హైదరాబాద్ నుంచి వస్తున్న వారి పాస్‌లు పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్)
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా అన్‌లాక్ 3.0 ప్రారంభమైంది. దీంతో ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిబంధనలు సడలించారు. అన్‌లాక్ 3.0 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆంక్షలు సడలించారు. ఈ సందర్భంగా కోవిడ్–19 టాస్క్‌ఫోర్సు కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే ‘స్పందన’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన ఇంకా ఏం తెలిపారంటే..
► దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా ఈ–పాస్ మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుంది.
► అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ–పాస్‌తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తారు.
► ఈ–పాస్ వివరాల్ని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు.
► ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే. ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలకు పంపుతారు.
► ఆరోగ్య కార్యకర్తలు ఏపీకి వచ్చే వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. నేటి (ఆదివారం) నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది.
► సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఈ–పాస్ చూపించకపోతే పోలీసులు వెనక్కు తిప్పి పంపుతారు.
► ఈ–పాస్ దరఖాస్తు www.spandana.ap. gov.in వెబ్‌సైట్‌లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment