Minister Karumuri Nageswara Rao Fires On Chandrababu - Sakshi
Sakshi News home page

అయ్యన్న పాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా?: మంత్రి కారుమూరి

Published Sun, Jun 19 2022 12:25 PM | Last Updated on Sun, Jun 19 2022 3:49 PM

Minister Karumuri Nageswara Rao Fires on Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌ అ‍డ్రస్‌ చంద్రబాబు. ఆయన బాటలోనే పార్టీ నేతలు నడుస్తున్నారు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి?. బీసీ నేతలు తప్పు చేస్తే వదిలేయాలా?. అయ్యన్నపాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశాం. బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడు. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిది. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారు. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోంది. కానీ చంద్రబాబు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశారని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. 

చదవండి: (అయ్యన్న బాగోతం.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఏమన్నారంటే?)
 
ఆ పిచ్చి మాటలకు జనం నవ్వుతున్నారు

'చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదంట. ప్రపంచమంతా కూడా రాకుండా ఆపేవారేమో?. తుపానులు ఆపుతానంటాడు. ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు. ఇలాంటి పిచ్చిమాటలు విని జనం నవ్వుతున్నారు. విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారు. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారు. అయ్యన్నపాత్రుడు ఓ తాగుబోతు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలి. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారు. జగన్‌పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదు. ఇక ఇంటికొకరు ఏం వస్తారు?. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్‌ని విమర్శిస్తున్నారంటూ' మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబుపై మండిపడ్డారు. 

చదవండి: (Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement