సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయల నడుమ చిచ్చు ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ లుకలుకలు బయటపడ్డాయి.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారు. ఈ క్రమంలోనే అలిగిన అయ్యన్న.. చంద్రబాబు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న బీసీ కార్యక్రమానికి సైతం అయ్యన్న డుమ్మా కొట్టారు.
అలాగే తన తనయుడు విజయ్‌కి ఎంపీ టికెట్.. తమ ఎమ్మెల్యే టికెట్‌పైనా స్పష్టత ఇవ్వాలని అయ్యన్న అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటాకు ఉన్నపళంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంపైనా అయ్యన్న వర్గీయులు టీడీపీని నిలదీస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పాయకరావుపేట టీడీపీలోనూ వర్గ విభేదాలు బయటపడ్డాయి. వంగలపూడి అనితకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం సమావేశం అయినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో ఇద్దరు నేతలపై వేటు పడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment