
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి చుక్కెదురైంది. తన పైన సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది.
ప్రభుత్వ స్థలం ఆక్రమణ కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. 41ఏ నోటీసు ఇవ్వాలని సంబంధిత విచారణ సంస్థకు సూచించింది. అంతేకాదు.. అయ్యన్నపాత్రుడిని, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ విచారించుకోవచ్చని తెలుపుతూ.. విచారణకు అయ్యన్నపాత్రుడు సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment