సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో మూడో రోజు వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. భీమిలో శనివారం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. లోకేష్, భువనేశ్వరి సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయని విమర్శించారు. మత్స్యకారుల తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. మత్స్యకారులను దూషించిన చంద్రబాబును ఎవరైనా మరిచిపోతారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు.. దొరికిన దొంగ
చంద్రబాబు.. దొరికిన దొంగ అని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్నాడని ధ్వజమెత్తారు. సైకిల్ పోవాలంటూ చంద్రబాబే స్వయంగా ప్రచారంలో చెప్పారని ప్రస్తావించారు. తాను నిప్పంటూ ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు.. స్కీమ్‌ల పేరిట అన్ని స్కామ్‌లు చేసి జైల్లో ఉన్నారని దుయ్యబటారు.
‘బాబు ముసలోడు అయిపోయాడు, ఆయన్ను బయటకు తేవాలంటున్నారు. స్కీమ్‌ల పేరిట స్కామ్‌లు చేసిన చంద్రబాబును ప్రజలు నమ్ముతారా?. టీడీపీ నాయకుల్లో ఎవరికైనా దమ్ముంటే.. బాబు తప్పు చేయలేదని బెయిల్ అడగాలి. చట్టంలోని లొసుగుల గురించి మాట్లాడుతున్నారే గానీ.. చంద్రబాబు తప్పు చేయలేదని మాట్లాడటం లేదు’ అని మంత్రి సీదిరి మండిపడ్డారు.
చదవండి: చంద్రబాబు చరిత్ర ముగిసింది: విజయసాయిరెడ్డి
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్..
‘సామాజిక న్యాయం జరిగింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. నాడు-నేడు కార్యక్రమంంతో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంగ్లీష్ విద్యను ప్రతి పేదవాడకి అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఓట్ల కోసం కాకుండా.. పేదవాడి చిరునవ్వు కోసం సీఎం జగన్ తపిస్తారు. పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. యాదవులకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు.
మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్..
‘14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బలహీన వర్గాలకు ఏం చేశారు?. నాయి బ్రహ్మణుల తోకలను కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. బలహీన వర్గాలంటే బాబుకు చాలా చులకన భావం. చంద్రబాబు దొరికిన దొంగ. స్కీమ్‌ల పేరిట చంద్రబాబు చేసింది స్కామ్‌లే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు సీఎం జగన్. పేదవాడి పిల్లలు ఇంగ్లీష్‌లో రాణించాలని నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాజ్యంగ బద్ధంగా పేదలకు హక్కులు కల్పించింది సీఎం జగన్’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment