ఏపీ: రూ.6,400 కోట్ల వ్యయంతో రోడ్లు అభివృద్ధి | Rs 6400 Crore For Roads Development In AP | Sakshi
Sakshi News home page

ఏపీ: రూ.6,400 కోట్ల వ్యయంతో రోడ్లు అభివృద్ధి

Jul 26 2021 6:52 PM | Updated on Jul 26 2021 7:21 PM

Rs 6400 Crore For Roads Development In AP - Sakshi

రూ.6,400 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు.

సాక్షి, విజయవాడ: రూ.6,400 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండేళ్లలో పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాంట్రాక్టర్లకు నమ్మకం ఉండేలా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని పేర్కొన్నారు. మూడు బ్యాంకులు లోన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

మరమ్మత్తులు చేసిన బిల్లులు దాదాపు చెల్లించడం జరిగిందన్నారు. గత ఏడాది రూ.600 కోట్లు బిల్లులు చెల్లించామన్నారు. వారం, పది రోజుల్లో బీఆర్ఓ తాలూక సొమ్ము విడుదలవుతుందన్నారు. నెలవారీగా బిల్లులు ఇవ్వడానికి సీఎం ఆదేశించారన్నారు. ఈ ఏడాది రోడ్ల మరమ్మత్తులకు రూ. 410 కోట్లు బడ్జెట్‌లో ఏర్పాటు చేశారని కృష్ణబాబు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement