
అమరావతి: మహారాష్ట్రలో ఎక్కువగా జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా ఇక్కడ కూడా ఆందోళన బాగా ఎక్కువగా ఉందన్నారు ఏపీ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. పుణే మున్సిపల్ కార్పొరేషన్లో నీటి సరఫరా సరిగ్గా లేని కారణంగా డయేరియా మొదలై జీబీఎస్ సోకిందన్నారు.దీంతో జీబీఎస్ పై భయం పెరిగిందన్నారు. అన్ని ఏరియాల నుంచి జీబీఎస్ వస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒకే చోట ఎక్కువ కేసులు నమోదు కాలేదని, న్యూరో ఫిజిషయన్లు ఎక్కువగా ఉన్న చోట ట్రీట్ మెంట్ బాగా జరుగుతుందన్నారు.
‘వెంటిలేటర్లు ఇతర ఐసీయూ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నాం.ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికైనా జీబీఎస్ వచ్చే అవకాశం ఉంది.. సాధారణ జాగ్రత్తలు అంటే చేతులు కడుక్కోవడం.. శుభ్రంగా ఉండడం. పాటించాలి. కాళ్ళు తిమ్మిర్లు..చచ్చు బడినట్టు ఉండడం....లక్షణాలు. తినలేకపోవడం..మింగ లేకపోవడం.. శ్వాస అడకపోవడం. కూడా వ్యాధి లక్షణాలు. ప్రజలు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.జీబీఎస్ వచ్చిన 85 శాతం కేసులు ఒక్క రోజులోనే. సెట్ అవుతాయి..వెంటిలేషన్ అవసరం అయితే రికవరీ కష్టం అవుతుంది. మొదట చనిపోయిన చిన్న పిల్లవాడి కేస్ లో ఆసుపత్రి మార్చారు...మొదట శ్రీకాకుళం. తర్వాత విశాఖ కేజీహెచ్. దీంతో ఇబ్బంది వచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవలో చికిత్స అందుబాటులో ఉంది’ అని కృష్ణబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment