karumuri nageswar rao
-
బాబూ.. కేంద్రం వద్ద తలవంచడానికి కారణమేంటి?: కారుమూరి
సాక్షి, తాడేపల్లి: పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో కేంద్రం నిర్ణయానికి చంద్రబాబు ఎందుకు తలవంచారో తెలియాలన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోందని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కారుమూరి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏ కాలువలోనూ నీరు పారదు. పోలవరం విషయంలో కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. పోలవరం అంగుళం ఎత్తు తగ్గినా ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్రానికి చంద్రబాబు ఎందుకు తలొంచారో తెలియాలి. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. చంద్రబాబు ప్రీమియం చెల్లించకుండా రైతులను నష్టపరిచారు.ఏపీలో ఈక్రాప్‌తో సహా ఏదీ ఈ ప్రభుత్వం చేయటంలేదు. దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోంది. రైతులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. రైతుభరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం కొనుగోలులోనూ రైతులపై రకరకాల వేధింపులకు దిగారు. రైతుల ఉసురు తీయవద్దు. సూపర్ సిక్స్‌లో రైతులకు 20వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. రైతులకు చేయాల్సినవి అన్నీ చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది: మంత్రి కారుమూరి
సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు. ► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి ►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్‌లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్. ►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్ ►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత ►చంద్రబాబు జీవిమంతా స్కాములే ►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు ►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు. ►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు. ►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు ►మా నినాదం వై నాట్ 175 ►చంద్రబాబు, పవన్‌కు ఈ ఎన్నికల్లో చరమగీతమే ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్ ►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది. ►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు. ►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. ►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు. ►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన మోపిదేవి వెంకట రమణ ►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. ► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్. ► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది. ►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు. ►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి . ►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు. మంత్రిమేరుగ నాగార్జున ►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. ►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు. ►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్. ►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. ►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం. ►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం. ►దళితుల వెలివేతలు మర్చిపోం. ►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్. ►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా? ►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర ►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం. ►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి. ►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. ► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్ ►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం ►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు? ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు? ►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. -
YSRCP Bus Yatra: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో మూడో రోజు వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. భీమిలో శనివారం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు. తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. లోకేష్, భువనేశ్వరి సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయని విమర్శించారు. మత్స్యకారుల తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. మత్స్యకారులను దూషించిన చంద్రబాబును ఎవరైనా మరిచిపోతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు.. దొరికిన దొంగ చంద్రబాబు.. దొరికిన దొంగ అని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్నాడని ధ్వజమెత్తారు. సైకిల్ పోవాలంటూ చంద్రబాబే స్వయంగా ప్రచారంలో చెప్పారని ప్రస్తావించారు. తాను నిప్పంటూ ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు.. స్కీమ్‌ల పేరిట అన్ని స్కామ్‌లు చేసి జైల్లో ఉన్నారని దుయ్యబటారు. ‘బాబు ముసలోడు అయిపోయాడు, ఆయన్ను బయటకు తేవాలంటున్నారు. స్కీమ్‌ల పేరిట స్కామ్‌లు చేసిన చంద్రబాబును ప్రజలు నమ్ముతారా?. టీడీపీ నాయకుల్లో ఎవరికైనా దమ్ముంటే.. బాబు తప్పు చేయలేదని బెయిల్ అడగాలి. చట్టంలోని లొసుగుల గురించి మాట్లాడుతున్నారే గానీ.. చంద్రబాబు తప్పు చేయలేదని మాట్లాడటం లేదు’ అని మంత్రి సీదిరి మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు చరిత్ర ముగిసింది: విజయసాయిరెడ్డి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్.. ‘సామాజిక న్యాయం జరిగింది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. నాడు-నేడు కార్యక్రమంంతో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంగ్లీష్ విద్యను ప్రతి పేదవాడకి అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఓట్ల కోసం కాకుండా.. పేదవాడి చిరునవ్వు కోసం సీఎం జగన్ తపిస్తారు. పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. యాదవులకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు. మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్.. ‘14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బలహీన వర్గాలకు ఏం చేశారు?. నాయి బ్రహ్మణుల తోకలను కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. బలహీన వర్గాలంటే బాబుకు చాలా చులకన భావం. చంద్రబాబు దొరికిన దొంగ. స్కీమ్‌ల పేరిట చంద్రబాబు చేసింది స్కామ్‌లే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు సీఎం జగన్. పేదవాడి పిల్లలు ఇంగ్లీష్‌లో రాణించాలని నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాజ్యంగ బద్ధంగా పేదలకు హక్కులు కల్పించింది సీఎం జగన్’ అని తెలిపారు. -
చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: చంద్రబాబుది అక్రమ అరెస్టుకాదని, అనివార్యమైన అరెస్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని, దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు,. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసినందునే చంద్రబాబు అరెస్టు అయ్యారని మంత్రి అంబటి అన్నారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొనఆనరు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు మంత్రి అంబటి మాట్లాడుతూ.. అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని మాకు తెలీదా? కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా మేము ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. రూ.330 కోట్లు ఇవ్వటానికి వీల్లేదని సీఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు నోట్ ఫైల్ రాశారు. కానీ చంద్రబాబు ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారు. అంతదారుణంగా అక్రమాలు చేస్తే అరెస్టు చేయకూడదా?. చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారు. చంద్రబాబు సహకారంతోనే వారిద్దరూ పరారయ్యారు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్ విచారణ కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం, న్యాయం సహించదు. రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదు. ప్రజలకు ఇబ్బందులు కల్హిస్తే అణచివేస్తాం. ప్రజల నుండి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు కుదరవు. కోర్టులో వాస్తవాలు చెప్పుకుంటే మంచిది. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్ తెలుసుకుని మాట్లాడాలి. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్‌కు పంఇస్తాం. పవన్ వత్తాసు పలకటం ఏంటి షూటింగ్ వదిలి బయటకు రాలేని పవన్, ప్రజలను రోడ్డు మీదకు రమ్మనటం ఏంటి?. గావుకేకలు షూటింగ్లో పెట్టటం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకటం ఏంటి?. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు వద్దకు వచ్చి ఒక పూలబొకేని పవన్ ఇస్తే మంచిది. చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్ తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసు రాజకీయ కక్షతో బాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయమే చేయాలంటే 4 ఏళ్లుగా బాబు, లోకేష్ బయట తిరేవారు కాదని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న బాబుకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యనించారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు. బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై 2018లో జీఎస్టీ కేసు పెట్టిందని డొల్ల కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని తేలిందన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు చేశామని సెక్రటరీనే ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు MOU అని సిమెన్స్ కంపెనీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. యువతకు స్కిల్స్ నేర్చించలేదు కానీ.. తన స్కిల్స్‌తో వ్యవస్థను మేనేజ్ చేశాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ శాంపిల్ మాత్రమే.. ఇలాంటి స్కామ్‌లు చాలా చేశాడని అన్నారు. అన్నీ కేసుల్లో స్టేలపైనే ఎవరి పాపాలు పండుతాయో ఎవరికి శిక్ష వెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు. దివంగత ఎన్టార్ ఆత్మ క్షోభ , బాధ కూడా గతంలో వినిపించారు.. అది ఇప్పటికి పాపం పండింది. చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కటి కాదు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్‌లో అన్ని కేసులలో స్టేలపైనే జీవిస్తున్నాడు. పాపలన్నీ బద్దలైనాయిఅన్నింటికి శిక్ష తప్పదు. -మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చట్టానికి ఎవరూ అతీతులు కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సక్రమమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు.. గతంలోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్టులు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో వేల కోట్ల అక్రమాలకు చంద్రబాబు పాత్ర ఉంది కనుకనే అరెస్ట్ చేశారు. - నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు రాజకీయ సంబంధం లేదు చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తున్నాం. ఆయన అరెస్టుకు రాజకీయానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్ మెంట్లో ఏం జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా చర్చించాం. అసలు సంబంధంలేని సీమెన్ కంపెనీ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. సీమెన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ విధంగా అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కూడా ఎంక్వయిరీ చేసి దీనికి మాకు సంబంధం లేదని తేల్చేసింది. పూర్తిస్థాయిలో చర్చించి రూ. 370 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది అని ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం గానీ కక్ష సాధింపులు గాని లేవు. దొరికిపోయాడు కాబట్టే నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ మూడు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్నాడు. -నందిగామ ఎమ్మెల్యే,మొండితోక జగన్ మోహన్ రావు చంద్రబాబు అరెస్టు సమంజసమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయారు. సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు దారిమళ్లాయి. హవాలా రూపంలో చంద్రబాబు స్కాంకు పాల్పడ్డాడు. చంద్రబాబు అరెస్టు సమంజసమే. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే రాజకీయం చేయడం తగదు. -అనకాపల్లి జిల్లా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో భాగస్వామి. చంద్రబాబు వేల కోట్ల అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నది. చంద్రబాబు పాపం పండింది.. చంద్రబాబు ను జైలుకు పంపాలి. -రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే 2021లోనే అరెస్టు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రజల సొమ్ము రూ. 360 కోట్లు దోచేసశాడు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబ్ ఇలా అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తూ పూర్తి ఆధారాలతో అరెస్టు చేశారు. - ఎమ్మెల్యే తలారి వెంకట్రావు -
ప్రభుత్వంపై ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారు
-
సామాజిక న్యాయ నిర్మాత సీఎం జగన్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత కాలం సామాజిక న్యాయ నిర్మాతగా, సామాజిక విప్లవకారుడిగా సీఎం వైఎస్ జగన్ పేరు నిలిచిపోతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతానికి పైగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున మంగళవారం విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పుష్పాభిషేకం, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు, ఆశయాల్ని సీఎం జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు. సామాజిక న్యాయం అంటే ఇలా ఉండాలని రుజువు చేశారన్నారు. పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయానికి రూపకల్పన చేసి పెత్తందారీ వ్యవస్థను బద్దలు కొట్టారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఎవరూ చేయలేదు.. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు జరిగిన బీసీ సభలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. తాజాగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, దేశంలో బడుగు, బలహీనవర్గాలకు ఇంత పెద్ద మొత్తంలో ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గతంలో పనిచేసిన వారు బీసీలకు అంత చేశాం.. ఇంత చేశామంటూ మాటలు మాత్రమే చెప్పారని ఎద్దేవా చేశారు. తాము ఊహించనంతగా సీఎం వైఎస్ జగన్ బీసీలకు 68 శాతానికిపైగా సీట్లు కేటాయించారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాజ్యాధికారంలో బడుగులకు అత్యున్నత స్థానం కల్పించినందుకు గర్వపడుతున్నామన్నారు. ఏపీ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మహనీయులు కన్న కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. శాసనమండలిలో 14 స్థానాలు కేటాయించడం నభూతో న భవిష్యత్ అని అన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు. -
సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాంగింగ్: మంత్రి కారుమూరి
సాక్షి, విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వర రావు విజయవాడలో బుధవారం సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సప్లై ఎలా జరుగుతుందో మానిటర్ చేయడానికే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ సందర్బంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్ ద్వారా వాహనాన్ని ట్రాక్ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సివిల్ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమని అన్నారు. వార్డు మెంటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలోకి టీడీపీ కీలక నేతలు
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు టీడీపీ కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కాగా, తాడేపల్లిలోకి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి, ఆమె భర్త వావిలాల వెంకట రమేష్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారి వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా ఉన్నారు. -
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన ఏపీ మంత్రి కారుమూరి
-
సీఎం జగన్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
-
బీసీల గురుంచి మాట్లాడే అర్హత చంద్రబాబు కు లేదు : మంత్రి కారుమూరి
-
పవన్ మానసిక పరిస్థితి సరిగాలేదు : మంత్రి కారుమూరి
-
టీడీపీ కుట్ర బట్టబయలు: మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: ఆ ఫోరెనిక్స్ రిపోర్టు తాను ఇచ్చింది కాదని అమెరికాలోని ల్యాబ్‌కు చెందిన జిమ్ స్టాఫర్డ్ స్వయంగా స్పష్టం చేయడంతో టీడీపీ కుట్ర బట్టబయలైందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రిపోర్టును మార్చడానికి ఆయన సమ్మతించక పోవడంతో ఏకంగా సర్టిఫికెట్‌నే మార్చడం టీడీపీ దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను ఇబ్బంది పెట్టారని ఏ మహిళా.. ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా ఒక మార్ఫింగ్ వీడియోతో చంద్రబాబు అండ్ కో నీచ రాజకీయాలకు తెరతీశారని దుయ్యబట్టారు. సాంకేతికతను ఉపయోగించుకుని కుట్రలకు తెరతీయడంలో దిట్ట అయిన చంద్రబాబు, లోకేశ్ గ్యాంగ్ ఎంతటి నీచానికైనా ఒడిగడతారని మండిపడ్డారు. తప్పుడు రిపోర్ట్‌తో దొరికిపోయిన బాబు అండ్ గ్యాంగ్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వీడియో చూశామని టీడీపీకి చెందిన కొందరు మహిళలు సభ్యత మరచి.. అడ్డగోలుగా మాట్లాడుతుండడం పట్ల సభ్య సమాజం తల దించుకుంటోందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తున్న లోకేశ్ చిత్రాలు చూసి కూడా ఏమీ మాట్లాడని చంద్రబాబు అండ్ కోను ఏమనుకోవాలని నిలదీశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: ‘టీడీపీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబూ ఫేక్’ -
ఫేక్ వీడియోలతో టీడీపీ చీప్ పాలిటిక్స్ చేస్తుంది: కారుమూరి
-
యాదవుల అభ్యున్నతికి ప్రణాళిక
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బీసీల్లో యాదవులను అతి పెద్ద క్యాస్ట్‌గా ప్రభుత్వం గుర్తించిందని, అందుకే మన జాతి అభ్యున్నతికి ఒక ప్రణాళిక సిద్ధం అవుతోందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. అఖిలభారత యాదవ మహాసంఘం ఆవిర్భావం సందర్భంగా ఆదివారం విజయవాడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాజికవర్గానికి సంబంధించిన సంఘాలన్నీ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్‌ను చేశారని గుర్తుచేశారు. తనకు మంత్రిపదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవ జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నానని, జాతి తలదించుకునే పని మాత్రం చేయనని స్పష్టంచేశారు. యాదవ జాతి ఒక్కటే ఓట్లు వేస్తే గెలవలేదని, మిగిలిన సామాజికవర్గాల ప్రజల మద్దతు కూడా లభించటం వల్లనే విజయం సాధించానని తెలిపారు. ప్రాంతాలను, పార్టీలను, కులమతాలను చూడం.. అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్న విధంగా తుదిశ్వాస వరకు అందరివాడిగానే ఉంటానని చెప్పారు. ఏపీలో ప్రతి జిల్లాలో యాదవభవన్ కోసం కనీసం రెండెకరాలు ఇప్పించాలని తెలంగాణ నుంచి వచ్చిన వి.చినశ్రీశైలంయాదవ్ కోరగా.. ప్రతి జిల్లాలో ఒక ఎకరం, హెడ్‌క్వార్టర్‌లో ఐదెకరాలు ఇప్పించేందుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు. బీసీ వర్గాలకు జెండా, అజెండా ఉండాలి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సంఘాలు రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండాలన్నారు. బీసీ వర్గాలకు ఒక జెండా, అజెండా ఉండాలని చెప్పారు. సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో సన్నిధి గొల్లలకు చట్టబద్ధత కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 45 ఏళ్లు దాటిన గీత, చేనేత కార్మికులకు ఇచ్చినట్లుగానే గొర్రెల కాపలాదారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు యు.పేరయ్య, నేతలు బచ్చుల అర్జునుడు, పీఎల్‌పీయాదవ్, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, సంఘం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు ఎన్.సునీల్, ఆర్.సత్యశేఖర్, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని యాదవ సామాజికవర్గ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేనిని చూసి నేర్చుకోవాలా బాబూ!
సాక్షి,పశ్చిమ గోదావరి: రౌడీ షీటర్ చింతమనేని చూసి నేర్చుకోండి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం తణుకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ 40 ఏళ్ల అనుభవం ఉందంటూ చెప్పుకునే చంద్రబాబుకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 5 నెలల పాలన చూసి మింగుడుపడటం లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో వైఎస్సార్ సీపీకి ప్రజలు నీరాజనం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రౌడీయిజం పెచ్చు మీరిపోయిందని, ప్రజలకు 10 నెలలు ఇసుక ఇవ్వకుండా టీడీపీ నాయకులు దోచుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాలంటీర్లు తలుపు తడుతున్నారంటూ చంద్రబాబు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాలు ప్రజల చేతుల్లోనే రాలుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుపై కేసులు ఉన్నా ఆయన స్టే తీసుకుని కాలం గడుపుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల మాదిరి వైఎస్సార్ సీపీకి రౌడీయిజం చేయడం రాదని అన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని.. హత్య రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబే అని అన్నారు. ఇక బసవతారకం స్కూల్ పెట్టిన చంద్రబాబు అందులో ఎందుకు తెలుగు మీడియం ప్రవేశపెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పిల్లలను ఇంగ్లీషు మీడియంలో స్కూళ్లలోనే చదవిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు స్క్రిప్టును పవన్ చదువుతారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. -
తణుకులో పర్యటించిన మంత్రి, ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి : గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజులు శనివారం తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు సుమారు రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఇరగవరం మండంలం రేలంగి గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడానికి ముందుకు వచ్చారు. దీంతో వారందరికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మంత్రి శీరంగనాథరాజులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే తణుకులో వైఎస్సార్సీపీ అభిమానులు నడిపిస్తున్న రాజన్న క్యాంటీన్‌ను వారు సందర్శించారు. మండలంలోని తేతలి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించగా, తణుకు బ్యాంకు కాలనీ నందు రహదారి నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. సమారు 12000 మంది గ్రామ వాలంటీర్లతో తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో సమావేశమై, అక్కడి సమస్యలపై మంత్రి శీరంగనాథరాజు, ఎంపీ ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధిదారులకు చేరాలని వారు ఆదేశించారు. -
మంత్రిగారూ.. ఇటో లుక్కేయరూ !
(పెనుగొండ), న్యూస్‌లైన్ : పెనుగొండ మండలం వెంకట్రామపురం గ్రామస్తులకు మంచినీటిని సరఫరా చేసేందుకు రూ.23.20 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. పనులు పూర్తరుు 4 నెలలు గడిచినా దానిని ప్రారంభించలేదు. దీంతో గ్రామస్తులు మంచినీటి కోసం చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో రక్షిత మంచి నీటి సరఫరా పథకం లేకపోవడంతో ఆరేళ్ల క్రితం ఈ విషయూన్ని అప్పటి పెనుగొండ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రూ.15 లక్షలను మంజూరు చేరుుంచారు. 2008 నవంబరు 20న అప్పటి జెడ్పీ చైర్మన్, ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2012లో ఓహెచ్ఎస్ఆర్ పనులు పూర్తయ్యా యి. పైపులైన్ విస్తరణ పనులు చేపట్టకపోవడం, మోటార్, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఓహెచ్ఎస్ఆర్ అలంకారం ప్రాయంగా మిగిలిపోరుుంది. ఎట్టకేలకు 2013 మార్చిలో పైపులైన్ విస్తరణ, ఇతర పనుల కోసం రూ.8.20 లక్షలను మంత్రి మంజూరు చేయిం చారు. మొత్తానికి నాలుగు నెల క్రితం పనులన్నీ పూర్తయ్యూరుు. దీనిని ప్రారంభించే తీరిక ప్రజాప్రతినిధులకు లేకపోవడంతో ఈ పథకం నేటికీ ప్రజలకు అక్కరకు రావడం లేదు. దీనిని మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. మంత్రి పితాని, అధికారులు స్పందించి తక్షణం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం జరిపించాలని, తమకు రక్షిత మంచినీటిని అందించే ఏర్పాటు చేయూలని గ్రామస్తులు కోరుతున్నారు.