సాక్షి, విజయవాడ: ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్లైట్ టికెట్లు తీసుకోలేని విద్యార్థులకు ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చేరుకునే విద్యార్థులకు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాట్లు చేయాలని సీంఎ జగన్ అధికారులను ఆదేశించారు. అందుకు తగినట్లు ఏపీ భవన్ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులను ప్రభుత్వం సంప్రదిస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా జయశంకర్ సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ఉక్రెయిన్ పక్కనున్న దేశాలకు వారిని తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ముప్పు లేకుండా వారిని భద్రంగా తీసుకురావాలని సీఎం జగన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
చదవండి: (ఎయిర్‌పోర్ట్‌ల వృద్ధి కోసం కేంద్రానికి సీఎం జగన్ లేఖలు)
Comments
Please login to add a commentAdd a comment