సాక్షి, అమరావతి: పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరో 46,198 పడకలు సిద్ధం చేసినట్టు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పశ్చిమ, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో అదనపు బెడ్లను ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో మీడియా సమావేశంలో కృష్ణబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే..
► ఇతర దేశాల నుంచి వచ్చే వారికి వారం రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి.
► కోవిడ్ జిల్లా, రాష్ట్ర ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్లలో అందుతున్న సదుపాయాలపై ఫీడ్ బ్యాక్ కోసండెడికేటెడ్ కాల్ సెంటర్ 1902 నంబర్‌తో ఏర్పాటు చేశాం. ఇది 24 గంటలూ పని చేస్తుంది.
► మెడికల్, నాన్ మెడికల్ సదుపాయాల గురించి ఫిర్యాదు చేయవచ్చు.
► కోవిడ్ సెంటర్లలో పెట్టే భోజనం, శానిటేషన్, మందులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి 9 అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం.
► కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రాజమౌళిని నియమించింది. ఆయనతో పాటు కంట్రోల్ రూం నోడల్ అధికారిగా నేను, అర్జా శ్రీకాంత్, ప్రకృతి వైపరీత్యాల కమిషనర్ కన్నబాబు కలిసి పని చేస్తాం.
► పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకొనేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ పెట్టాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
► మెరుగైన సదుపాయాల కల్పన దిశగా అదనంగా మరో 17 వేల మంది వైద్య సిబ్బందిని సిద్ధం చేశాం.
► ఐఎంఏ సూచించిన వారికి రూ.1.50 లక్షల గౌరవ వేతనం ఇచ్చి అందుబాటులో ఉంచుతున్నాం. స్టాఫ్ నర్సులు కూడా అందుబాటులో ఉన్నారు.
► కోవిడ్ వల్ల చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ.15 వేలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
మరో 46,198 బెడ్లు సిద్ధం
Published Sat, Jul 18 2020 4:55 AM | Last Updated on Sat, Jul 18 2020 4:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment