పగ్గాలు చేతిలో ఉన్నసమయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని విమర్శించారు. .@ncbn's promises vanish once in power. He says one version while in opposition but does the opposite when he has the reins. Promises are broken, and the focus shifts to himself, his family, his caste and money. Where's the integrity? 2/2 #DoubleStandards #BrokenPromises— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024 ఇచ్చిన హామీలను తూట్లు పొడవడమే చంద్రబాబు నైజం అని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం, అభివృద్దిపై కాకుండా తన మీద, తన కుటుంబం, కులం, డబ్బు మీద దృషి మారుతోందని అన్నారు. ఇంకా బాబులో చిత్తశుద్ది ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. -
కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుంది. అలాగే భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి పది మందిని బతికించే కులం కమ్మ. కమ్మ వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు కష్టపడనవసరం లేదు. సారవంతమైన భూమి, సాగునీరు ఎక్కడ ఉంటే అక్కడ కమ్మ సోదరులు ఉంటారు.. కష్టపడాలనే మనస్తత్వం కమ్మ వాళ్లది.సమాజ శ్రేయస్సు కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు చేసే కృషికి ప్రభుత్వం తగిన సహకారాన్ని అందిస్తుంది. పది మందికి సాయం చేయాలనే ఆలోచన ఉన్న కమ్మ సోదరులు తమ డీఎన్ఏను వదులుకోకుండా ముందుకు సాగాలి..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే కమ్మ గ్లోబల్ సమిట్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ ‘కమ్మ సామాజిక వర్గం వారితో నాకున్న సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. నన్నెంతో అభిమానంతో చూసుకుంటుంది. నేను అనర్గళంగా మాట్లాడడానికి, తక్షణమే స్పందించడానికి ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్న చదువు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్ రాజకీయాల్లో, నాయకత్వంలో ఒక బ్రాండ్ (ఎన్టీఆర్ ఈజ్ ఏ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్, బ్రాండ్ ఫర్ లీడర్షిప్). 1982 కన్నా ముందు కమ్మ ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నా, ఎన్టీఆర్ ఇచి్చన అవకాశాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో నాయకులుగా ఎదిగారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశానికి మార్గదర్శకం..’రేవంత్ అని అన్నారు. గ్లోబల్ సిటీగా మార్చడానికి కృషి చేయాలి ‘కమ్మ సామాజిక వర్గం వాళ్లు అన్ని రంగాల్లో ఎదిగారు. ఎన్టీఆర్, ఎన్జీ రంగా, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు వంటి వాళ్లు కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సత్య నాదెళ్ల మొదలు ఎందరో ప్రపంచస్థాయి సీఈవోలుగా రాణిస్తున్నారు. కమ్మ సోదరులకు అవకాశాలు కలి్పంచడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. సొంత కులం పట్ల అభిమానం ఉంది. అదే సమయంలో ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణలో కుల వివక్ష ఉండదు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడానికి దేశ, విదేశాల్లో ఉన్న కమ్మ సోదరులు కృషి చేయాలి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. అందుకోసం కృషి చేయాలి..’సీఎం కోరారు. ఢిల్లీలో తెలుగువాళ్ల నాయకత్వ కొరత‘ఢిల్లీలో తెలుగువాళ్ల రాజకీయ నాయకత్వం కొరత ఉంది. జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ వంటి వాళ్లు ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. కులానికి, ప్రాంతానికి అతీతంగా తెలుగువారు ఢిల్లీలో రాణించేలా ముందుకు రావాలి. కమ్మ సంఘానికి గత ప్రభుత్వం ఇచి్చన ఐదెకరాల స్థలానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించి, భవన నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.కాగా తమది దార్శనికతతో కూడిన సామాజిక వర్గమని కేజీఎఫ్ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ అన్నారు. కమ్మ వారి దాతృత్వానికి నాగార్జున సాగర్ ఉదాహరణ అని, ముత్యాలరాజా 57 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తమిళనాడు ఎంపీ కళానిధి వీరాస్వామి, కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, సత్యవాణి ప్రసంగించారు.రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు వసంత నాగేశ్వర్రావు, వడ్డే శోభనాద్రీశ్వర్ రావు, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
మరీ ఇంత పిచ్చిగానా?.. ప్రజలు గమనిస్తున్నారు బాబూ..
అవినీతి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికే కేవలం కమ్మ కుల నాయకుడిగా మార్చి మరీ పిచ్చిగా, ఆ కులానికి చెందిన కొందరు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రపంచం అంతా చంద్రబాబు అరెస్టుపైనే ఆందోళనతో ఉన్నట్లు చిత్రించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని టీడీపీ మీడియా సంస్థలు చేస్తున్న యత్నాలు కూడా ఇదంతా కమ్మ కులం అతి అన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నాయి. చంద్రబాబు జైలులో ఉంటే కృతజ్ఞతా సభల పేరుతో అవి అభినందన సభలో, సానుభూతి సభలో, సంతాప సభలో అర్థం కాని రీతిలో సంగీత విభావవరిలు నిర్వహిస్తున్నారు. అది కూడా పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్‌లో.. ✍️మరో వైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో కొందరు దాడి చేసి నోటికి వచ్చినట్లు దూషించడం దారుణం. ఇంత కాలం ఆ కులం వారికి కాస్త సభ్యత, సంస్కారం ఉంటాయిలే అనుకున్నవారందరికి, ఇదేమిటి! ఈ కమ్మోళ్లు ఇంత నీచంగా మారారు అన్న అభిప్రాయం తెప్పిస్తున్నారు. ఒకవేళ రాంబాబుకు ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేది. అది మళ్లీ రెండు కులాల మధ్య రగడగా మారేది కాదా!. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతం అంతా ఎలా అట్టుడికిందో తెలిసి కూడా కొంతమంది ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం దురదృష్టం. ✍️అంబటి రాంబాబు తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఇప్పటికే ఆరోపించారు. ఆయననే కాదు. కొడాలి నాని వంటి నేతలను చంపితే ఏభై లక్షలు ఇస్తామని కమ్మ సంఘం సమావేశంలో ఒక వ్యక్తి అంటే అది ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. దాని వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే ప్రమాదం ఏమీ లేదు. కాని కమ్మ కులంలో పుట్టినవారందరిని ఇతరులు అసహ్యించుకునే పరిస్థితి తెస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం! ఏ కులాన్ని ఉద్దరించడం కోసం! ఎవరో కొందరు తెలివి తక్కువవాళ్లు చేసే చెత్త పనులకు ఆ కులంలో ఉన్నవాళ్లంతా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మిగతా సమాజానికి దూరం అయ్యేలా చేస్తున్నారు. ✍️నిజానికి ఎవరూ చెప్పి ఫలానా కులంలో పుట్టరు. కాని మన సమాజంలో కుల వ్యవస్థ అన్నది ఒక వాస్తవంగా తయారైంది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు ఈ కుల వ్యవస్థపై పోరాటాలు జరిపారు. మురళీమోహన్ వంటి సినీ ప్రముఖులకు చంద్రబాబు అంటే అభిమానం ఉండవచ్చు. ఆయన వల్ల రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ది పొంది ఉండవచ్చు. అంత మాత్రాన చంద్రబాబు అరెస్టుతో ప్రపంచం అంతా మునిగిపోయినట్లు, కమ్మ వారందరికి ఏదో అయిపోయినట్లు, అసలు చంద్రబాబు అవినీతికే పాల్పడనట్లు మాట్లాడుతున్న తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. బహుశా మరే కులంలో ఇంత పిచ్చి ఉండదని జనం అనుకునేలా చేస్తున్నారు. ✍️నిజంగానే అవినీతి లేకపోతే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ 118 కోట్లకు నోటీసు ఎందుకు ఇచ్చింది. రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని సీబీటీడీ గతంలో ఎందుకు ప్రకటన చేసింది? చంద్రబాబు మాజీ పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయాడు? వీటికి వీరెవ్వరూ జవాబు ఇవ్వడం లేదు. చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ లేదనేంత స్థాయికి ఈ వర్గం ప్రచారం చేయడం హాస్యాస్పదం. ఆ మాటకు వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బారేజీ, పోచంపాడు, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన గొప్పవాళ్లందరిని ఏమి అనుకోవాలి. హైదరాబాద్ లో కొందరు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు, పాటల కార్యక్రమాలు అన్ని అదేదో ఐటి నిపుణులనో, వేరే ఫ్రొఫెషనల్స్ చేస్తున్నారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు. వాటిలో పాల్గొంటున్నవారిలో తొంభై శాతం మంది కమ్మవారే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ✍️ఆ మధ్య వీరి పైత్యం ఎక్కడివరకు వెళ్లిందంటే మెట్రో రైలులో ఎక్కి నిరసనలు తెలిపేవరకు. అక్కడ ఒకాయన ఇదేమి పని అడగవలసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో అలాంటి ఆందోళనలు చేయదలిస్తే ఆ పార్టీ పేరుతోనే చేయాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కుహానా మీడియాలను అడ్డం పెట్టుకుని వేరుపేర్లతో ఎందుకు చేయడం. లేదంటే ధైర్యం ఉంటే కమ్మ సంఘం పేరుతో నిరసనలు చేపట్టగలగాలి. ఈ మధ్య కొన్ని చోట్ల కమ్మ సంఘం సమావేశాలు జరిపి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఇంతవరకు క్లారిటీ ఉన్నట్లు లెక్క. అలాకాకుండా తెలుగుదేశం పార్టీవారే నిరసనలు చెబుతూ, ఏవేవో పేర్లు తగిలించడం వల్ల ఈనాడు వంటి మీడియాలలో ప్రచారానికి ఉపయోగపడుతుందే తప్ప ఇంకో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. ✍️సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చేస్తుంటాయి. ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు కులాలకు అతీతంగా ఉండాలని, అవినీతి ఎక్కడ జరిగినా ఉపేక్షించరాదని నీతులు చెబుతుండేవారు. చివరికి ఆయనే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా మారారన్న అభియోగాలకు గురికావడం, అవినీతిని పూర్థిస్థాయిలో సమర్ధించడం చూస్తుంటే ఇంతకాలం ఈయన జనాన్నిమోసం చేశారా అన్న భావన ఏర్పడదా! చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే కమ్మవారు ఇంతగా కలత చెందవలసిన అవసరం ఏమి ఉంటుంది? ఆయనతోటే కమ్మకులం లేదు. లేదా ఆయన కమ్మవారిపైనే ఆధారపడి ఉండరు. ✍️నిజానికి చంద్రబాబు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కుమ్మక్కై ఏపీకి పరిశ్రమలే రాకుండా ఎంత నష్టం చేశారో వీరికి తెలియదా! కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత దానిని వదిలివేయడం,ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం అర్రులు చాచడం, మరో వైపు కాంగ్రెస్ కు తెలంగాణలో మేలు చేయడం కోసం కమ్మవారిలో ఎక్కువ మంది ఓట్లు కాంగ్రెస్ కు వేసేలా ప్లాన్ చేయడం.. ఇవన్ని సమాజానికి మంచిదా! తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీచేయడం లేదో ప్రజలు ఊహించలేరా? ఇతర రాజకీయ పార్టీలు గమనించలేవా?ఇలాంటి అనైతిక రాజకీయాలు చేస్తూ దానికి కులం రంగు పులిమి ఆ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయం ఎవరికి ఉపయోగం?. చంద్రబాబుకు హైదరాబాద్‌లో అంత ప్రజాభిమానం ఉందనుకుంటే టీడీపీ ఇప్పుడు ఎందుకు అక్కడ పోటీచేయడం లేదు. ✍️అసలు 2004లోనే ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంగా ఉన్న చోట టీడీపీ ఘోరంగా ఓడిపోయిందే. కులం పునాదితో ఏ పార్టీ మనలేదన్న సంగతి వీరు గుర్తించాలి. ఏపీ ప్రజలను హైదరాబాద్ నుంచి ప్రభావితం చేయడానికో, న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచడానికో సభలు పెడితే వాటిని నమ్మడానికి అమాయకపు కాలం కాదు. గ్రాఫిక్స్ కాలం అంతకన్నా కాదు. చంద్రబాబు కేసులో నిరసనలు చెప్పడమే తప్పు. నిజంగా అక్రమ కేసులు అయితే సీఐడీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కోర్టులలో తమ వాదనలు వినిపించాలి. అవన్ని వదలివేసి ప్రజలలో అలజడి సృష్టించాలని చూడడం, అదేదో ఒక కులానికి వ్యతిరేకం అన్న కలరింగ్ ఇవ్వడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. పార్టీ పరంగా ఏమైనా చేసుకోండి. కులానికి మాత్రం ఈ బురద పులమకుండా ఉంటే మంచిదని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
TS Elections 2023: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?
రాజకీయాల్లో కుల సమీకరణాల పాత్ర చాలా కీలకం. ఓటు బ్యాంకును నిర్ణయించేది, ఎన్నికల్లో గెలిపించేది కులమే అని నమ్ముతారు. తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు కమ్మ సామాజిక వర్గం విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలపై చర్చకు దారి తీసింది. మొన్నటి బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో వెలమ అభ్యర్థులకు 11 టికెట్లు దక్కగా, కమ్మ సామాజిక వర్గానికి 5 టికెట్లు దక్కాయి. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న తాము, చాలా ప్రాంతాలతో పాటు ఇతర వర్గాలపైనా ప్రభావం చూపిస్తామని నమ్ముతున్న కమ్మలు తమకు 5 సీట్లు సరిపోవన్న అసంతృప్తిలో ఉన్నారు మాకు మీరు.. మీకు మేం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్, ఖమ్మంలో ఈ సామాజిక వర్గంకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు వీరు ప్రభావితం చేసే ఓట్లను గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేవి. ఇటీవల సీఎం కెసిఆర్ ప్రకటించిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న కమ్మలు జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్ శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ సిర్పూర్ - కోనేరు కోనప్ప ఖమ్మం - పువ్వాడ అజయ్‌కుమార్ మిర్యాలగూడ - నల్లమోతు భాస్కరరావు (రేవంత్, మాణిక్కం ఠాగూర్ ను కలిసిన తర్వాత గాంధీభవన్ ముందు కమ్మ నేతలు) తుమ్మల, జలగం ఇద్దరికీ షాక్ ఇప్పుడు ఆ సమీకరణాల్లో తేడా కొట్టిందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్‌లకే టికెట్లు వచ్చాయి. పైగా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమైన కమ్మ నేతలకు టికెట్ ఈ సారి దక్కలేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురి కాగా.. పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఇవ్వాళ తుమ్మల కన్నీళ్లు పెడుతూ హైదరాబాద్ నుంచి వెళ్లే దృశ్యాలు ఈ సామాజిక వర్గంలో చర్చనీయాంశమయ్యాయి. (టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్న తుమ్మల) కమ్మ @ కిం కర్తవ్యం ఈ పరిణామాలు కమ్మ వర్గంలో కొంత అసంతృప్తి నింపాయి. ఈ మేరకు తెలంగాణ కమ్మ వర్గం ముఖ్యనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి .. అర్జంట్‌గా రెండు లేఖలు తయారు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రకటించబోయే జాబితాలో కమ్మలకు పది ఎమ్మెల్యే టికెట్లు, దీంతో పాటు వచ్చే ఏడాది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు అందించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను మాత్రం కలవలేదు. (బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కలిసి టికెట్లు ఇవ్వాలని కోరిన కమ్మ నేతలు) చాలా స్ట్రాంగ్ తెలంగాణలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా మాత్రం వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు కులాలకు హైదరాబాద్‌లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి మిగిలింది. ఓ రకంగా బీఆర్ఎస్ను రెచ్చగొట్టడానికే కమ్మ నాయకులు కాంగ్రెస్, బీజేపీలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. -
కమ్మలకు ప్రాధాన్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యమివ్వాలని కమ్మ రాజకీయ ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం గాందీభవన్‌లో కమ్మ ఐక్య వేదిక ప్రతినిధులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను కలసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ లోని కమ్మ నేతలకు తగిన అవకాశాలు కల్పించాలని అందులో కోరారు. పరిశీలకుల భేటీ.. ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ పరిశీలకుల సమావేశం ఠాక్రే అధ్యక్షతన గాందీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పరిశీలకులు దీపాదాస్మున్షీ, జ్యోతిమణి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ స్థానాల వారీగా తమ పర్యటనల సందర్భంగా దృష్టికి వచ్చిన అంశాలను, ఆయా స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఈ సందర్భంగా పరిశీలకులు ఠాక్రేకు వివరించారు. ఈ మేరకు పార్లమెంటు స్థానాల వారీగా ప్రత్యేక నివేదికను తయారుచేసి అధిష్టానానికి పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీలకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్.. నువ్వు నాన్‌లోకల్. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వికటించిన చంద్రబాబు ప్రయోగం... టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజకవర్గంలోని కాపులను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయితే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్మెంట్లు చేసినవారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది. ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహరించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. -
పవన్ పై రెక్కీ నిర్వహించింది చంద్రబాబు కు చెందిన వ్యక్తులే : ఏపీ రెడ్డి, కమ్మ ,కాపు కార్పొరేషన్ చైర్మన్లు
-
టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాక్
– కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయించకపోవడంపై అగ్రహం – ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆవేదన – మాజీ ఎమ్మెల్సీ భాస్కర రామారావు ఆధ్వర్యంలో సమావేశం – పెద్దపీట వేసిన వైఎస్సార్ సీపీకి ఓటేద్దామని నిర్ణయం సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాకిచ్చింది. 10వేలకు పైగా ఓటర్లున్న తమ సామాజిక వర్గానికి టీడీపీ, బీజేపీ మొండిచేయి చూపాయని కమ్మ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. ఒక్క డివిజన్ కూడా కేటాయించకుండా తమను పూర్తిగా విస్మరించారని కమ్మ సామాజిక వర్గమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ సీపీ తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందని, ఆ పార్టీకే మద్దతు తెలపాలని దాదాపు నిర్ణయించుకున్నారు. కమ్మ సామాజికి వర్గానికి పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ ఇవ్వలేదు. వారికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. వేలాది ఓట్లు ఉన్న తమపై ఎందుకంత చిన్న చూపని ఆ సామాజిక వర్గ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలోని ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఈటూ రెస్టారెంట్లో కమ్మ సామాజిక వర్గ నాయకులంతా సమావేశమయ్యారు. తమకు టిక్కెట్ ఇవ్వకపోగా ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి ప్రవర్తన సరిగా లేదని, తమపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో ప్రభావం చూపే ఓట్లు ఉన్న తమను చిన్న చూపు చూడటం సరికాదని, ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ అనుసరించిన తీరుకు నిరసనగా ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు బుధవారం మరోసారి నాగమల్లి తోట జంక్షన్ వద్ద సమావేశమవ్వాలని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుణ్ణం చంద్రమౌళి, బోళ కృష్ణమోహన్, గోళ్లమూడి అజయ్‌కుమార్, రావిపాటి రామరాయచౌదరి, గారపాటి రాయుడు పాల్గొన్నారు. -
'నా వంగవీటి రాధ ఇతనే'
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ఇదివరకే తెలిపారు. అయితే ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను వెల్లడించారు. 'వంగవీటి రాధ చాలా తక్కువ సార్లు తన అంతరంగికుల మధ్య సిగరెట్ కాల్చే వాడు' అంటూ సిగరేట్ కాల్చే ఫోటోను.. 'వంగవీటి రాధకి కాఫీ అంటే చాలా ఇష్టమని వంగవీటి రంగగారు నాతో చెప్పారు'.. అని కాఫీ తాగుతున్న ఫోటోను.. కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివున్న వాళ్లే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారని మరో ఫోటోను ట్విట్ చేశారు. Kammavaalla manasthatanni ardham chesukune thelivunnavalle arhatha vunna nijamaina kaapulani chepparu pic.twitter.com/FZ8apGoXY7 — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016 Vangaveeti Radhagaariki coffee ante chaala ishtamani Vangaveeti Ranga gaaru naatho chepoaru pic.twitter.com/EZD6Uqv28D — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016