'అవంతి' గెటవుట్... అయ్యన్నపాత్రుడు | Chintakayala Ayyanna patrudu takes on Avanthi Srinivasa rao | Sakshi
Sakshi News home page

'అవంతి' గెటవుట్... అయ్యన్నపాత్రుడు

Published Tue, Apr 15 2014 10:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

'అవంతి' గెటవుట్... అయ్యన్నపాత్రుడు - Sakshi

'అవంతి' గెటవుట్... అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం జిల్లా టీడీపీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి.

విశాఖపట్నం జిల్లా టీడీపీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న భీమిలీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)కి మంగళవారం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట తీవ్ర అవమానం జరిగింది. నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ రోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ క్రమంలో ఈ రోజు ఉదయం అయ్యన్నపాత్రుడు ఇంటికి అవంతి శ్రీనివాస్ తన అనుచరగణంతో వచ్చారు. తన నివాసానికి వచ్చిన అవంతి, ఆయన అనుచర గణాన్ని చూసి చింతకాయల అయ్యన్నపాత్రుడు అగ్గిమీద గుగ్గిలమైయ్యారు. నువ్వేందుకు ఇక్కడికి వచ్చావంటూ అవంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గెటవుట్ అంటూ అవంతిపై అయ్యన్నపాత్రుడు శివాలెత్తారు. ఉహించని ఆ పరిణామానికి అవంతి శ్రీనివాస్ ఖిన్నడయ్యారు. అవమానంగా భావించిన అవంతి శ్రీనివాస్ అక్కడి నుంచి తన అనుచర గణంతో కలసి వెళ్లిపోయారు.

విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు వర్గం, అవంతి వర్గం అంటేనే అయ్యన్నపాత్రుడు మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే వారిని టీడీపీలో చేర్చుకోవద్దంటూ  ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెవ్విలో ఇల్లుకట్టుకుని అయ్యన్నపాత్రుడు మరీ పోరారు. అయితే ఆ రెండు వర్గాలను పార్టీలో చేర్చుకోవడంతో అయ్యన్నపాత్రుడు ఇప్పటికి  చంద్రబాబుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అదికాక పార్టీ పుట్టినప్పటి నుంచి సేవలు చేస్తున్న తమను కాదని ....... ఇటీవల పార్టీలోకి వచ్చిన ఆ రెండు వర్గాలకు చంద్రబాబు పెద్ద పీట వేయడంపై అయ్యన్నపాత్రుడు మండిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement