సాక్షి, అమరావతి : జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చేవారికి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు.. ఎప్పటికప్పుడు వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలని ఆదేశించింది. ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో వారి వద్దకు వస్తే సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు సమాచారమివ్వాలని ఆర్ఎంపీలకు సూచించింది. వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాకూ కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయన్నుట్లు, ప్రస్తుతం అందుబాటులో 4 రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది. (వారందరికీ నా ధన్యవాదాలు: ఆమిర్ ఖాన్)
Comments
Please login to add a commentAdd a comment