సాక్షి, విజయవాడ: గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్‌ను స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మైల్డ్ సింటమ్స్ ఉన్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్నామన్నారు.
5 శాతం మందికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 15 వేల మంది ఆస్పత్రుల్లో, 5 వేల మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఫుడ్, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని కృష్ణబాబు తెలిపారు.
చదవండి: ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్
కొడుకు ప్రాణం పోయింది.. తండ్రి గుండె ఆగింది..
Comments
Please login to add a commentAdd a comment