
సాక్షి, అనకాపల్లి: స్థాయి మరిచి నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ప్రజలే నీ నాలుక చీరేస్తారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఘాటుగా హెచ్చరించారు. చోడవరం వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొన్న మంత్రి అమర్‌నాథ్ ఇటీవల టీడీపీ మినీమహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుల మాట తీరుపై తీవ్రంగా స్పందించారు.
ఒక ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు ఏక వచనంతో తన బ్యాండ్ బాజా అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా తిడుతుంటే పక్కనే ఉన్న 14ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు వారించకపోవడం సిగ్గుచేటన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అమర్‌నాథ్ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment